S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/08/2016 - 07:21

రాజమహేంద్రవరం, డిసెంబర్ 7: ‘చూస్తూ చూస్తూనే మూడేళ్లు పూర్తవుతున్నాయి. కళ్లు మూసుకుంటే మరో రెండేళ్లు గడిచిపోతాయి.. అప్పుడు అధికారం మనదే.. ఓపిక పట్టండి.. చంద్రబాబు చేయని పనులన్నీ మనం అధికారంలోకొచ్చిన తర్వాత పూర్తి చేసుకోవచ్చు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

12/08/2016 - 07:20

విజయవాడ, డిసెంబర్ 7: డిసెంబర్ నెల మొదటివారం విజయవంతంగా ముగించాం, మిగిలిన 20 రోజులు ఇదే స్ఫూర్తితో పని చేసి డిమానిటైజేషన్ సమస్యను అధిగమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. బ్యాంకర్లు, ఆర్థికశాఖ అధికారులతో ఆయన బుధవారం తన నివాసం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. డిమానిటైజేషన్ ప్రారంభమై ఇప్పటికి నెల రోజులు అయ్యిందంటూ నగదు రహితంగా రాష్ట్రాన్ని మార్చడంలో ఉత్తీర్ణులు అయ్యామన్నారు.

12/08/2016 - 07:19

వరంగల్, డిసెంబర్ 7: దేశంలో నల్లధనాన్ని వెలికితీయడానికి కేంద్రం తాజాగా చేపట్టిన పెద్దనోట్ల రద్దు కార్యక్రమం కేవలం ప్రారంభమేనని, దశాబ్దాలుగా అక్రమంగా దాచుకున్న నల్లధనాన్ని బయటకు తీసుకురావటానికి కేంద్రం భవిష్యత్తులో అనేక రకాల చర్యలు తీసుకుంటుందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు తెలిపారు.

12/08/2016 - 07:19

మహబూబ్‌నగర్, డిసెంబర్ 7: రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని బాధ్యత గల రాజకీయ పార్టీగా.. రైతు గొంతుకగా నిలుస్తామని.. అసెంబ్లీ శీతకాల సమావేశాలు ఎప్పుడు నిర్వహించినా అప్పుడు రైతుల సమస్యలపై అసెంబ్లీని స్తంభింపజేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ హెచ్చరించారు. మహబూబ్‌నగర్‌లో బుధవారం బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నా నిర్వహించారు.

12/08/2016 - 07:17

సంగారెడ్డి టౌన్, డిసెంబర్ 7: పేద విద్యార్థులకు కడుపునిండా అన్నం పెట్టాలనే ఉద్దేశ్యంతో అక్షయపాత్ర ఫౌండేషన్ ముందుకు రావడం అభినందనీయమని సాగునీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. మండల కేంద్రమైన కంది శివారులో నిర్మించనున్న అక్షయపాత్ర భోజన శాల తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి హై-టెక్ భోజనశాలగా నిలిచిపోతుందన్నారు.

12/08/2016 - 07:17

విజయవాడ (స్పోర్ట్స్), డిసెంబర్ 7: భవానీ ద్వీపాన్ని ప్రపంచస్థాయి పర్యాటకకేంద్రంగా చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎపి టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వి జయరామిరెడ్డి అన్నారు. కృష్ణానది తీరాన ఉన్న పున్నమిఘాట్‌లో వాటర్‌స్పోర్ట్స్ బోట్లను ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు.

12/08/2016 - 06:52

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: ప్రతిపక్షం టీవీలు, పత్రికల్లో ప్రచారం సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తోంది తప్ప ప్రజల సమస్యల గురించి చర్చ జరిపేందుకు ఇష్టపడటం లేదని రాజ్యసభ నాయకుడు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దుయ్యబట్టారు.

12/08/2016 - 06:50

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: నాలుగు రోజులుగా లోక్‌సభలో కొనసాగుతున్న ప్రతిష్టంభన బుధవారం కూడా కొనసాగింది. పెద్ద నోట్ల రద్దు మూలంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి టిఆర్‌ఎస్ పక్ష నాయకుడు జితేందర్ రెడ్డి 193 కింద ఇచ్చిన నోటీసుపై చర్చ జరిపేందుకు స్పీకర్ సుమిత్రా మహాజన్ చేసిన ప్రయత్నాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు నినాదాలతో దెబ్బతీశారు.

12/08/2016 - 06:49

బళ్లారి, డిసెంబర్ 7: గనుల అక్రమ తవ్వకాలకు పాల్పడినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న మైనింగ్ దిగ్గజం గాలి జనార్ధన్ రెడ్డి ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. కర్ణాటక రాష్ట్ర మాజీ మంత్రి కూడా అయిన గాలి రద్దయిన పాత పెద్ద నోట్లలో ఉన్న రూ.100 కోట్ల నల్ల ధనాన్ని తెల్ల ధనంగా మార్చుకున్నట్టు అతని వద్ద డ్రైవర్‌గా పనిచేసిన రమేశ్ గౌడ తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్టు సమాచారం.

12/08/2016 - 06:48

హల్‌ద్వానీ, డిసెంబర్ 7: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పారదర్శకత పాలన సాగుతోందని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఉద్ఘాటించారు. బిజెపి ప్రారంభించిన పరివర్తన యాత్ర బుధవారం ఉత్తరాఖంఢ్‌లో ముగిసింది. దేశ ప్రజలు మార్పునకు ఓటేయాలని ఈ సందర్భంగా షా పిలుపునిచ్చారు. వ్యవస్థలో మార్పుకోసమే బిజెపి పరివర్తన యాత్రకు శ్రీకారం చుట్టిందని ఆయన స్పష్టం చేశారు.

Pages