S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/17/2017 - 02:45

విజయవాడ, జూన్ 16: విశాఖ భూముల వ్యవహారంపై సిట్ దర్యాప్తు సరిపోతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ జగన్‌కు సిబిఐపై నమ్మకం ఉంటే, జప్తు చేసిన తన ఆస్తులను అప్పగించి, శిక్ష అనుభవించాలని సూచించారు. జగన్ అక్రమ ఆస్తులు అప్పగిస్తే, విశాఖ భూములపై సిబిఐ విచారణ చేయిస్తామన్నారు. కేంద్రాన్ని ఈ మేరకు కోరతామన్నారు.

06/17/2017 - 02:45

విజయవాడ (క్రైం), జూన్ 16: విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ను నియంత్రించాల్సిన బాధ్యత ఆయా సంస్థలదేనని రాష్ట్ర డిజిపి నండూరి సాంబశివరావు స్పష్టం చేశారు. ర్యాగింగ్‌కు పాల్పడేవారిపై చట్టపరంగా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ప్రతి విద్యాసంస్థలో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

06/17/2017 - 02:12

నెల్లూరు, జూన్ 16: దేశ ప్రజలకు అవినీతి రహిత పాలనను అందించాలనే ధ్యేయంతో ప్రధాని నరేంద్రమోది అహర్నిశలు కృషి చేస్తున్నారని కేంద్ర స్టాటిస్టిక్స్, ఇంప్లిమెంటేషన్ శాఖ మంత్రి సదానందగౌడ స్పష్టం చేశారు. నెల్లూరు నగరంలోని వి ఆర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన మోది ఫెస్ట్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు.

06/17/2017 - 01:26

విజయవాడ, జూన్ 16: ప్రభుత్వ విద్యారంగ బలోపేతమే లక్ష్యంగా ఎలాంటి అపోహలు, అనుమానాలకు తావివ్వకుండా పారదర్శకంగా పాఠశాలల హేతుబద్ధీరణ, టీచర్ల బదిలీల వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నతాధికారులను ఆదేశించారు.

06/17/2017 - 01:22

విశాఖపట్నం, జూన్ 16: విశాఖ జిల్లా ముదపాకలో జరిగిన అతి పెద్ద భూ కుంభకోణం కొత్త మలుపులు తిరుగుతోంది. కొంతమంది పెత్తందార్లకు భూములు ఇచ్చేసిన రైతుల్లో చాలా మంది తిరిగి తమ భూములు వెనక్కు ఇచ్చేయమని కోరుతుంటే, ఎవరైతే ఈ అసైన్డ్ భూములను చేజిక్కించుకునేందుకు అడ్వాన్స్‌లు కూడా రైతులకు చెల్లించి, దస్తవేజులపై సంతకాలు చేయించుకున్నారో, చేతికందిన భూములు చేజారకుండా ఉంటేందుకు పావులు కదుపుతున్నారు.

06/17/2017 - 01:22

అనకాపల్లి, జూన్ 16: విశాఖ జిల్లాలో భూ ఆక్రమణలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయని, రూ. 20 వేల కోట్ల విలువైన భూములు ఆక్రమణలకు గురయ్యాయని మాజీమంత్రి కొణతాల రామకృష్ణ ఆరోపించారు. ఈ విషయమై సిబిఐతో సమగ్ర విచారణకు రాష్ట్ర ప్రభుత్వానికి తగు ఆదేశాలు జారీ చేయాలని తెలుగు రాష్ట్రాల గవర్నర్‌కు శుక్రవారం ఆయన లేఖ పంపారు. ఈ లేఖప్రతులను స్థానికంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కొణతాల అందజేసారు.

06/17/2017 - 01:21

విజయవాడ, జూన్ 16: విశాఖ జిల్లా భూముల కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సిట్ విచారణపై తమకెవరికీ విశ్వాసం లేదని సిట్టింగ్ న్యాయమూర్తిచే విచారణ జరిపిస్తే కాని వాస్తవాలు వెలుగు చూడవని శాసనసభలో భారతీయ జనతాపార్టీ ఫ్లోర్‌లీడర్ పి.విష్ణుకుమార్‌రాజు స్పష్టం చేశారు. శుక్రవారం విజయవాడలోని ఓ హోటల్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

06/17/2017 - 01:21

భీమవరం, జూన్ 16: ఎన్‌సిసి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే అఖిల భారత శిబిరానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎన్నార్ కళాశాలకు చెందిన సీనియర్ కంపెనీ అండర్ ఆఫీసర్ డోలా సంతోష్‌కుమార్, సియుఒ కడలి దుర్గాప్రసాద్ ఎంపికయ్యారు. ఈ నెల 18నుంచి 28వ తేదీ వరకు ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో జరిగే ప్రత్యేక ఎన్‌సిసి అఖిల భారత ఇండియన్ మిలటరీ అకాడమీ అటాచ్‌మెంట్ శిక్షణా శిబిరంలో వీరు పాల్గొంటారు.

06/17/2017 - 01:20

రేణిగుంట, జూన్ 16: రాష్ట్రంలో వివిధ గొడౌన్లలో ఉన్న ఎర్రచందనం విక్రయానికి మూడు దశల్లో గ్లోబల్ టెండర్లను పిలువనున్నట్లు రాష్ట్ర అటవీశాఖామంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం రేణిగుంటలోని సిడబ్ల్యూసి ఎర్రచందనం గోడౌన్‌ను ఆయన పరిశీలించారు.

06/17/2017 - 01:20

గుంటూరు, జూన్ 16: ఈ ఏడాది హజ్ యాత్రికులకు సేవలందించేందుకు వలంటీర్లను ఏపి హజ్ కమిటీ కార్యాలయంలో డ్రా ద్వారా ఎంపిక చేశారు. హాజీ షేక్ హసన్‌బాషా, ఇడి ఎండి లియాఖత్ ఆలీ సమక్షంలో వివిధ జిల్లాలకు చెందిన 12 మందిని వాలంటీర్లుగా నియమించారు.

Pages