S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/17/2017 - 01:19

విశాఖపట్నం, జూన్ 16: విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టుపై ఆశలు చిగురించాయి. నాలుగేళ్లుగా నలుగుతున్న మెట్రోరైల్ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేయడంతో ఇక ప్రాజెక్టు పట్టాలెక్కడమే మిగిలిందన్న భావన వ్యక్తమవుతోంది. విశాఖలో మెట్రోరైల్ ప్రాజెక్టును మూడు కారిడార్లుగా రూ.13,500 కోట్లతో చేపట్టాలన్న ప్రతిపాదనకు మోక్షం కలిగింది.

06/17/2017 - 01:04

విశాఖపట్నం, జూన్ 16: నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో కోస్తాలో మరో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శుక్రవారం రాత్రి తెలిపారు. కోస్తాలో ఒక మోస్తరు నుంచి ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

06/17/2017 - 01:04

విశాఖపట్నం, జూన్ 16: సామాన్యుల వస్తువులు పోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం, పోలీసులే వస్తువులు పోగొట్టుకుంటే. అక్షరాలా అదే జరిగింది. శ్రీకాకుళం ఎంపి కె రామ్మోహన నాయుడు, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి కుమార్తె శ్రీశ్రావ్యల వివాహం ఈనెల 14న విశాఖలో అట్టహాసంగా జరిగింది. ఈ వివాహానికి సిఐడి డిఎస్పీ భూషణ నాయుడు హాజరయ్యారు.

06/17/2017 - 01:03

ఆచంట, జూన్ 16: హైదరాబాద్‌లో అనుమానాస్పదస్థితిలో మరణించిన బ్యూటీషియన్ శిరీష అలియాస్ విజయలక్ష్మిది హత్యకాదు, ఆత్మహత్యేనని హైదరాబాద్ పోలీసులు ప్రకటించడాన్ని శిరీష తల్లి రామలక్ష్మి ఆరోపించారు. కావాలనే పోలీసులు ఈ కేసును నీరుగార్చారని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని ఆమె ప్రకటించారు. శిరీష స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరు ఎంపిపాలెంలో ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

06/17/2017 - 01:02

సీలేరు, జూన్ 16: తూర్పు గోదావరి జిల్లా నుంచి ఒడిశాకు అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను ఒడిశాలోని చిత్రకొండ వద్ద శుక్రవారం మధ్యాహ్నం స్వాధీనం చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి ముగ్గురు వ్యక్తులు ఒక ఆటోలో 350 తాబేళ్లను ఒడిశాలోని కనిమెలకు తరలిస్తుండగా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది.

06/17/2017 - 01:02

కాకినాడ రూరల్, జూన్ 16: రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా జూలై 26వ తేదీ నుంచి ‘చలో అమరావతి’ పేరిట నిరంతర పాదయాత్రను కాపు జెఎసి చేపట్టబోతోంది. కాపు ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నాలను ఇకపై సాగనీయబోమంటూ 13 జిల్లాల నుండి ఈ ఉద్యమం కొనసాగుతుందని కాపు జెఎసి నాయకులు స్పష్టంచేశారు.

06/17/2017 - 01:01

పొదలకూరు, జూన్ 16: పోలీస్ 30వ యాక్ట్ అమలులో ఉండగా, ర్యాలీకి ప్రయత్నించారని నెల్లూరు జిల్లా పొదలకూరు మండల పరిషత్ అధ్యక్షులు కోనం బ్రహ్మయ్య, సర్పంచ్ తెనాలి నిర్మల సహా ఏభై మంది వైఎస్‌ఆర్‌సి కార్యకర్తలు, నాయకులను శుక్రవారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పట్టణంలో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి.

06/17/2017 - 01:01

కర్నూలు, జూన్ 16: నంద్యాల రాజకీయాలపై పార్టీ అధినేత చంద్రబాబు స్పందిస్తున్న తీరు చేతులు కాలాక... అన్న చందంగా ఉందని పార్టీ కేడర్ అసహనం వ్యక్తం చేస్తోంది. నంద్యాల నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జి శిల్పా మోహనరెడ్డి వైకాపాలో చేరిన తరువాత అధినేత చంద్రబాబు నంద్యాల రాజకీయాలపై స్పందించడాన్ని టిడిపి నాయకులు, కార్యకర్తలు తప్పుబడుతున్నారు.

06/17/2017 - 01:00

అమరావతి, జూన్ 16: తన సోదరుడిని నంద్యాల ఉప ఎన్నికలో అభ్యర్థిగా నిలబెట్టాలన్న పట్టుదలతో ఉన్న కర్నూలు జిల్లా మంత్రి భూమా అఖిలప్రియ ఒంటెత్తుపోకడ తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి తలనొప్పిలా పరిణమించింది. తాజాగా భూమా నాగిరెడ్డి ఆత్మబంధువైన ఏవి సుబ్బారెడ్డి చేసిన తిరుగుబాటు పార్టీ నాయకత్వాన్ని దిగ్భ్రమ పరిచింది. దీంతో ఖంగుతిన్న శనివారం నంద్యాల పార్టీ నేతలను అమరావతికి రావాలని ఆదేశించింది.

06/17/2017 - 01:00

విజయవాడ (క్రైం), జూన్ 16: అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ ఆస్తుల ఇ-వేలం ప్రక్రియ కొనసాగుతోందని, హైకోర్టు ఆదేశాలతో ముందుకెళ్తున్నట్లు సిఐడి అదనపు డిజిపి ద్వారకా తిరుమలరావు తెలిపారు. కాగా అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఛాంబర్ వాటర్ లీకేజీ తేలాల్సి ఉందని, దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని చెప్పారు.

Pages