S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/19/2017 - 03:57

హిరమండలం, ఆగస్టు 18: శ్రీకాకుళం జిల్లాలో వంశధార నిర్వాసితుల కదలికలపై పోలీస్ నిఘా పెంచారు. వంశధార నిర్వాసితుల గ్రామాలకు వెళ్లే రహదారుల్లో అడుగడుగునా పోలీస్ బలగాలు తనిఖీలు చేపడుతున్నారు. ఇటీవల పోలీసులు, నిర్వాసితుల మధ్య చోటుచేసుకున్న సంఘటనలతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.

08/19/2017 - 03:55

విశాఖపట్నం, ఆగస్టు 18: ఇంధన సామర్థ్యం, విద్యుత్ వ్యవస్థ అన్నివిధాలా అభివృద్ధి చెందాలని ఎపి విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ భవానీప్రసాద్ అన్నారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, ఎపి స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం విశాఖలో నిర్వహించిన జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు.

08/19/2017 - 03:53

ప్రత్తిపాడు, ఆగస్టు 18: కిర్లంపూడి నుండి అమరావతి వరకు నిరవధిక పాదయాత్ర తలపెట్టిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను పోలీసులు శుక్రవారం కూడా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ తన ఉద్యమ పంథాను మార్చి పోలీసులు అడ్డుకున్న చోటే కుర్చీ వేసుకుని బైఠాయించారు. వెంట ఉన్న జెఎసి, కాపు సంఘాల నాయకులతో అక్కడే బైఠాయించారు.

08/19/2017 - 03:51

విశాఖపట్నం, ఆగస్టు 18: 2019 మార్చి నాటికి ఎపి అంతటా ఇంధన సామర్థ్యం కలిగి ఉండే ఎల్‌ఇడి వీధి దీపాలను ఏర్పాటు చేస్తామని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ అన్నారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషీయన్సీ, ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం విశాఖలో నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన ముఖ్య ప్రసంగం చేశారు.

08/19/2017 - 03:48

కర్నూలు, ఆగస్టు 18: నంద్యాల శాసన సభా స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. ప్రచారానికి మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ప్రధాన పోటీదారులైన టిడిపి, వైకాపా నేతలు విరామం లేకుండా పని చేస్తున్నారు. వైకాపా అధినేత గత 10 రోజులుగా నంద్యాలలో మకాం వేసి ఏకంగా ఇంటింటి ప్రచారానికి తెరదీశారు.

08/19/2017 - 03:48

కర్నూలు, ఆగస్టు 18: కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ వ్యాన్ శుక్రవారం రాత్రి కలకలం రేపింది. తెలుగుదేశం పార్టీ నాయకులు నంద్యాల ఉప ఎన్నికల ఖర్చుల కోసం పెద్దమొత్తం నోట్లు తరలిస్తున్నారంటూ ఎన్నికల అధికారులకు సమాచారం అందడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

08/19/2017 - 03:47

నంద్యాల టౌన్, ఆగస్టు 18: నంద్యాల ఉప ఎన్నికలో డబ్బు పంపిణీకి తెర లేచింది. ఎన్నికలు మరో ఐదు రోజులు ఉండగానే ఓటర్లకు డబ్బు పంపిణీ ప్రారంభమైంది. పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో ఓటర్లకు డబ్బు పంచుతున్న 47 మందిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.12 లక్షలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.

08/19/2017 - 03:47

గుంటూరు, ఆగస్టు 18: ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం నుంచి రెండురోజులు నంద్యాలలో పర్యటించనున్నారు. ఈనెల 9వ తేదీ నుంచి ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అక్కడే మకాం వేసి విస్తృత ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో టిడిపి శ్రేణుల్లో ఉత్తేజం నింపేందుకు ముఖ్యమంత్రి ప్రచారం నిర్వహించనున్నారు.

08/19/2017 - 03:46

విజయవాడ, ఆగస్టు 18: నంద్యాల ఉపఎన్నిక నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీపై ప్రతిపక్ష నేత జగన్ మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఎమ్మెల్సీ టిడి జనార్ధన్ శుక్రవారం ఫిర్యాదు చేశారు.

08/19/2017 - 01:39

రాజమహేంద్రవరం, ఆగస్టు 18: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలోని పరిపాలనా విభాగంలో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఎనిమిది కంప్యూటర్లు, రెండు ప్రింటర్లు దగ్ధమయ్యాయి. ఉద్యోగులకు సంబంధించిన 1500 వరకు రికార్డులు కాలిపోయాయి. విద్యుత్ షార్టు సర్వ్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని గుర్తించారు.

Pages