S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/25/2016 - 06:51

హైదరాబాద్, ఆగస్టు 24: కృష్ణా పుష్కరాలను 12 రోజులపాటు అట్టహాసంగా జరిపి ప్రతి కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాలను కేవలం ఐదు రోజులపాటే ఉంటాయని ప్రతిపాదించడంపై వైకాపా మండిపడింది. బుధవారం విలేఖర్ల సమావేశంలో వైకాపా సీనియర్ నేత భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం ప్రజల పాలిట కేన్సర్‌లా తయారైందన్నారు.

08/25/2016 - 06:48

తిరుపతి, ఆగస్టు 24: దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకంలో వెనుకబడిన తరగతులకు చెందిన న్యాయమూర్తులకు ధర్మం జరగడం లేదని తిరుపతి మాజీ ఎంపి డాక్టర్ చింతామోహన్ అభిప్రాయపడ్డారు.

08/25/2016 - 06:48

గుంటూరు, ఆగస్టు 24: ఆంధ్రప్రదేశ్ శాసనసభ భవనాల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ ప్రాంగణంలోనే 2 లక్షల చదరపు మీటర్లలో శాసనసభ, శాసనమండలి భవనాల నిర్మాణాన్ని ఎల్ అండ్ టి సంస్థ చేపట్టింది.

08/25/2016 - 06:44

తాడికొండ, ఆగస్టు 24: గుంటూరు జిల్లా తాడికొండ మండల పరిధిలోని అమరావతి-గుంటూరు ప్రధాన ప్రధాన రహదారిలో గల విద్యుత్ సబ్‌సేష్టన్‌లో బుధవారం రాత్రి 100 పవర్ ట్రాన్స్ ఫార్మర్ పైన ఉన్న ఇన్స్‌లేటర్ పగలడంతో (పిటిఅర్) పేలి మంటలు చేలరేగి, దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో అయా గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురైనారు. ప్రభుత్వానికి నాలుగు కోట్లు నష్టం జరిగిందని అధికారులు అంటున్నారు.

08/25/2016 - 06:43

హైదరాబాద్, ఆగస్టు 24: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆంధ్రప్రదేశ్ పాలిట వరంగా మారింది. ఈ పథకం కింద కేంద్రం ఇస్తున్న నిధులను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటోంది. వేలకోట్ల రూపాయిల నిధులతో రాష్ట్రంలో వివిధ అభివృద్ధి పథకాలు చేపట్టడంతోపాటు ఇటు పనుల్లేక అల్లాడుతున్న పేదలకు జీవనోపాధిగా మారింది. అంటే ఒకే పథకంతో విస్తృత ప్రయోజనాలను సాధించుకుంటోంది.

08/25/2016 - 06:24

విజయవాడ, ఆగస్టు 24: కృష్ణా పుష్కరాలు ముగియటంతోనే రాష్ట్ర రాజధాని విజయవాడలో పుష్కర శోభ కళతప్పింది. 12 రోజులపాటు రాత్రి పగలు తేడా లేకుండా పుష్కర యాత్రికులతో కళకళలాడుతూ కన్పించిన స్నానఘట్టాలు వెలవెలపోతూ కన్పించాయి. కొన్ని ఘాట్లలో కనీసం ఒక్క మనిషి కూడా కన్పించలేదు. గతంలో కవర్లు, చెత్త కాగితాలు ఏరుకోటానికి వందలాది మంది పోటీ బడుతూ బారులు దీరేవారు.

08/25/2016 - 06:23

విశాఖపట్నం, ఆగస్టు 24: విశాఖ జిల్లా గిరిజన ప్రాంతం, అరకు, విశాఖ నగర అందాలను హెలికాప్టర్ ద్వారా వీక్షించే అవకాశం దసరా నుంచి అందుబాటులోకి రానుంది. చాలా కాలంగా ఊరిస్తున్న ఈ ప్రతిపాదన త్వరలో కార్యరూపం దాల్చనుంది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు సమక్షంలో విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా), స్కై చాపర్స్ లాజిస్టిక్స్ సంస్థ బుధవారం విశాఖలో ఒప్పందం చేసుకున్నాయి.

08/25/2016 - 06:22

విశాఖపట్నం, ఆగస్టు 24: జాతీయ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌ను విశాఖలో నిర్వహించనున్నారు. రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 19 నుంచి 25 వరకూ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి టోర్నమెంట్ లోగోను విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) కార్యాలయంలో రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం ఆవిష్కరించారు.

08/25/2016 - 06:21

పోలవరం, ఆగస్టు 24: పట్టిసం ఎత్తిపోతల పథకంలోని 16 మోటార్లను బుధవారం నుండి ఆన్‌చేసి పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా కృష్ణా జిల్లాకు గోదావరి నీటిని తరలిస్తున్నారు. రోజుకు 5,664 క్యూసెక్కుల నీటిని కృష్ణా జిల్లాకు తరలిస్తున్నారు. ఎత్తిపోతల ప్రారంభించినప్పటి నుంచి అధిక మోటార్లు ఆన్‌చేయడం ఇదే మొదటిసారి.

08/25/2016 - 06:21

తిరుపతి, ఆగస్టు 24: పురాతన ఆలయాలను అభివృద్ధి చేయడానికి ఒక సంక్షేమ నిధి ఏర్పాటుచేసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమటీ చైర్మన్ బి. రాజేంద్రనాథ్ టిటిడి అధికారులకు సూచించారు. జిల్లాలో మూడురోజుల పర్యటన నిమిత్తం తిరుపతి వచ్చిన కమిటీ రెండోరోజైన బుధవారం తిరుపతి పద్మావతి అతిథిభవనంలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పలు అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Pages