S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/02/2016 - 07:54

విశాఖపట్నం: మోటారు వాహనాలు కొనుగోలు చేసిన డీలర్ వద్దే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం నుంచి ప్రారంభించింది. ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని తొలుత విశాఖ నుంచి ప్రారంభించారు. ర్వాత ఈ విధానాన్ని రాష్ట్రం అంతటా అమలు చేయనున్నారు.

03/02/2016 - 05:59

విజయవాడ: రాష్ట్ర విభజనానంతరం ఆర్థిక సంక్షోభంతో ఆంధ్రప్రదేశ్ కొట్టుమిట్టాడుతున్నప్పటికీ గడచిన రెండేళ్లలో అభివృద్ధికి, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూనే, వ్యవసాయ రంగానికి ముందెన్నడూ లేని విధంగా పెద్దపీట వేశామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, సిఎం చంద్రబాబు సగర్వంగా చెప్పారు.

03/01/2016 - 15:25

విజయవాడ:అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడిపిస్తున్నందునే ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, నేతలు తమ పార్టీలోకి వస్తున్నారని, ఇప్పటికే కొందరు చేరగా మరికొందరు పార్టీలోకి వస్తామని అడుగుతున్నారని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు నేతలు టిడిపిలో చేరారు.

03/01/2016 - 15:24

హైదరాబాద్:శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే, వైకాపా నేత తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. నియోజికవర్గం అభివృద్ధికోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. తన తండ్రి కలమట మోహనరావుతోపాటు ఈనెల 4న టిడిపి తీర్థం పుచ్చుకోనున్నట్లు ఆయన తెలిపారు.

03/01/2016 - 08:00

హైదరాబాద్: రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.

03/01/2016 - 07:32

రాజమహేంద్రవరం: కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టుకు అరకొరగా కేవలం రూ.100 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ కేటాయింపులను చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర నిరాశ నిస్పృహలు వ్యక్తంచేస్తున్నారు. బిజెపియేతర రాజకీయ పార్టీల నాయకులు పోలవరం కేటాయింపులను చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తుంటే, నోరెత్తలేని పరిస్థితుల్లో ఉన్న బిజెపి నాయకులు తలపట్టుకున్నారు.

03/01/2016 - 07:22

శ్రీశైలం:ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం యాగశాల ప్రవేశంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మహాశివరాత్రి పుణ్యకాలం పురస్కరించుకుని నవహ్నిక దీక్షతో 11 రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం ఆలయ ప్రాంగణంలో ఉత్సవ ప్రారంభ పూజలను ఆగమ శాస్త్రానుసారంగా ప్రారంభించారు.

03/01/2016 - 07:21

తెనాలి: ఆంధ్రా ప్యారిస్ తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ల కుమ్ములాటకు వేదికగా మారింది. సోమవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో మున్సిపల్ చైర్మన్ కొత్తమాసు తులసీదాసు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తొలుత ప్రత్యేక ప్యానల్ కమిటీ ఎంపిక సజావుగానే జరిగింది.

02/29/2016 - 17:35

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం నుంచి ఎపీకి తగినన్ని నిధులు రాబడతామని, రాష్ట్రానికి ఎలాంటి అన్యాయం జరగుకుండా చూస్తామని కేంద్రమంత్రి సుజానా చౌదరి సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌లో రైతులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఎన్నో వరాలున్నాయని అన్నారు.

02/29/2016 - 12:11

శ్రీకాకుళం: పలాస పట్టణంలో ప్రముఖ జీడి వ్యాపారి సంతోష్ కుమార్‌కు బెదిరింపు కాల్స్ చేస్తూ మూడు కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

Pages