S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/08/2016 - 06:15

విజయవాడ, డిసెంబర్ 7: రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 12.23 శాతం మేరకు వృద్ధి సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పాలనలో సగ భాగం పూర్తి చేశానని, హాఫ్ ఇయర్లీ పరీక్ష పెట్టుకున్నామని తెలిపారు. సిఎం తన రెండున్నర ఏళ్ళ పాలనలో చోటు చేసుకున్న వృద్ధి, అభివృద్ధి గురించి వెలగపూడి సచివాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు.

12/08/2016 - 06:14

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: పెద్ద నోట్ల రద్దుతో తమ ప్రభుత్వం జనశక్తికి పట్టంకట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఈ చారిత్రక నిర్ణయానికి ప్రజల మద్దతు ఉందని స్పష్టం చేసిన ఆయన, ప్రతిపక్షాల తీరును ఎండగట్టారు. రెండుసార్లు తాను రాజ్యసభకు హాజరైనా కూడా పెద్ద నోట్ల రద్దుపై చర్చకు విపక్షాలు అంగీకరించలేదని, ఆ విధంగా తమ అసలు స్వరూపాన్ని ఎండగట్టుకున్నాయని అన్నారు.

12/08/2016 - 06:11

చెన్నై, డిసెంబర్ 7: సీనియర్ జర్నలిస్టు, రాజ్యసభ మాజీ సభ్యుడు, రాజకీయ విశే్లషకుడు, నటుడు చో రామస్వామి బుధవారం ఉదయం ఇక్కడి అపోలో ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయనకు 82 ఏళ్లు. తమిళనాడు గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు, ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, రాష్టమ్రంత్రులు, డిఎంకె నాయకుడు ఎంకె స్టాలిన్, సూపర్‌స్టార్ రజనీకాంత్ సహా పలువురు ప్రముఖులు చో నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు.

12/08/2016 - 06:10

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: గత రెండు వారాలుగా పార్లమెంట్ ఉభయ సభల్లో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై రాజకీయ కురువృద్ధుడు, బిజెపి సీనియర్ నేత ఎల్‌కె అద్వానీ తీవ్ర ఆగ్రహాన్ని, మనస్తాపాన్ని వ్యక్తం చేశారు. పెద్దనోట్ల రద్దుకు సంబంధించి వరుసగా లోక్‌సభ, రాజ్యసభల్లో ఎలాంటి కార్యకలాపాలు సాగకపోడవం పట్ల ఆగ్రహించిన ఆయన అధికార, ప్రతిపక్ష సభ్యులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

12/08/2016 - 06:07

నెల్లూరు/ సూళ్లూరుపేట, డిసెంబర్ 7: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆకాశమే హద్దుగా విజయపరంపర కొనసాగిస్తోంది. రోదసి పరిశోధనలో ఇస్రో సరికొత్త రికార్డు సృష్టించింది. షార్ నుండి స్వర్ణకాంతులు వెదజల్లుతూ నింగిలోకి ఎగసిన పిఎస్‌ఎల్‌వి వాహక నౌక ఇస్రోకు సరికొత్త రికార్డు తెచ్చిపెట్టింది.

12/08/2016 - 05:47

ముంబయి, డిసెంబర్ 7: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) అందరి అంచనాలను తలకిందులు చేసింది. కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. బుధవారం ఇక్కడ నిర్వహించిన ద్రవ్యసమీక్షలో రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్ల జోలికి వెళ్లని ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్.. నగదు నిల్వల నిష్పత్తినీ ముట్టుకోలేదు. సెప్టెంబర్‌లో రఘురామ్ రాజన్ నుంచి ఆర్‌బిఐ పగ్గాలు అందుకున్న పటేల్..

12/08/2016 - 05:43

ముంబయి, డిసెంబర్ 7: పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తొందరపాటుగా తీసుకున్నది కాదని, అన్నివిధాల ఆలోచించి, సమగ్ర సంప్రదింపుల తర్వాతే తీసుకున్నదని ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకులు, ఎటిఎమ్‌ల వద్ద ప్రజలు పడుతున్న కష్టాలు, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల మధ్య పటేల్ పైవిధంగా వివరణ ఇచ్చారు.

12/08/2016 - 05:42

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: పశ్చిమ తీరంలో 30 బిలియన్ డాలర్ల వ్యయంతో దేశంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాన్ని నెలకొల్పేందుకు ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్)లు బుధవారం ఓ ఒప్పందంపై సంతకాలు చేశాయి.

12/08/2016 - 05:41

ముంబయి, డిసెంబర్ 7: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లు యథాతథంగానే ఉన్న నేపథ్యంలో మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. నిజానికి ఉదయం ఆరంభంలో లాభాల్లో కదలాడిన సూచీలు.. ఆర్‌బిఐ సమీక్షలో నిర్ణయాలు వెలువడుతున్నకొద్దీ నష్టాల్లోకి జారుకున్నాయి.

12/08/2016 - 05:41

హైదరాబాద్, డిసెంబర్ 7: స్టార్టప్ సంస్థల ఏర్పాటు ఔత్సాహికులకు జెఎన్‌టియు హైదరాబాద్ ప్రత్యేక శిక్షణ అందిస్తోందని ఇడిసి సమన్వయకర్త డాక్టర్ ఎం ఆషారాణి తెలిపారు. ఆసక్తి ఉన్నవారు జెఎన్‌టియు హైదరాబాద్ వెబ్‌సైట్‌లో వివరాలు పొందవచ్చని చెప్పారు.

Pages