S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/24/2016 - 13:33

విజయవాడ: పక్కా ప్రణాళికతో కృష్ణా పుష్కరాలను నిర్వహించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు, కార్మికులను అభినందించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో ఏర్పాటుచేసిన అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ విజయం ఏ ఒక్కరిదో కాదని, సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందన్నారు.

08/24/2016 - 13:22

గుంటూరు : ఆస్తి వివాదంలో ఓ వర్గం మరో వర్గంపై దాడికి పాల్పడిన ఘటనలో ఒకరు మృతిచెందారు. కొల్లిపర మండలం తూములూరులో భూమి పంపీణీ విషయంలో సీతమ్మకు, అల్లుడు సుధాకర్‌ రెడ్డికి వివాదం ఏర్పడి కోర్టుకెక్కారు.

08/24/2016 - 13:12

గుంటూరు : అమరావతి మండలం ధరణికోటలో బుధవారం కృష్ణానదిలో మునిగి గుడివాడకు చెందిన మహేశ్‌(25), దుర్గ(27) మృతి చెందారు. స్థానిక బేకరీలో మిఠాయిలు తయారు చేసేందుకు వీరు అమరావతికి వచ్చారు. ఎస్తేరు అనే యువతి బట్టలు ఉతికేందుకు నదికి రావడంతో ఆమెతో పాటు నదిలో స్నానం చేసేందుకు వీరు వచ్చారు. ఈతకు దిగే ముందు వీరు మద్యం సేవించినట్లు ఎస్తేరు తెలిపింది.

08/24/2016 - 11:36

శ్రీకాకుళం: జిల్లాలోని సముద్రతీర ప్రాంతం కపాసుకుద్ది వద్ద సరుగుడు తోటల్లో ఓ చిరుత సంచరిస్తోందని సమీప గ్రామాల వారు భయాందోళనలు చెందుతున్నారు. కవిటి వద్ద కూడా చిరుత కనిపించినట్టు స్థానికులు తెలిపారు.

08/24/2016 - 11:33

విశాఖ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 48 గంటల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, ఆవర్తనం మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. తెలిపింది. దీని ప్రభావంతో 26న ఉత్తర కోస్తాలో పలు చోట్ల, 27న కోస్తా అంతటా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

08/24/2016 - 11:30

ఒంగోలు : కొనకనమెట్ల మండలం చౌటపల్లి గ్రామం దగ్గర బుధవారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీ కారు ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతిచెందిన ఇద్దరు మెదక్ జిల్లా సిద్దిపేట వాసులుగా గుర్తించారు.

08/24/2016 - 08:34

విజయవాడ, ఆగస్టు 23: గోదావరి పుష్కరాల్లో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో వుంచుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతిష్టాకరంగా భావించిన కృష్ణా పుష్కరాలు విజయవంతంగా ముగిసాయి. అయితే చెదురుమదురు ఘటనలు మినహా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు.

08/24/2016 - 08:34

విజయవాడ(బెంజిసర్కిల్), ఆగస్టు 23: ఎన్నో వ్యయప్రయాసలకోర్చి కృష్ణా పుష్కరాలను విజయవంతం చేయగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం, ప్రజలు కలిస్తే ఇటువంటి విజయాలు మరెన్నో చేయగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కృష్ణా పుష్కరాల చివరి రోజు ఏర్పాట్లపై మంగళవారం ఆయన ఉండవల్లిలోని తన నివాసం నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

08/24/2016 - 08:33

కర్నూలు, ఆగస్టు 23 : కృష్ణా పుష్కరోత్సవాలు మంగళవారం నాటితో ముగిశాయి. గత 12 రోజులుగా కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం, సంగమేశ్వరంతో పాటు నెహ్రూనగర్, ముచ్చుమర్రి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పుష్కరఘాట్‌లలో మొత్తం 14.81 లక్షల మంది పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు ప్రకటించారు. అలాగే లక్షలాది మంది పితృదేవతలకు పిండ ప్రదానాలు చేశారు.

08/24/2016 - 08:33

ఇబ్రహీంపట్నం/ మైలవఠం, ఆగస్టు 23: సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించే దిశగా ముందుకెళుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద సదస్సు వేదికపై మంగళవారం ఉదయం ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్-(ఐఒటి)’పై ఏర్పాటు చేసిన చర్చాగోష్టిలో ఆయన ప్రసంగించారు.

Pages