S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/18/2017 - 23:42

విజయవాడ, ఆగస్టు 18: 2013లో హోరాహోరీగా సాగిన సమైక్యాంధ్ర ఉద్యమ కాలాన్ని ఆలస్యంగానైనా ఏపిఎస్‌ఆర్‌టిసి ఉద్యోగ, కార్మికులకు ప్రత్యేక సెలవుగా పరిగణిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నెం.7771/టిఆర్-2/2015 పేరిట శుక్రవారం ఉత్తర్వు జారీ చేసింది. నాడు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆర్‌టిసి ఉద్యోగ, కార్మికులు దాదాపు 60వేల మంది 60 రోజులపాటు నిరవధిక సమ్మె చేశారు.

08/18/2017 - 23:42

విజయవాడ, ఆగస్టు 18: తిరుమల తిరుపతి దేవస్థానంలో బంగారు డాలర్ల మాయం వ్యవహారంపై ఇద్దరు రిటైర్డు అధికారులపై తదుపరి క్రమశిక్షణా చర్యలను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2006 సంవత్సరంలో శ్రీవారి బొక్కసంలో ఒక్కోటి 5 గ్రాముల 300 బంగారు డాలర్లు గల్లంతు అవడం తెలిసిందే.

08/18/2017 - 23:41

విజయవాడ, ఆగస్టు 18: దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సిపిఎస్) ఉద్యోగులకు గ్యాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ మంజూరుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంగీకరించారు.

08/18/2017 - 23:41

విజయవాడ, ఆగస్టు 18: పర్యాటకశాఖ గత కొద్దికాలంగా చేస్తున్న కృషి ఫలితాలను ఇచ్చింది. ప్రసాద్ పథకం కింద శ్రీశైలం సమగ్రాభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకరించింది. శుక్రవారం ఢిల్లీ వేదికగా కేంద్ర పర్యాటక శాఖ నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది.

08/18/2017 - 23:40

విజయవాడ (క్రైం), ఆగస్టు 18: మద్యం తయారీ కంపెనీ అమ్మకం పేరుతో కోట్ల రూపాయల ఘరానా మోసం రాష్ట్ర రాజధాని నగరంలో వెలుగు చూసింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ మేకప్ ఆర్టిస్టు తాను మోసపోయానని, సుమారు ఐదు కోట్ల రూపాయలకు పైగా తనను ముంచేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిజిపి నండూరి సాంబశివరావుకు ఫిర్యాదు చేశారు. స్పందించిన డిజిపి ఈ వ్యవహారంపై సిఐడి విచారణకు ఆదేశించారు.

08/18/2017 - 23:39

భీమవరం,ఆగస్టు 18: ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయాల పై ఇక్కడ నేతలు ఒక నివేదికను ఇవ్వనున్నట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీల తీరుతెన్నులు, బలాబలాలు వివరిస్తూ ఒక ముసాయిదా నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం.

08/18/2017 - 23:39

విజయవాడ, ఆగస్టు 18: రాష్ట్రంలో కరవు సమస్య పరిష్కారానికి తక్షణం శాశ్వత చర్యలు చేపట్టాలంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులేసు నాయకత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది.

08/18/2017 - 23:38

విజయవాడ, ఆగస్టు 18: రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా ‘స్టేట్ ఫుడ్ కమిషన్’కు పూర్తి జవసత్వాలు కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఆహార భద్రతతో పాటు ధరల నియంత్రణ, నాణ్యత గల పౌష్టికాహారాన్ని అందించడం వంటి బాధ్యతలతో ఈ కమిషన్ స్వతంత్య్రంగా వ్యవహరిస్తుందని తెలిపారు.

08/18/2017 - 03:09

రాజమహేంద్రవరం, ఆగస్టు 17: పోలవరం ప్రాజెక్టులో కీలకమైన పవర్‌హౌస్ నిర్మాణం నత్తనడకన సాగుతోంది. గత మూడు నెలలుగా పనుల్లో పురోగతి కనిపించడంలేదు. అఖండ గోదావరి నది ఎడమ గట్టు వైపు పోలవరం పవర్ హౌస్‌ను నిర్మిస్తున్నారు. పవర్ హౌస్ నిర్మాణానికి సంబంధించి దేవీపట్నం మండలం అంగుళూరు గ్రామాన్ని రెండేళ్ల క్రితం ఖాళీ చేయించారు. ఇప్పటికీ అక్కడ మట్టి పనులు కూడా పూర్తికాలేదు.

08/18/2017 - 03:08

నంద్యాల, ఆగస్టు 17: నంద్యాల ఓటర్ల తీర్పు విలక్షణంగా ఉంటుందని, ఇక్కడి ఓటర్లు చైతన్యవంతులని, రాజకీయ నాయకులు చేసే మోసాలను అర్థం చేసుకుంటారని, రాజన్న రాజ్యం కోసం కృషి చేస్తారన్న నమ్మకం తనకుందని వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నంద్యాల పట్టణంలో ప్రచారం నిర్వహించారు.

Pages