S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/19/2017 - 01:23

విజయవాడ, జూన్ 18: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఏపిఎస్‌ఆర్‌టిసి ఉద్యోగ, కార్మికులకు కూడా 60 ఏళ్లు రిటైర్మెంట్ అమలుపర్చేలా బోర్డులో నిర్ణయం చేసి గాని, లేదంటే పెండింగ్ బోర్డు అప్రూవల్ గాని నిర్ణయం చేసి వెంటనే అమలు జరిగేలా చూడాలని ఏపిఎస్‌ఆర్‌టిసి ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వైవి రావు, ప్రధాన కార్యదర్శి కె.పద్మాకర్, అదనపు కార్యదర్శి పి.దామోదరరావు

06/19/2017 - 01:22

విజయవాడ, జూన్ 18: రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు కొన్ని వస్తువులపై జిఎస్టీని తగ్గిస్తూ జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఢిల్లీలో ఆదివారం జిఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగిన సందర్భంగా గతంలో కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చిన భారీ వడ్డింపు అంశాలను ఆయన ప్రస్తావించారు.

06/19/2017 - 01:21

విజయవాడ, జూన్ 18: తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుల పేర్లను ఎట్టకేలకు పార్టీ అధిష్ఠానం ఆదివారం ప్రకటించింది. మహానాడు ముగిసే నాటికే పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తయినప్పటికీ జిల్లా అధ్యక్షుల పేర్లు ప్రకటించడంలో జాప్యంపై పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి చోటుచేసుకుంది. జిల్లా అధ్యక్షుల పదవులకు పోటీ ఉందని పేర్కొంటూ అన్ని జిల్లాల అధ్యక్షుల పేర్లు ప్రకటించడాన్ని నిలిపివేయడం తెలిసిందే.

06/19/2017 - 01:20

రాజమహేంద్రవరం, జూన్ 18: పోలవరం నిర్వాసితులు ఎడాపెడా అన్యాయానికి గురవుతున్నారు. అధికార యంత్రాంగం గతంలో నిర్వాసితుల భూములను సర్వేచేయకుండా పరిహారాన్ని నిర్ధారించడంతో క్షేత్రస్థాయిలో లెక్కలకు పొంతన కుదరక నష్టపోతున్నారు. క్షేత్ర స్థాయి భూములకు, అధికారుల రికార్డులకు, పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఉన్న భూములకు పొంతన లేకుండావుంది.

06/19/2017 - 01:18

విశాఖపట్నం, జూన్ 18: నైరుతి రుతుపవనాల ప్రభావంతో కోస్తాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి తెలిపారు.
ఇప్పటికే రుతుపవనాల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాలో మరో రెండు రోజుల పాటు చెదురు, మదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

06/19/2017 - 01:17

విజయవాడ (కార్పొరేషన్), జూన్ 18: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల రైతులు అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటున్నారని ఎపిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి అన్నారు.

06/19/2017 - 01:17

తిరుపతి, జూన్ 18: టిటిడి శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాల ప్రాజెక్టు ఆధ్వర్యంలో జూలై 2 నుంచి 9 వరకు విజయవాడలోని పిడబ్ల్యుడి మైదానంలో వేంకటేశ్వర వైభవోత్సవాలు జరుగనున్నాయి. శ్రీ వేంకటేశ్వర స్వామివారు కొలువైన తిరుమల ఆలయంలో రోజువారీ నిర్వహించే సేవలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించుకునేందుకు వీలుగా టిటిడి పలు ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలను నిర్వహిస్తున్న విషయం విధితమే.

06/19/2017 - 01:16

విజయవాడ, జూన్ 18: విజయవాడ కేంద్రంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఆదివారం సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 25 సబ్ సెంటర్లలో ప్రశాంతంగా జరిగింది. మొత్తం 11వేల 568 మంది అభ్యర్థులకు గాను కేవలం 4వేల 311 మంది (37.27 శాతం) మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ఈ కొద్దిమందిలో కూడా మధ్యాహ్నం జరిగిన రెండో పరీక్షకు 76 మంది డుమ్మా కొట్టారు.

06/19/2017 - 01:16

విజయవాడ, జూన్ 18: చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఐపిఎస్‌ల బదిలీలు రెండ్రోజుల్లో జరగనున్నాయి. ఉండవల్లిలో డిజిపి సాంబశివరావు, ఇంటిలిజెన్స్ చీఫ్ ఎబి వెంకటేశ్వరరావుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం సమావేశమయ్యారు. రెవెన్యూ, పోలీస్ శాఖల్లో బదిలీలను రెండ్రోజుల్లో పూర్తిచేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఐపిఎస్‌ల బదిలీలపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమీక్షించారు.

06/19/2017 - 01:15

న్యూఢిల్లీ, జూన్ 18: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సామాజిక భద్రత కార్యక్రమాలలో ఉత్తమ ప్రదర్శనకు గాను కేంద్ర పంచాయిగతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రతి ఏడాది ఇచ్చే అవార్డులకు 2015-16 సంవత్సారానికి గాను వివిధ విభాగాలలో 19 అవార్డులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్కించుకుంది. ఇందులో మూడు రాష్టస్థ్రాయిలో, రెండు జిల్లాస్థాయిలో, నాలుగు మండల స్థాయిలో, పది గ్రామపంచాయితీ స్థాయిలో అవార్డులను కైవసం చేసుకుంది.

Pages