S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/08/2016 - 07:54

అక్కినేని నాగేశ్వరరావు మనమడు, నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని జివికె కుటుంబానికి చెందిన శ్రీయాభూపాల్‌ను వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. అఖిల్, శ్రీయాభూపాల్ నిశ్చితార్ధం ఈనెల 9న జరగనుంది. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులతోపాటుగా అక్కినేని కుటుంబ వేడుకగా జరపనున్నారు. వివాహం తరువాత జరిగే రిసెప్షన్‌ను గ్రాండ్‌గా నిర్వహించడానికి అక్కినేని కుటుంబం సన్నాహాలు చేస్తోంది.

12/08/2016 - 07:53

హీరో నితిన్ తాజాగా ‘అఆ’ సినిమా హిట్ అందుకుని, 50 కోట్ల మార్కెట్‌లో ఎంట్రీ ఇచ్చాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తరువాత నితిన్‌తో మళ్లీ ఓ సినిమా చేయడానికి దర్శకుడు త్రివిక్రమ్ సిద్ధవౌతున్నాడు. అయితే ఈసారి దర్శకుడుగా కాకుండా నిర్మాతగా? పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్‌లు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ఈమధ్యే ప్రారంభమైంది. ఈ సినిమాకు ‘లై’ అనే పేరును ఖరారు చేశారు.

12/08/2016 - 07:51

‘జనతా గ్యారేజ్’ విడుదలై అప్పుడే మూడునెలలు గడిచిపోయాయి. ఇంతవరకు ఎన్టీఆర్ తదుపరి సినిమా ఇంకా ఓకే చెయ్యలేదు. ఇప్పటికే పలువురు దర్శకులతో కథ చర్చలు జరిపిన ఆయన తన నెక్స్ట్ సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని ఆయన ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సర్వత్రా ఆసక్తినెలకొన్న ఈ సినిమా విషయంలో ఫైనల్‌గా ఎన్టీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

12/08/2016 - 07:50

టెన్షన్‌గా ఉంది
ప్రతి సినిమా విడుదలయ్యేటప్పుడు కచ్చితంగా టెన్షన్ అనేది ఉంటుంది. అయితే ఈ సినిమాకు ఓ స్పెషల్ ఉండడంతో అది మరింత ఎక్కువైంది. రీమేక్ సినిమా అవడంతో ఎలా ప్రేక్షకులు ఆదరిస్తారా అని ఎదురుచూస్తున్నాను.
రీమేక్ ఎందుకు?

12/08/2016 - 07:48

‘వెళ్లాయిల్లా పట్టాదారి’ సినిమాతో సంచలన విజయం సాధించాడు హీరో ధనుష్. ఆ సినిమా ‘రఘువరన్’గా తెలుగులో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘విఐపి 2’ పేరుతో చిత్రాన్ని రూపొందించే సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ ప్రెట్టీ గర్ల్ కాజోల్ కీలక పాత్రలో నటిస్తుందట!!

12/08/2016 - 07:47

బాలీవుడ్ బ్యూటీ.. శిల్పాశెట్టి గ్లామర్ హీరోయిన్‌గా ఎలాంటి ఇమేజ్ తెచ్చుకుందో అందరికీ తెలుసు. ఇక హీరోయిన్‌గా కెరీర్‌లో బ్రేక్ పడ్డాక ఈ అమ్మడు బిజినెస్‌మన్‌ని వివాహం చేసుకుని బిజీగా మారింది. ఆకట్టుకునే గ్లామకు తోడు యోగాలో ఆమెకు ఆసక్తి ఎక్కువ. ప్రావీణ్యమూ ఉంది. గతంలో యోగా విన్యాసాలు చేస్తూ వీడియోలూ విడుదల చేసింది. సనాతన యోగ సంప్రదాయాలు పుట్టింది ఇండియాలోనే అయినా..

12/08/2016 - 07:46

నల్లగొండ టౌన్, డిసెంబర్ 7: పోలీస్ ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నరుూం నేర చరిత్ర ఆధారంగా తీస్తున్న ‘ఖయ్యూం భాయ్’ సినిమా చిత్రీకరణ నల్లగొండ పట్టణంలో అర్ధాంతరంగా ఆగిపోయింది. సినిమా యూనిట్ ఎలాంటి ముందస్తు అనుమతులు పొందకుండా రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం కల్గించేలా సన్నివేశాల చిత్రీకరణ సాగిస్తుండటాన్ని నల్లగొండ పోలీసులు అడ్డుకుని షూటింగ్ నిలిపివేశారు.

12/08/2016 - 07:45

రామ్‌కార్తీక్, సనాఖాన్ హీరో హీరోయిన్లుగా శ్రీమతి బొడ్డు లక్ష్మి సమర్పణలో ఈస్ట్‌వెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విశాఖ థ్రిల్లర్ వెంకట్ దర్శకత్వంలో వరప్రసాద్ బొడ్డు నిర్మిస్తున్న చిత్రం ‘మామ.. ఓ.. చందమామ’. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో చిత్రం యూనిట్ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో...

12/08/2016 - 07:40

పటమట, విజయవాడ 7: అక్షరాస్యత వల్ల ఆరోగ్యంపై అవగాహన పెరుగుతుందని, దీనికి మన రాష్ట్రంలో ఉన్న అంగన్‌వాడీలు, డ్వాక్రా సంఘాలు విరివిగా కృషి చేయాలని, ఉద్యోగులుగా కాకుండా పేద బాలలకు తల్లులుగా సేవలందించినప్పుడే ఇది సాధ్యవౌతుందని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు.

12/08/2016 - 07:39

అవనిగడ్డ, డిసెంబర్ 7: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలకు అందించటమే ధ్యేయంగా కృషి జరగాలని కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి స్వామీజీలు పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని కృష్ణా పుష్కర ఘాట్ వద్ద కంచికామకోటి పరమాచార్య చంద్రశేఖర స్వామీజి వారి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం గాంధీ క్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో స్వామీజీలు భక్తులనుద్దేశించి అనుగ్రహభాషణ చేశారు.

Pages