S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/16/2017 - 01:08

కాకినాడ, జూన్ 15: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నుండి సముద్రంలో వేటకు వెళ్ళి గల్లంతైన ఏడుగురు జాలర్ల ఆచూకీ ఎట్టకేలకు లభ్యమయ్యింది. ఒడిశాలోని పారాదీప్ తీరానికి వారు సురక్షితంగా చేరినట్టు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా గురువారం తెలిపారు.

06/16/2017 - 01:08

న్యూఢిల్లీ, జూన్ 15: హైకోర్టు విభజన వ్యవహారం కేసుల మూలంగా అత్యంత వివాదాస్పదంగా తయారైందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ భావిస్తున్నారు. రవిశంకర్ ప్రసాద్ గురువారం విలేఖరులతో మాట్లాడుతూ హైకోర్టు విభజనపై కోర్టులో పలు కేసులు దాఖలయ్యాయని తెలిపారు. పలుచోట్ల స్టేలు అమలులో ఉన్నందున విభజన వ్యవహారం ఆశించిన స్థాయిలో ముందుకు సాగటం లేదన్నారు.

06/16/2017 - 00:47

విశాఖపట్నం, జూన్ 15: క్రమశిక్షణకు మారుపేరైన టిడిపిలో తమ్ముళ్లు గాడి తప్పుతున్నారు. తమ్ముళ్లు ఆధిపత్య పోరులో నిమగ్నమైపోయి, పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారు కూడా సీనియర్లను తోసిరాజని, జిల్లాపై పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాల వలన పార్టీ బీటలు వారుతోంది. ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచుకోట.

06/16/2017 - 00:47

విజయవాడ, జూన్ 15: విశాఖలో భూ కుంభకోణాన్ని వెలికితీయడం వల్ల ప్రభుత్వ, పార్టీ ప్రతిష్ఠ పెరిగిందని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ తనకు మంత్రి గంటా శ్రీనివాసరావుతో విభేధాలు లేవని స్పష్టం చేశారు. సిఎంకు గంటా రాసిన లేఖలో తన పేరు ఎందుకు ప్రస్తావించారో తనకు తెలియదని వ్యాఖ్యానించారు.

06/16/2017 - 00:46

అనంతపురం, జూన్ 15: భూ కుంభకోణం కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు జెసి బ్రదర్స్‌కు ఎదురు దెబ్బే. అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జెసి ప్రభాకర్‌రెడ్డికి దీపక్‌రెడ్డి స్వయానా అల్లుడు. జెసి ప్రభాకర్‌రెడ్డి ఏకైక కూతుర్ని ఆయనకు ఇచ్చి వివాహం చేశారు.

06/16/2017 - 00:44

విశాఖపట్నం, జూన్ 15: అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిని రాష్టప్రతిగా ఎన్నుకుంటే అభ్యంతరం లేదని, రాజకీయాలకర అతీతంగా తటస్థంగా ఉండే అభ్యర్థి రాష్టప్రతి కావాలని ఏఐసిసి అధికార ప్రతినిధి షర్మిష్ఠా ముఖర్జీ అన్నారు.

06/15/2017 - 03:56

రాజమహేంద్రవరం, జూన్ 14: అఖండ గోదావరి కుడి గట్టుపై పట్టిసీమ వద్ద నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ఏడాది నుంచి 100 టిఎంసిల నీటిని తోడటానికి రంగం సిద్ధమవుతోంది. గోదావరిలో కనీస మట్టం 14 మీటర్లు ఉంటేనే నీటిని తోడాలని జీవో వుంది. అయితే పట్టిసీమ వద్ద 12.5 మీటర్ల మట్టంలో కూడా నీటిని తోడే విధంగా ఈ పంప్ హౌస్‌ను డిజైన్ చేశారని తెలుస్తోంది.

06/15/2017 - 03:49

మనుబోలు, జూన్ 14:తమ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉన్న 6.7తరగతులు తొలగించడంపై ఒక గ్రామ సర్పంచ్ బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం అక్కంపేట సర్పంచ్ ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

06/15/2017 - 03:49

నెల్లూరు/యర్రగొండపాలెం, జూన్ 14: అవినీతి రుచి మరిగిన ముగ్గురు ఇంజనీరింగ్ అధికారులు ఏసిబి అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

06/15/2017 - 03:47

కాకినాడ, జూన్ 14: సముద్రంలో వేటకు వెళ్ళి గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం బంగాళాఖాతంలో రక్షణ దళాలు గాలింపు చర్యలు ముమ్మరంచేశాయి. కాకినాడ నగరంలోని పర్లోవపేట గ్రామానికి చెందిన ఏడుగురు జాలర్లు మే 31వ తేదీన ఫైబర్ బోటుపై వేటకు వెళ్ళి తిరిగి రాకపోవడంతో బాధిత కుటుంబాలు ఈ నెల తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన విషయం విదితమే.

Pages