S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/22/2018 - 04:22

అమరావతి, ఆగస్టు 22: రాష్ట్రంలోని జర్నలిస్టుల సొంతింటి కలను సాకారంచేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గృహనిర్మాణానికి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించేందుకు రూపొందించిన వెబ్‌సైట్‌ను మంగళవారం సచివాలయంలో రాష్ట్ర సమాచార, గృహనిర్మాణ శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు ప్రారంభించారు.

08/22/2018 - 04:20

అమరావతి, ఆగస్టు 21: రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమకు ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చిన్నతరహా చిత్ర నిర్మాణాలకు పన్నుల నుంచి వెసులుబాటు కల్పించే యోచనలో ఉంది. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పటికీ చిన్నతరహా సినిమాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుందని రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అంబికా కృష్ణ వెల్లడించారు.

08/22/2018 - 03:34

గుంటూరు, ఆగస్టు 21: రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తామని, ఇందుకోసం ఎంతవరకైనా వెళ్లేందుకు వెనుకాడబోమని గుంటూరు టీడీపీ పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్ స్పష్టంచేశారు. మంగళవారం తాడికొండ మండలం, లాంలోని చలపతి విద్యాసంస్థల్లో ఏర్పాటుచేసిన విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ఎంపీ జయదేవ్ పాల్గొన్నారు.

08/22/2018 - 03:32

అమరావతి, ఆగస్టు 21: వరదలతో అతలాకుతలమైన కేరళ ప్రజానీకాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు మూడు లారీల్లో 51 మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్) తరలించారు. మంగళవారం సాయంత్రం సచివాలయం నుండి బయల్దేరిన బియ్యం లారీలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఇవికాక మరో 8 లారీల్లో 204 మెట్రిక్ టన్నుల బియ్యం ఈ రాత్రికే కేరళకు బయల్దేరుతున్నాయి. రూ.

08/22/2018 - 03:30

అమరావతి, ఆగస్టు 21: అన్ని ప్రభుత్వ శాఖల్లో నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. గ్రామదర్శిని, వివిధ శాఖల పురోగతి, కేంద్ర సాయం, తదితర అంశాలపై మంగళవారం సచివాలయం నుంచి ప్రభుత్వ కార్యదర్శులు, హెచ్‌ఓడీలు, జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించుకున్నాం..

08/22/2018 - 03:29

ఒంగోలు/చిత్తూరు, ఆగస్టు 21 : కేరళ లోని వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం అందించేందుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ వి వినయ్‌చంద్ పిలుపునిచ్చారు. మంగళవారం ఒంగోలులోని కలెక్టరేట్ ఆవరణలో కేరళ బాధితుల కోసం 20 మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం లోడు చేసిన లారీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.

08/22/2018 - 03:29

విజయవాడ, ఆగస్టు 21: రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 6 నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు సమావేశాల తేదీలను ఖరారు చేసినట్లు అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మీడియాకు మంగళవారం తెలిపారు. 10 రోజుల పాటు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. త్వరలో ఈ మేరకు నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ సమావేశాలకు ప్రతిపక్ష పార్టీ హాజరు కావాలని వైకాపా అధినేత జగన్‌ను స్పీకర్ కోరే అవకాశం ఉంది.

08/22/2018 - 03:28

అమరావతి, ఆగస్టు 21: వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాల కోసం ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా పాదయాత్ర చేస్తున్నారని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలోని ఎన్‌డీఏతో టీడీపీ తెగదెంపులు చేసుకుని ధర్మపోరాటం చేస్తుంటే, జగన్ మాత్రం బీజేపీతో రహస్య కాపురం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

08/22/2018 - 03:28

న్యూఢిల్లీ, ఆగస్టు 21: భోగాపురం విమానాశ్రయ నిర్మాణ టెండర్ల వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కేంద్రానికి బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర పౌర విమాన యాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హాకు ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఫిర్యాదు చేశారు. మంగళవారం వీర్రాజు విలేఖరులతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అవినీతి వ్యవహారాలపై కోర్టులను ఆశ్రయిస్తామని పేర్కొన్నారు.

08/21/2018 - 04:47

విజయవాడ: మెడికల్ కౌనె్సలింగ్‌లో రిజర్వేషన్ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దేవరకు కౌనె్సలింగ్ ప్రక్రియను పూర్తిగా నిలిపివేయాలనే డిమాండ్‌పై ఏపీ విద్యార్థి, యువజన, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలు సోమవారం తలపెట్టిన ఎన్టీఆర్ హెల్త్‌యూనివర్శిటీ ముట్టడి కార్యక్రమాన్ని సాయుధ పోలీస్ బలగాలు భగ్నం చేశాయి.

Pages