S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/20/2017 - 23:36

రేగిడి, ఆగస్టు 20: శ్రీకాకుళం జిల్లా, రేగిడి మండలం ఉణుకూరు పంచాయతీ పోరాం గ్రామ సమీపంలో ఉన్న మడ్డువలస ప్రధాన కాలువలో ఆదివారం స్నానానికి దిగి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. రాజాంకు చెందిన దుప్పాడ రోహిత్‌నాయుడు(18), దాసరి రామరాజు(18) పోరం గ్రామంలో తన స్నేహితుడి ఇంటికి వెళ్లి, అక్కడ నుంచి మరో ముగ్గురితో కలిసి కాలువలో స్నానానికి ఐదుగురు దిగారు.

08/20/2017 - 23:36

రాజమహేంద్రవరం, ఆగస్టు 20: గోదావరి నదికి వరద తాకిడి తగిలింది. గోదావరి నది పరివాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల వల్ల వరద ఉద్ధృతి ధవళేశ్వరం బ్యారేజి వద్ద స్వల్పంగా పెరుగుతోంది. అఖండ గోదావరి నది ఎగువ ప్రాంతమైన భద్రాచలం వద్ద వరద నీటి మట్టం ఆదివారం సాయంత్రానికి 23 అడుగుల వద్ద నిలకడగా మారింది. దిగువన ధవళేశ్వరం బ్యారేజి వద్ద మరో ఇరవై గంటల పాటు వరద నీటి ప్రవాహ పెరుగుదల ఉంటుంది.

08/20/2017 - 04:02

విశాఖపట్నం, ఆగస్టు 19 నంద్యాల అసెంబ్లీకి జరుగుతున్న ఉప ఎన్నిక ఫలితం టిడిపి పాలనకు రిఫరెండం కాదని కేంద్ర సహాయ మంత్రి వై సుజనాచౌదరి స్పష్టం చేశారు. ఒక రోజు పర్యటన నిమిత్తం శనివారం విశాఖ వచ్చిన ఆయన టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిడిపి అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పలు ఉప ఎన్నికలను ఎదుర్కొందన్నారు.

08/20/2017 - 04:02

విశాఖపట్నం (జగదాంబ), ఆగస్టు 19: విశాఖ ప్రభుత్వ ఈఎన్‌టి ఆసుపత్రిలో ఘోర ప్రమాదం తప్పింది. ఆసుపత్రికి సంబంధించిన సెంట్రల్ ఆక్సిజన్ బ్లాక్‌లో శనివారం ఉదయం ఓక్కసారిగా మంటలు చెలరేగడంతో ఓపికి వచ్చిన రోగులంతా పరుగులు తీశారు. ఆసుపత్రిలో ఆపరేషన్ బ్లాక్‌కు సరఫరా అయ్యే సెంట్రల్ ఆక్సిజన్ బ్లాక్‌లో శనివారం ఉదయం 9.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో దట్టమైన పొగలు అలముకున్నాయి.

08/20/2017 - 04:02

ప్రత్తిపాడు, ఆగస్టు 19: చలో అమరావతి పిలుపుతో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన పాదయాత్రకు అనుమతి నిరాకరించిన ప్రభుత్వానికి చెక్ పెట్టేందుకు చలో కిర్లంపూడి కార్యక్రమాన్ని నిర్వహించాలని కాపు జెఎసి పిలుపునిచ్చింది. చలో అమరావతి అంటూ ముద్రగడ నినదిస్తుంటే చలో కిర్లంపూడి అంటూ కాపులు కిర్లంపూడికి కదం తొక్కుతున్నారు.

08/20/2017 - 04:00

విశాఖపట్నం, ఆగస్టు 19: విశాఖలో ప్రేమోన్మాది చెలరేగిపోయాడు. తనను ప్రేమించలేదన్న అక్కసుతో ప్రియురాలిపై కిరోసిన్ పోసి నిప్పంటించి హతమార్చాడు. ఈ ఘటనలో ప్రియురాలి సోదరుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రియురాలిని హత్య చేసిన ప్రేమోన్మాది కొద్ది గంటల అనంతరం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖ నగర శివారు భీమునిపట్నం మండలం టి నగరపాలెంలో శనివారం ఉదయం చోటుచేసుకున్న ఈ సంఘటన ఒక్క సారిగా ఉలిక్కిపడేలా చేసింది.

08/20/2017 - 03:58

కర్నూలు, ఆగస్టు 19: అవినీతి సొమ్ముతో జనాన్ని కొనుగోలు చేసేందుకు వచ్చిన వైకాపాను ప్రజలు తమ ఓటుతో ఖతం చేయాలని ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. నంద్యాల శాసన సభా నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన నంద్యాలలో పర్యటించారు. పట్టణ శివారులోని అయ్యలూరు మెట్ట నుంచి రోడ్‌షో నిర్వహిస్తూ పలు కూడలి ప్రదేశాల్లో ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు.

08/20/2017 - 03:56

నంద్యాల రూరల్, ఆగస్టు 19: మోసపూరిత, అసమర్థ పాలనకు తగిన బుద్దిచెప్పే సమయం ఆసన్నమైందని, అందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి అన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో మీరు ఇచ్చే తీర్పు కోసం ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పట్టణంలోని బైటిపేట, పెద్దబండ, తల్లిపీరు వీధి, నీలివీధిలో జగన్ రోడ్ షో నిర్వహించారు.

08/20/2017 - 03:54

రాజమహేంద్రవరం, ఆగస్టు 19: పట్టణ ప్రణాళికా విభాగం సమస్యలతో సతమతమవుతోంది. రాష్ట్ర విభజన అనంతరం 13 జిల్లాల్లోని భూములు, స్థలాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ విభాగంలో కంప్యూటరీకరించడంలో అలసత్వంతో సాఫ్ట్‌వేర్‌లో ప్లాన్ అనుమతులు సకాలంలో రాక రాష్ట్ర వ్యాప్తంగా వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో పడ్డాయి. 13 జిల్లాల్లో దాదాపు 1687 దరఖాస్తులు స్తంభించినట్టు తెలుస్తోంది.

08/20/2017 - 02:30

విశాఖపట్నం, ఆగస్టు 19 భూగర్భ జలాల విచ్చలవిడి వినియోగం, దోపిడీకి అడ్డుకట్టవేయాల్సి ఉందని జలవనరులు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ హుకుమ్ సింగ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా విశాఖ వచ్చిన కమిటీ ప్రతినిధులు భూగర్భ, ఉపరితల జల వనరుల నిర్వహణ, తోటపల్లి ప్రాజెక్టు పనుల ప్రగతిపై శనివారం నాడిక్కడ సమీక్షించారు.

Pages