S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/21/2017 - 03:22

కర్నూలు, ఆగస్టు 20: నంద్యాల శాసనసభ ఉప ఎన్నికల్లో రాజకీయం కొత్త పుంతలు తొక్కింది. ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తూ కులాలు, మతాల వారీగా ప్రచారం కొనసాగింది. ప్రచారం ప్రారంభమయ్యాక అంతర్గతంగా కులాలు, మతాల పెద్దలను పిలిచి మాట్లాడిన రాజకీయ పార్టీలు చివర్లోకి వచ్చే సరికి బహిరంగ సమావేశాలు నిర్వహించడం విశేషం.

08/21/2017 - 03:20

విజయవాడ, ఆగస్టు 20: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు బకాయిపడిన 10 నెలల పిఆర్‌సి బకాయిలు వెంటనే చెల్లించాలని, పెన్షనర్లకు అదనపు పెన్షన్ మంజూరు చేయాలని, స్వయం పోషక స్వతంత్ర పాఠశాలల చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం డిమాండ్ చేసింది. ఆదివారం స్థానిక యుటిఎఫ్ కార్యాలయం చెన్ను భవన్‌లో ఐ వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.

08/21/2017 - 03:19

విజయవాడ, ఆగస్టు 20: భూములకు సంబంధించిన సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు భూసేకరణ, పునరావాస సంస్థ ప్రిసైడింగ్ అధికారి, జిల్లా రిటైర్డ్ జడ్జి జస్టిస్ జగన్నాథం తెలిపారు.

08/21/2017 - 03:17

అవనిగడ్డ, ఆగస్టు 20: కృష్ణా జిల్లా పులిగడ్డ వార్పు వద్ద కృష్ణానదిలో స్నానానికి వెళ్లిన పాలిటెక్నిక్ విద్యార్థి దుర్మరణం చెందాడు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం కర్రోకు గ్రామానికి చెందిన తోపాటి హరిప్రసాద్(17) స్థానిక కొత్తపేట రోడ్డులోని బిసి కళాశాల విద్యార్థుల వసతిగృహంలో ఉంటూ దివిసీమ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

08/21/2017 - 03:16

ప్రత్తిపాడు, ఆగస్టు 20: తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ నివాసం ఆదివారం జనసంద్రంగా మారింది. చలో కిర్లంపూడి పిలుపుతో వివిధ జిల్లాల నుండి పెద్దసంఖ్యలో కాపు సామాజివర్గీయులు తరలివచ్చారు. పాదయాత్రకు అనుమతి వచ్చే వరకు రోజుకు రెండేసి నియోజకవర్గాల నుండి కాపుయువత తరలిరావాలని ఇప్పటికే జెఎసి పిలుపునిచ్చింది.

08/21/2017 - 03:14

నంద్యాల టౌన్, ఆగస్టు 20: గతంలో ఇచ్చిన హామీలు మరచిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు నంద్యాల ఉప ఎన్నికలు రాగానే మళ్లీ హామీలు గుప్పిస్తూ మోసం చేస్తున్నారని వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి అన్నారు. నంద్యాల ఓటర్లు బాబు మోసాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన నంద్యాల పట్టణంలోని సలీంనగర్, ప్రియాంకనగర్, డేనియల్‌పురం, సంజీవనగర్‌లో ప్రచారం చేశారు.

08/21/2017 - 01:33

విజయవాడ, ఆగస్టు 20: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభం కావటంతో రాజకీయ రాజధాని విజయవాడ నగరంలో బెట్టింగులు జోరందుకున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన శిల్పా మోహన్‌రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి ఆఖరి క్షణంలో వైకాపాలో చేరి అభ్యర్థిగా బరిలో నిలవటం, తర్వాత ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డి కూడా అదే బాటలో నడవటం వైకాపా శ్రేణుల్లో జోష్ నింపింది.

08/21/2017 - 01:33

భీమవరం, ఆగస్టు 20: ఏడాదిన్నర సమయం ఉండగానే భారతీయ జనతా పార్టీ ఎన్నికల సన్నాహాలు ప్రారంభించింది. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు కన్వీనర్లును నియమిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకుని మండల, పట్టణ కమిటీల నియామకాలు పూర్తిచేసుకున్న కమలనాథులు తాజాగా కన్వీనర్ల నియామకంపై దృష్టిసారించారు.

08/21/2017 - 01:32

విజయవాడ, ఆగస్టు 20: రాష్ట్రంలో ఒబిసిల సంక్షేమం కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తోందని బిజెపి నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి అన్నారు. ఈ నెల 28న బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆధ్వర్యంలో విజయవాడలో జరిగే ఒబిసి సదస్సుకు రాష్ట్రంలోని అన్ని కుల సంఘాల నేతలు, ఒబిసిలు తరలిరావాలని పిలుపిచ్చారు.

08/21/2017 - 01:30

విజయవాడ, ఆగస్టు 20: కరవు, వరదలు లేని భారతదేశం కోసం సత్వరం చేపట్టాల్సిన చర్యలపై ఈ నెల 16, 17, 18 తేదీల్లో కర్నాటకలోని బీజాపూర్‌లో నదుల పరిరక్షణపై జరిగిన జాతీయ సదస్సులో ‘విజయపుర డిక్లరేషన్’ పేరిట చారిత్రక నిర్ణయాలు తీసుకున్నట్లు నదుల పరిరక్షణ ఉద్యమవేత్త బొలిశెట్టి సత్యనారాయణ తెలిపారు. ఆదివారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

Pages