S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/17/2017 - 03:05

విజయవాడ, జూన్ 16: ‘యావత్ ఆంధ్రప్రదేశ్ ఆశ, శ్వాసగా భావిస్తున్న అమరావతి నిర్మాణం కళ్ల ముందు కనిపించాలి. రోజురోజుకీ పెరుగుతున్న ప్రజల అంచనాలకు అనుగుణంగా పనులు జరగాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఎలా అయితే కళ్ల ముందు కనిపిస్తున్నాయో అమరావతి నగర నిర్మాణం కూడా ప్రజలకు కనిపించాలని అన్నారు.

06/17/2017 - 03:04

గుంటూరు, జూన్ 16: ప్రభుత్వ ఉద్యోగుల మెడికల్ బిల్లులకు సంబంధించి ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలను నెలరోజుల్లోగా చెల్లిస్తామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. భవిష్యత్తులో ఎన్‌టిఆర్ వైద్య ట్రస్టు ద్వారా మరిన్ని సేవలందించనున్నట్టు తెలిపారు. నిరుపేదల ఆరోగ్య ప్రమాణాలు పెంచటమే ఎన్‌టిఆర్ వైద్యట్రస్టు లక్ష్యమన్నారు.

06/17/2017 - 03:02

రాజమహేంద్రవరం, జూన్ 16: ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో రాష్ట్రానికి లక్షల కోట్లు వరదలా వస్తున్నాయని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. పచ్చిమాంసం తినే సంస్కృతి కలిగిన కాంగ్రెస్ బిజెపిని విమర్శిస్తోందని, ఆవును తినడం వల్లే కాంగ్రెస్ వినాశనమైందని ఆయన ఆరోపించారు. గోవులను చంపి ఆ మాంసం తింటారు కాబట్టే కాంగ్రెస్‌కు మతిభ్రమించిందన్నారు.

06/17/2017 - 02:55

గుంటూరు, జూన్ 16: రాష్ట్రంలోని మార్కెట్ యార్డులన్నింటిలో ఈ- నామ్ మార్కెటింగ్ వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 22 యార్డులలో ఆన్‌లైన్ మార్కెటింగ్ విధానం అమలులో ఉందని వీటిని అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ఈ-నామ్ పరిధిలోకి తీసుకు వస్తామన్నారు.

06/17/2017 - 02:53

విజయవాడ, జూన్ 16: వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో బాలామృతం పంపిణీతో పాటు అన్ని ప్రాజెక్టుల్లోనూ అన్న అమృతహస్తం పథకం అమలు చేస్తున్నామని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. అలాగే, అంగన్వాడీ కార్యకర్తల వేతనాలను ఒకటో తేదీ నుంచి నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయనున్నామని ఆమె వెల్లడించారు.

06/17/2017 - 02:48

అమరావతి, జూన్ 16: వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు వాణిజ్య బ్యాంకులు ఈ ఏడాది రూ.87,471 కోట్ల రుణాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్టస్థ్రాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్ బిసి) సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు. తాము రూ.91,557 కోట్ల రుణాలు ఇవ్వమని కోరగా, ఇంతవరకే ఆమోదించినట్లు ఆయన తెలిపారు.

06/17/2017 - 02:47

విజయవాడ, జూన్ 16: గ్రానైట్ పరిశ్రమపై విధించిన 28 శాతం జిఎస్‌టిని తగ్గించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎపి స్మాల్ స్కేల్ గ్రానైట్ డీలర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. సచివాలయంలో సిఎంను ఆ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. అధికపన్ను వల్ల గ్రానైట్‌కు డిమాండ్ తగ్గి వేలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోతారని వివరించారు.

06/17/2017 - 02:47

విజయవాడ, జూన్ 16: ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించిన దరఖాస్తు దాఖలు గడువు శనివారం నాటితో ముగియనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాల నుంచి హైస్కూలు వరకు బదిలీలకు లక్షా 61వేల మంది అర్హులున్నారు. వీరిలో అత్యధిక మంది ఐదేళ్లు, ఎనిమిదేళ్లు సర్వీసు పూర్తిచేసినవారు కాగా రిక్వెస్ట్ బదిలీలు కొన్ని ఉన్నాయి. శుక్రవారం రాత్రికి 66,660 దరఖాస్తులు విద్యాశాఖకు చేరాయి.

06/17/2017 - 02:46

విజయవాడ, జూన్ 16: ఉద్యోగులకు అనుకూల నిర్ణయాలు తీసుకోవటంపై ఎన్జీవో సంఘ నేత పి అశోక్‌బాబు నేతృత్వంలో పలువురు ఉద్యోగ సంఘ నేతలు శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

06/17/2017 - 02:46

విజయవాడ, జూన్ 16: ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు జిల్లాలు, తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్‌లో జనసేన నిర్వహించిన ఔత్సాహికుల ఎంపిక శిబిరాలను విజయవంతం చేసిన వారందరికీ జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. జనసేన తలపెట్టిన ఈ యజ్ఞంపై చూపిన ఆదరాభిమానాలు తనలో మరింత శక్తిని నింపుతున్నాయని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Pages