S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/22/2019 - 07:52

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం అధిక నష్టాల పాలయ్యాయి. ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంక్ తీవ్ర నష్టాల పాలవడం మొత్తం మార్కెట్ల ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపింది. అంతేకాకుండా ఆర్థిక మందగమనం మదుపర్లలో ఆందోళన రేకెత్తించిందని, అందుకే మంగళవారం స్వల్ప స్థాయికే పరిమితమైన నష్టాలు బుధవారం అధిక స్థాయికి చేరాయని వాణిజ్యవర్గాలు తెలిపాయి. ప్రారంభం నుంచే సూచీలు నష్టాలతో మొదలయ్యాయి.

08/22/2019 - 07:43

విజయవాడ, ఆగస్టు 21: కేంద్ర ప్రభుత్వ జీఎస్టీలో నమోదు చేసుకున్న పన్ను చెల్లింపుదారులందరూ 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్‌లను ఆగస్టు 31వ తేదీలోగా ఫైల్ చేయాలని కేంద్ర పన్నుల విజయవాడ డివిజన్ ఉప కమిషనర్ సీ శంకరన్ రాజు తెలిపారు. లేని పక్షంలో జీఎస్టీ చట్టం ప్రకారం భారీగా జరీమానాలు చెల్లించాల్సి ఉంటుందని బుధవారం ఒక ప్రకటనలో ఆయన స్పష్టం చేశారు.

08/22/2019 - 02:11

విజయవాడ (సిటీ), ఆగస్టు 21: ఒకవైపు నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు భగ్గుమంటుంటే మరోవైపు విద్యుత్ ఛార్జీలు వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. సిబ్బంది అలసత్వం, నిర్లక్ష్యం వల్ల వినియోగదాడికి విద్యుత్ బిల్లులు చుక్కలు చూపిస్తున్నాయి. ఒక్కరోజు ఆలస్యంగా బిల్లులు తీస్తే చాలు రీడింగ్‌లతో మారుతున్న స్లాబులతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.

08/21/2019 - 23:45

విజయవాడ, ఆగస్టు 21: సమాజంలోని విభిన్న వర్గాల ప్రయోజనం కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయపు పన్ను వసూళ్లను వినియోగిస్తాయన్న విషయాన్ని మరువరాదని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. అలాగే పన్ను చెల్లింపు దారుల సంఖ్య కూడా గణనీయంగా పెరగటం శుభపరిణామనన్నారు. ఇది దేశ ఆర్థిక అభివృద్ధికి చిహ్నమని, సమాజ ప్రయోజనాల కోసనే పన్ను చెల్లిస్తున్నామన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు.

08/21/2019 - 22:30

కోల్‌కతా, ఆగస్టు 21: పునరుత్పాదక విద్యుత్ భవిష్యత్తులో సంప్రదాయ విద్యుత్ వినియోగ స్థానాన్ని పూర్తి స్థాయిలో ఆక్రమించే అవకాశాలు ఎంతమాత్రం లేవని కోల్ ఇండియా చైర్మన్ అనిల్‌కుమార్ ఝా బుధవారం నాడిక్కడ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే సంప్రదాయ విద్యుత్ వినియోగం నుంచి మారే విషయంలో మనదేశంలో ప్రత్యేక పరిస్థితులున్నాయని ఆయన తెలిపారు.

08/21/2019 - 22:29

ముంబయి, ఆగస్టు 21: గడచిన జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో వివిధ కార్పొరేట్ కంపెనీల ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడానికి ఆర్థిక మాంద్యమే ప్రధాన కారణమని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ‘కేర్ రేటింగ్స్’ అధ్యయన నివేదిక వెల్లడించింది. ప్రధానంగా ‘ఇండియా ఇన్క్’ నికర విక్రయాల వృద్ధి గడచిన జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 4.6 శాతానికి పడిపోయింది. గత ఏడాది ఇదే కాలంలో 13.5 శాతం వృద్ధిరేటు నమోదైంది.

08/21/2019 - 22:29

న్యూఢిల్లీ, ఆగస్టు 21: బంగారం ధరలు బుధవారం సరికొత్త గరిష్ట స్థాయికి చేరాయి. దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల (తులం) బంగారంపై రూ. 50 పెరిగి మొత్తం ధర రూ. 38,829కి చేరింది. ఆభరణ వ్యాపారుల నుంచి స్థిరమైన కొనుగోళ్ల మద్దతు లభించడం వల్లే ఇలా పసిడి ధరలు పెరిగాయని ‘ఆలిండియా సరాఫా అసోసియేషన్’ వర్గాలు తెలిపాయి. ఇలావుండగా మంగళవారం ధరలు తగ్గిన వెండికి సైతం బుధవారం డిమాండ్ పెరిగి కిలోపై రూ.

08/21/2019 - 05:00

గుంటూరు : వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతాంగానికి నూరుశాతం రాయితీతో విత్తనాలు సరఫరా చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. మంగళవారం గుంటూరు సమీపంలోని లాం ఫారంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న మంత్రి కన్నబాబు మాట్లాడుతూ కృష్ణానది వరదలతో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో, గోదావరి వరదలతో ఉభయ గోదావరి జిల్లాల్లో పంట నష్టం జరిగిందన్నారు.

08/21/2019 - 04:24

విజయవాడ, ఆగస్టు 20: మరో రెండు, మూడు నెలల్లో కొత్త పారిశ్రామిక విధానం తీసుకురానున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గౌతం రెడ్డి తెలిపారు. గతంలో ఇచ్చిన రాయితీలు, చేసుకున్న ఒప్పందాలపై శే్వతపత్రం విడుదల చేస్తామని తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొందరు ద్వేషంతో చేస్తున్న ప్రచారాలను నమ్మవద్దని తెలిపారు.

08/21/2019 - 00:36

న్యూఢిల్లీ, ఆగస్టు 20: విదేశీ పర్యాటకుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ- టూరిస్ట్ వీసా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ప్రకారం విదేశీ పర్యాటకులు ఎక్కువగా వచ్చే జూలై నుంచి మార్చి వరకూ ఎక్కువ మొత్తంలో రుసుం వసులు చేస్తారు. విదేశీ పర్యాటకులు రాక స్వల్పంగా ఉండే ఏప్రిల్ నుంచి జూన్ వరకూ నామమాత్రంగా రుసుం ఉంటుంది.

Pages