S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/20/2017 - 02:28

వెంకటాచలం, ఆగష్టు 19: నెల్లూరు జిల్లాలో ప్రఖ్యాతి చెందిన పుణ్యక్షేత్రం గొలగమూడిలో అవధూత వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. రోజుకు రెండు వాహన సేవలు జరుగుతున్నాయి. ఆరాధనోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం ఉదయం హనుమంత వాహన సేవ జరగ్గా రాత్రి చంద్రప్రభ వాహన సేవ జరిగింది. సర్వాంగ సుందరంగా అలంచకరించి వెంకయ్యస్వామి విగ్రహాన్ని వాహనంపై వేంచేపు చేసి గ్రామోత్సవం నిర్వహించారు.

08/20/2017 - 02:26

విశాఖపట్నం, ఆగస్టు 19: మహిళలు స్వశక్తితో ఎదిగితే రిజర్వేషన్ల అవసరం ఎంతమాత్రం ఉండదని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి వై సుజనాచౌదరి అభిప్రాయపడ్డారు.

08/20/2017 - 02:25

విజయనగరం, ఆగస్టు 19: విజయవాడ సమీపంలోని మంగళగిరి బెటాలియన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఇప్పిలి వెంకటేష్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహమైంది. భార్య సునీత గర్భం దాల్చాక అబార్షన్ చేయించుకోవాలని వత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఇదే విషయమై అతను శనివారం పట్టణంలోని బిసి కాలనీలో పెద్దల సమక్షంలో సంప్రదింపులు జరుగుతుండగా, భార్య కడుపుపై కాలితో తన్నగా ఆమె గాయపడినట్లు స్థానికుల ఆరోపణ.

08/20/2017 - 02:25

గూడూరు ఆగస్టు 19: నెల్లూరు జిల్లాలో వేళ్లూనుకున్న క్రికెట్ బెట్టింగ్‌ను పోలీసులు వెతికి పట్టుకుంటున్నారు. తాజాగా గూడురులో 41మంది బెట్టింగ్ రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

08/20/2017 - 02:24

విశాఖపట్నం, ఆగస్టు 19: కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో టిడిపి మిత్ర ధర్మానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తోందని బిజెపి శాసనసభ పక్ష నేత పి విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. విశాఖలో శనివారం విలేఖరులతో కాకినాడలో 48 డివిజన్లకు బిజెపికి 9 డివిజన్లను కేటాయించారన్నారు. తమకు కేటాయించిన స్థానాల్లో 8 డివిజన్లలో టిడిపి రెబల్ అభ్యర్థులు పోటీకి నిలిచారని పేర్కొన్నారు.

08/20/2017 - 02:20

కాకినాడ, ఆగస్టు 19: నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం తథ్యమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జోస్యం చెప్పారు. నంద్యాలలో ఎ1 ముద్దాయి జగన్, కాకినాడలో ఎ-2 ముద్దాయి విజయసాయిరెడ్డిలు ఎన్నికల అనంతరం ఆయా ప్రాంతాల నుండి పరారు కావడం తథ్యమన్నారు. వీరికి ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా రెండు చోట్లా బుద్ధి చెబుతారన్నారు.

08/19/2017 - 04:12

విజయవాడ, ఆగస్టు 18: రాష్ట్రంలో అవినీతి గణనీయంగా తగ్గిందని, 2017 సంవత్సరానికి సంబంధించి నేషనల్ కౌన్సిల్ అప్లైడ్ ఎకనమిక్స్ రిసెర్చ్ (ఎన్‌సిఐఆర్‌ఎ) సర్వేలో అవినీతిలో దేశంలో ఏపీ 19 స్థానంలో నిలిచిందని రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు తెలిపారు.

08/19/2017 - 04:11

విజయవాడ, ఆగస్టు 18: అర్చకుల సంక్షేమానికి తమ ప్రభుత్వం నిబద్ధతతో ఉందని, ఇందులో ఎటువంటి అపార్థాలు, అపోహలు అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం తనను వెలగపూడి సచివాలయంలో కలిసిన అర్చక ప్రతినిధులతో మాట్లాడుతూ ఎవరి వేతనాలనూ తగ్గించే సమస్యే లేదని, ఇందుకు తాను భరోసా ఇస్తున్నానన్నారు.

08/19/2017 - 04:01

నంద్యాల, ఆగస్టు 18: నంద్యాల అభివృద్ధి గురించి ఎవరూ భయపడవద్దని, పులివెందులను ఏవిధంగా అభివృద్ధి చేస్తున్నామో అలాగే నంద్యాలను కూడా అభివృద్ధి చేస్తానని వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో న్యాయానికి, ఓటువేయండి, ధర్మాన్ని గెలిపించండి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

08/19/2017 - 03:59

పోలవరం, ఆగస్టు 18: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌లో నీటి కొరత ఉండదని జలనవనరుల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ హుకుంసింగ్ అన్నారు. 2019 తర్వాత భారతదేశంలో మిగులు జలాలు కలిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఘనత సాధిస్తుందన్నారు. రాష్ట్రంలో జలవనరుల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందుచూపు దేశానికే ఆదర్శమని కితాబిచ్చారు.

Pages