S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/08/2016 - 06:45

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: ‘గ్యాంగ్ రేప్ సంఘటన రాజకీయ కుట్ర’ అంటూ తాను చేసిన వ్యాఖ్యపై ఉత్తరప్రదేశ్ మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్ చెప్పిన క్షమాపణను సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. ఆజంఖాన్ చెప్పింది బేషరతు క్షమాపణ కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తన వివాదాస్పద వ్యాఖ్యలపై బులంద్‌షహర్ గ్యాంగ్ రేప్ బాధితులకు బేషరతుగా క్షమాపణ చెబుతున్నానని నవంబర్ 17న ఆజంఖాన్ సుప్రీంకోర్టుకు తెలిపారు.

12/08/2016 - 06:45

న్యూయార్క్, డిసెంబర్ 7: టైమ్ మ్యాగజైన్ ఏటా ప్రకటించే అత్యంత మేటి వ్యక్తిగా 2016 సంవత్సరానికి అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. అమెరికా రియల్ ఎస్టేట్ టైకూన్, అత్యంత వాడివేడిగా, ఉత్కంఠగా సాగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీని ఓడించి విజేతగా నిలిచిన ట్రంప్‌ను పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించారు.

12/08/2016 - 06:44

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: ఆర్థికపరమైన మార్పులు రాత్రికి రాత్రే వచ్చే అవకాశం ఉండదు.. కాని అందుకు సంబంధించిన అజెండా, రోడ్‌మ్యాప్‌లను ఏర్పరచక తప్పదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. దేశంలో 500, 1000 నోట్లను రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయ పర్యవసానాలను ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధంగా ఉన్నారని బుధవారం ఇక్కడ జరిగిన పెట్రోటెక్ సదస్సులో జైట్లీ ఉద్ఘాటించారు.

12/08/2016 - 06:44

ఇస్లామాబాద్, డిసెంబర్ 7: పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పిఐఏ)కు చెందిన విమానం ఒకటి బుధవారం అబోటాబాద్ సమీపంలోని హవెలియన్ వద్ద కొండ ప్రాంతంలో కూలిపోవడంతో విమానంలోని 47 మంది చనిపోయారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఖైబర్ ఫక్తూన్‌ఖ్వా రాష్ట్రంలోని చిత్రాల్‌నుంచి ఇస్లామాబాద్‌కు బయలుదేరిన ఈ విమానం కొద్ది సేపటికే రాడార్‌తో సంబంధాలు కోల్పోయింది.

12/08/2016 - 06:42

న్యూయార్క్, డిసెంబర్ 7: ద్వైపాక్షిక చర్చలకు సంబంధించి అన్ని మార్గాలను భారత్ మూసేసిందని పాకిస్తాన్ ఆరోపించింది. కాశ్మీర్ అంశాన్ని పరిష్కరించడంతోపాటు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాల్సిన బాధ్యత ఐక్యరాజ్య సమితిపై ఉందని స్పష్టం చేసింది.

12/08/2016 - 06:41

మేరేడు, డిసెంబర్ 7: ఇండోనేసియాలోని అసే రాష్ట్రంలో బుధవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం తాకిడికి కనీసం 97 మంది చనిపోగా, వందలాది మంది గాయపడ్డారు. సుమత్రా దీవుల్లోని ముస్లింలు అధిక సంఖ్యలో ఉండే ఈ జిల్లాలో జనం తెల్లవారుజాము ప్రార్థనలకోసం సిద్ధమవుతుండగా ఈ భూకంపం సంభవించింది.

12/08/2016 - 06:39

చెన్నై, డిసెంబర్ 7: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత భౌతికంగా లేకపోయినా లక్షలాది మంది హృదయాల్లో సజీవంగానే ఉన్నారు. మెరీనా బీచ్‌లో ప్రియతమ నాయకురాలిని ఖననం చేసిన సమాధివద్దకు జయ అభిమానులు వెల్లువలా తరలివస్తున్నారు. తన రాజకీయ గురువు, దివంగత ఎంజి రామచంద్రన్ సమాధికి ఇరవై అడుగుల దూరంలోనే అన్నాడిఎంకె అధినేత్రి పార్దివదేహాన్ని మంగళవారం ఖననం చేసిన సంగతి తెలిసిందే.

12/08/2016 - 06:28

హైదరాబాద్, డిసెంబర్ 7: పెద్ద నోట్లు రద్దు చేసి 28 రోజులు గడిచినప్పటికీ బ్యాంకుల వద్ద క్యూలైన్లు మాత్రం తగ్గడం లేదని, వారంలో బ్యాంకుల వద్ద సాధారణ పరిస్థితి తీసుకురావాలని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు.

12/08/2016 - 06:27

హైదరాబాద్, డిసెంబర్ 7: శాసనసభ శీతాకాల సమావేశాలను ఈ నెల 16 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమావేశాల నిర్వహణపై గవర్నర్‌ను కోరుతూ నోట్ పంపించాల్సిందిగా శాసనసభ కార్యదర్శి రాజాసదారామ్‌ను సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌లో శాసనసభ సమావేశాల నిర్వహణపై సన్నాహక సమావేశం జరిగింది.

12/08/2016 - 06:16

అసలే రాజధాని లేని రాష్ట్రం. ఆపై రూ.16 వేల కోట్ల లోటుబడ్జెట్. గ్రామీణ ప్రాంతాలే తప్ప హైదరాబాద్ మాదిరిగా పెద్ద నగరం నుంచి ఆదాయం లేదు. సమర్థులైన ఐఏఎస్‌లంతా తెలంగాణకు వెళ్లగా, మిగిలిన వారే దిక్కయిన దుస్థితి. ఇంకోవైపు ఎన్నికల హామీలు, సంక్షేమ పథకాలకే లక్షా80 వేల కోట్లు అనివార్యంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అడ్డంకులు అనేకం..

Pages