S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/18/2017 - 00:41

విజయవాడ, జూన్ 17: విజయవాడ ఎంపి కేశినేని నాని అమ్మిన బస్సుల కొలతల్లో తేడాలున్నాయని ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల సంఘం ఉపాధ్యక్షుడు సునీల్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రైవేట్ ఆపరేటర్ల సంఘం ప్రతినిధులు శనివారం కలిసి తమ సమస్యలను వివరించారు. అనంతరం మీడియాతో సునీల్ రెడ్డి మాట్లాడుతూ ట్రావెల్స్ బస్సు వ్యాపారంలో నాని అనుసరించిన అన్ని విధానాలనే తామూ అనుసరించామని వ్యాఖ్యానించారు.

06/18/2017 - 00:40

విజయవాడ (పటమట) జూన్ 17: విజయవాడలోని గురునానక్ కాలనీ పవిత్రాత్మ నికేతన్ ఆనాథాశ్రమానికి చెందిన ఇద్దరూ బాలికలు అదృశ్యమైన సంఘటన పటమట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి పవిత్రాత్మ నికేతన్ ఆనాథ ఆశ్రమానికి చెందిన బాలికలు రోహిణి (13), మరియమ్మ (11) అనే భోజనం చేసిన పిమ్మట అదృశ్యమైనట్లు నిర్వాహకులు సిస్టర్ అజిత పటమట పోలీసులకు ఫిర్యాదు చేసింది.

06/18/2017 - 00:40

విజయవాడ (క్రైం), జూన్ 17: రాష్ట్రంలో మైనర్ బాలికల అదృశ్యం కేసులు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఆందోళన కలిగిస్తున్న మిస్సింగ్, కిడ్నాప్ కేసుల వెనుగ దాగి ఉన్న సిసలైన కారణాలను ప్రత్యేక దర్యాప్తు బృందం అనే్వషిస్తోంది.

06/18/2017 - 00:39

దొరవారిసత్రం, జూన్ 17: చెన్నై నుండి విజయవాడకు ఆర్టీసి బస్సులో తరలిస్తున్న సుమారు 300కిలోల వానపాములను శనివారం నెల్లూరు జిల్లా దొరవారి సత్రం వద్ద జిల్లా వన్యప్రాణి అధికారులు పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీసి బస్సుల్లో వానపాములు తరలిస్తున్న మూడు రోజుల క్రితం వన్యప్రాణి అధికారులకు సమాచారం అందడంతో రెండు రోజుల నుండి తడ వద్ద జాతీయ రహదారిపై డిఎఫ్‌వో హిమశైలజ తన సిబ్బంధితో నిఘా పెట్టారు.

06/18/2017 - 00:36

రాజమహేంద్రవరం, జూన్ 17: ప్రాజెక్టు పేరుతో సర్వం కోల్పోయి పరాయిపంచకు చేరుతున్న నిర్వాసితులకు పరిహారం అందజేతలో అధికార యంత్రాంగం రకరకాల మెలికలు పెడుతోంది. దాదాపు దశాబ్ధం కిందట ప్రకటించిన భూసేకరణ ప్రకటన ద్వారా ప్రస్తుతం ముంపు మండలాల్లో సర్వే లేకుండానే పరిహారాన్ని గణాంకం చేస్తున్నారు. దీని వల్ల నిర్వాసితులు తీవ్రంగా నష్టపోతున్నారు.

06/18/2017 - 00:35

కాకినాడ, జూన్ 17: ఉద్యమాల పేరుతో అనవసరమైన గొడవలు సృష్టించి, ఉద్రిక్తతలకు కారణమవుతున్నారని, పాదయాత్రల పేరుతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని ఎపి ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కాపు నేతలను హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో శనివారం ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడుతో కలసి ఉప ముఖ్యమంత్రి విలేఖరులతో మాట్లాడారు.

06/18/2017 - 00:35

అనకాపల్లి, జూన్ 17: స్థానిక గాంధీమార్కెట్ వద్దనున్న దేవాదాయ శాఖకు చెందిన 60 సెంట్ల అత్యంత ఖరీదైన స్థలాన్ని తనఖా పెట్టి ఓ వ్యక్తి రూ. 1.60కోట్ల బ్యాంకు రుణాన్ని పొందాడు. రుణాన్ని చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు ఆ ఆస్తిని జప్తు చేసేందుకు శనివారం వెళ్ళగా అసలు సంగతి బయటపడింది. వివరాలివి.

06/18/2017 - 00:34

విశాఖపట్నం, జూన్ 17: పర్యాటకులు, భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ అనేక రూపాల్లో ఆదాయ వనరులను పెంచుకునే క్రమంలో ఏపీ పర్యాటకశాఖ సరికొత్త వ్యూహానికి శ్రీకారం చుట్టింది. ఏపీ నుంచి దేశంలో పలు రాష్ట్రాలకు ‘పర్యాటక ప్రత్యేక ప్యాకేజీ’ పేరుతో బస్సులు నిర్వహించాలని నిర్ణయించింది.

06/18/2017 - 00:33

విశాఖపట్నం, జూన్ 17: విశాఖలో వెలుగుచూసిన భారీ భూ కుంభకోణంపై అఖిలపక్షం మహాధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నెల 22న విశాఖ కలెక్టరేట్ ఎదుట జరగనున్న మహాధర్నాకు వైకాపా అధినేత జగన్మోహన రెడ్డి హాజరుకానున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ విశాఖలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రకటించారు.

06/18/2017 - 00:33

తిరుపతి, జూన్ 17: ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఆయన తనయుడు నారాలోకేష్ కనుసన్నల్లోనే టిడిపి మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు విశాఖలో లక్ష ఎకరాలను దోచేశారని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొత్స సత్యనారాయణ విమర్శించారు. శనివారం తిరుపతి రూరల్ తుమ్మలగుంటలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వైఎస్‌ఆర్ గ్రామీణ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు.

Pages