S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/28/2016 - 18:17

తిరుపతి: టిడిపి మహానాడు రెండో రోజు సభలో ఆ పార్టీ అధినేత, ఎపి సిఎం చంద్రబాబు పులివెందుల పట్టణంపైన, పరోక్షంగా వైకాపా అధ్యక్షుడు జగన్‌పైనా సెటైర్లు వేసి అందరినీ నవ్వించారు. ‘పులివెందులలో అంతా మంచోళ్లే.. కానీ, ఒక్క రౌడీ షీటర్ వల్లే..’ అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో కార్యకర్తలంతా ఒక్కసారి పగలబడి నవ్వారు.

05/28/2016 - 16:55

తిరుపతి: ప్రజారాజ్యం పార్టీ పెట్టి లక్షలాదిమంది కాపుల్లో ఆశలు రేకెత్తించిన సినీ నటుడు చిరంజీవి చివరికి కాంగ్రెస్‌లో చేరిపోయి తమ కులస్థులను నట్టేట ముంచేశాడని రాష్ట్ర మంత్రి నారాయణ ఆరోపించారు. ఇక్కడ టిడిపి మహానాడులో శనివారం ఆయన మాట్లాడుతూ, కేంద్ర మంత్రులుగా పదవులు అనుభవించిన దాసరి నారాయణరావు, చిరంజీవి కాపులను ఏనాడూ పట్టించుకోలేదన్నారు.

05/28/2016 - 15:56

తిరుపతి: పెత్తందార్ల పాలనతో నిజమైన తెలంగాణ రాదని, దొరల ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు తాము నిరంతరం పోరాడతామని టి.టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. టిడిపి మహానాడులో శనివారం ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో పార్టీ బలోపేతం చేసే బాధ్యతలను బడుగువర్గాల నేతలకు అప్పగించాలని సూచించారు.

05/28/2016 - 15:55

తిరుపతి: టిడిపి మహానాడు సందర్భంగా ఆ పార్టీ యువనేత నారా లోకేష్ శనివారం రక్తదానం చేశారు. కొంతమంది పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా లోకేష్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు పోటీపడ్డారు.

05/28/2016 - 15:55

తిరుపతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి చరిత్రను ఆధారంగా చేసుకుని ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా తీయడం అభినందనీయమని టిడిపి అధినేత, సిఎం చంద్రబాబు పార్టీ మహానాడులో ప్రశంసించారు. ఈ సినిమాతో అమరావతి చరిత్ర ప్రపంచానికంతా తెలుస్తుందన్నారు. కాగా, రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తున్నానని ఆయన అన్నారు.

05/28/2016 - 15:54

విజయవాడ: ఆగస్టులో జరిగే కృష్ణా పుష్కరాల్లో భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని, సుమారు పాతికవేల మంది పోలీసు సిబ్బందిని ఘాట్‌ల వద్ద నియమిస్తామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతం సావంగ్ శనివారం తెలిపారు. ఘాట్‌ల వద్ద, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్‌లో రద్దీని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్ని ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షించించేందుకు సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

05/28/2016 - 15:54

హైదరాబాద్: చిత్తూరు జిల్లా నగరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైకాపా ఎమ్మెల్యే రోజా ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాయుడు అనే వ్యక్తి దీన్ని దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను కొట్టివేయాలని రోజా కూడా పిటిషన్ వేశారు. దీంతో రెండు పిటిషన్లనూ ఒకేసారి విచారిస్తామని హైకోర్టు చెప్పడాన్ని వ్యతిరేకిస్తూ రోజా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వచ్చే నెలాఖరులోగా ఆ పిటిషన్ విచారణకు వస్తుంది.

05/28/2016 - 15:53

తిరుపతి: నటుడిగా, రాజకీయ నేతగా తెలుగువారి హృదయాల్లో నిలిచిపోయిన దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరును ఆయన పుట్టిపెరిగిన కృష్ణా జిల్లాకు పెట్టాలని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ విజ్ఞప్తిచేశారు. టిడిపి మహానాడులో శనివారం ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్‌కు ఇకనైనా భారతరత్న బిరుదును కేంద్రం ప్రకటించాలన్నారు. ఎపికి ప్రత్యేక హోదాకోసం తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో పోరాడతారని ఆయన ప్రకటించారు.

05/28/2016 - 15:53

విజయవాడ: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను చంద్రబాబు వంచించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు పెడతామని వైకాపా నేతలు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ శనివారం ఇక్కడ మీడియాకు తెలిపారు. చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా జూన్ 2న సభలు, సమావేశాలు నిర్వహిస్తామన్నారు. టిడిపి మహానాడులో చంద్రబాబు అన్నీ అబద్ధాలు చెబుతున్నారని వారు ఆరోపించారు.

05/28/2016 - 15:52

తిరుపతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచం మెచ్చుకునేలా నిర్మిస్తామని టిడిపి అధినేత, ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. ఇక్కడ టిడిపి మహానాడు రెండోరోజు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అమరావతి నుంచి అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు ఎక్స్‌ప్రెస్ హైవేలను నిర్మిస్తామని, రాజధాని చుట్టూ 210 కిలోమీటర్ల పరిధిలో అధునాతన రింగురోడ్డు వేస్తామని వివరించారు.

Pages