S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/08/2016 - 07:38

పామర్రు, డిసెంబర్ 7: ఆంధ్ర రాష్ట్రంలో రానున్న మూడు సంవత్సరాలలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలు అన్నింటినీ అనుసంధానం చేస్తూ ఆయా ప్రాంతాలలో గురుకుల పాఠశాలలుగా రూపాంతరం చేయనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు వెల్లడించారు.

12/08/2016 - 07:37

జి.కొండూరు, డిసెంబర్ 7: రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. మండల పరిధిలోని వెలగలేరు మార్కెట్ యార్డులో ఆయన బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఉమ మాట్లాడుతూ పట్టిసీమ ద్వారా విడుదలైన ఒండ్రుమట్టితో కూడిన గోదావరి నీటితో ధాన్యం దిగుబడులు పెరిగాయన్నారు.

12/08/2016 - 07:37

పామర్రు, డిసెంబర్ 7: రాష్ట్రంలో రెండున్నరేళ్ల ప్రభుత్వ పాలనలో గ్రామాల అనుసంధాన అంతర్గత రోడ్లకు రూ.6వేల కోట్ల నిధులు విడుదల చేసి పునఃనిర్మించినట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు.

12/08/2016 - 07:36

తాండూరు, డిసెంబర్ 7: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేయడంతో పాటు, ఇక ముందు దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించడానికి కార్యాచరణను రూపొందిస్తోందని వికారాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ సురేష్ పోద్దార్, తాండూరు సబ్-కలెక్టర్ సందీప్ కుమార్‌ఝూ పేర్కొన్నారు.

12/08/2016 - 07:35

కాచిగూడ, డిసెంబర్ 7: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం చిత్రపరిశ్రమకు తీరనిలోటని ప్రజానటి జమునా రమణరావు అన్నారు. ఘంటసాల ఆరాధనోత్సవాలు ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జమున జయలలిత చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. శ్రీకృష్ణ విజయంలో జయలలితో పాటు తాను నటించానని పేర్కొన్నారు.

12/08/2016 - 07:35

హైదరాబాద్, డిసెంబర్ 7: తెలుగు భాష ఔన్నత్యాన్ని పరిరక్షిస్తూ, విశిష్టతను విశ్వవ్యాప్తం చేయడానికి కృషి చేస్తున్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 31 వసంతాల్ని సగర్వంగా పూర్తి చేసుకుందని, తెలుగు భాషను, సాహిత్యాన్ని, సంస్కృతిని, కళలను పరిపుష్టం చేయడానికి ఏర్పడిన ఈ విశ్వవిద్యాలయం ఉన్నతస్థాయి పరిశోధనా కేంద్రంగా పనిచేస్తుందని వైస్ చాన్సలర్ ఎస్వీ సత్యనారాయణ తెలిపారు.

12/08/2016 - 07:34

హైదరాబాద్, డిసెంబర్ 7: భారతదేశ సరిహద్దులో రాత్రింబవళ్లుకాపలా కాస్తూ దేశాన్ని కాపాడుతున్న సైనికుల కోసం అవసరమైన సహకారాన్ని అందిస్తూ, వారి సంక్షేమానికి సంపూర్ణంగా తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం రవీంద్రభారతిలో జరిగిన సైనిక దళాల పతాక దినోత్సవానికి నాయిని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

12/08/2016 - 07:34

హైదరాబాద్, డిసెంబర్ 7: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా శివారు ప్రాంతాల్లో రూ.1900 కోట్ల హడ్కో నిధులతో చేపడుతున్న తాగునీటి సరఫరా మెరుగు ప్రాజెక్ట్‌లో పైప్‌లైన్ విస్తరణ పనులను జలమండలి ఎండి దానకిషోర్ బుధవారం వివిధ ప్రాంతాల్లో తనిఖీ చేశారు. ముందుగా ఎండి అధికారులతో కలిసి సరూర్‌నగర్ డివిజన్ డాక్టర్స్ కాలనీలో చేపట్టిన 200ఎంఎం డయా అంతకంటే ఎక్కువ పరిమాణం గల ఎంఎస్ పైప్‌లైన్ విస్తరణ పనులను పరిశీలించారు.

12/08/2016 - 07:25

హైదరాబాద్, డిసెంబర్ 7: పంచాయతీరాజ్ శాఖలో జనవరి 10 నుండి నగదు రహితలావాదేవీలు కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ అంశంలో బ్యాంకర్లు, పోస్టల్ సిబ్బంది సహకారం అందించాలని పంచాయితీ, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. నగదు రహిత లావాదేవీలు చేపట్టే అంశంలో కూలంకషంగా చర్చించేందుకు బ్యాంకర్లు, పోస్టల్ అధికారులతో సచివాలయంలో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

12/08/2016 - 07:22

హైదరాబాద్/వనస్థలిపురం, డిసెంబర్ 7: వైద్యుడు దేవుడితో సమానమంటారు..చేతులెత్తి మొక్కుతారు. అలాంటి వైద్యులే కార్పొరేట్ ఆసుపత్రుల్లో రోగుల పాలిట యమదూతల్లా వ్యవహరిస్తున్నారు. అలాంటి ఓ దారుణ ఘటన నగరంలోని ఎల్బీనగర్‌లోగల కామినేని ఆసుపత్రిలో చోటుచేసుకుంది. పది రోజుల క్రితం స్వాతి అనే గర్భిణిని ప్రసవం కోసం ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువచ్చారు. సిజేరియన్ ద్వారా వైద్యులు ప్రసవం చేశారు.

Pages