S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/27/2019 - 00:16

న్యూఢిల్లీ, ఆగస్టు 26: వరుసగా ఐదోరోజూ పసిడి ధరలు పెరిగాయి. దీంతో 10 గ్రాముల ధర సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం రూ.675 పెరిగి మొత్తం ధర 39,670కి చేరింది. రూపాయి బలహీన పడటంతోబాటు అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్ బంగారం ధరలు పెరిగేందుకు దోహదం చేశాయని వాణిజ్య విశే్లషకులు పేర్కొన్నారు.

08/26/2019 - 23:50

విశాఖపట్నం, ఆగస్టు 26: విశాఖ నుంచి బ్యాంకాక్‌కు విమాన సర్వీసు నడిపేందుకు నాక్ ఎయిల్‌లైన్స్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం విశాఖ నుంచి వారానికి మూడుసార్లు బ్యాంకాక్‌కు ఎయిర్ ఏషియా విమాన సర్వీసు నడిపేది. సెప్టెంబర్ 23వతేదీ నుంచి ఈ విమానయాన సంస్థ సర్వీసును రద్దు చేసుకుంది.

08/26/2019 - 23:32

బియారిడ్జ్/లండన్, ఆగస్టు 26: అమెరికా నుంచి చమురు సహా దిగుమతుల పరిమాణాన్ని గణనీయంగా పెంచుకుంటామని భారత్ స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో సోమవారం నాడిక్కడ జరిగిన సమావేశం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు.

08/26/2019 - 02:45

హైదరాబాద్: హైదరాబాద్ పరిసర జిల్లాల్లో ముఖ్యమైన పట్టణాలను కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం పనులు త్వరలో ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రోడ్డుపక్కనున్న భూములకు రెక్కలొచ్చాయి. అనేక పట్టణాల శివార్లలో ఇండ్ల స్థలాల రేట్లు అమాంతం పెరిగాయి. దీంతో హైదరాబాద్‌కు పూర్వపు రియాల్టీ రంగ వైభవం తిరిగి వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రీజనల్ రింగ్ రోడ్డును ప్రతిష్టాకరంగా తీసుకున్నారు.

08/26/2019 - 02:40

న్యూఢిల్లీ, ఆగస్టు 25: వివిధ రకాల ఇతర వాణిజ్యాల వైపు అడుగులేస్తున్న ఇండియన్ టొబాకో కంపెనీ (ఐటీసీ) తన స్టేషనరీ వ్యాపారంలో మళ్లీ రెండంకెల వృద్ధి రేటును వచ్చే డిసెంబర్ నాటికి సాధిస్తామన్న ధీమాను ఆదివారం నాడిక్కడ వ్యక్తం చేసింది. ఆర్థిక మాంద్యం, వరదల కారణంగా తగ్గిన విక్రయాల నేపథ్యంలో గడచిన ఆరు నెలల కాలంగా ఈ సంస్థ సేషనరీ విక్రయాల వృద్ధిరేటు సింగిల్ డిజిట్‌కు పడిపోయింది.

08/26/2019 - 01:59

న్యూఢిల్లీ : నిత్యావసర వస్తువులు, ఔషధాలకు ఏ మాత్రం కొరత లేదని జమ్మూ-కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తెలిపారు. కమ్యూనికేషన్స్ వ్యవస్థను నిరోధించడం వల్ల చాలా ప్రాణాలను కాపాడగలిగామన్నారు. జమ్మూ-కాశ్మీర్, లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన తర్వాత ప్రశాంతమైన పరిస్థితులు నెలకొన్నాయని, ఏ ఒక్క చిన్న ఘటన కూడా జరగలేదన్నారు.

08/26/2019 - 01:47

న్యూఢిల్లీ : విదేశీ పోర్టుపోలియో పెట్టుబడుల (ఎఫ్‌పీఐలు)పై పెంచిన సర్‌చార్జీలు ఉపసంహరించుకోవడంతోబాటు మరిన్ని ఆర్థిక పునరుత్తేజ నిర్ణయాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వ చర్యలు దేశీయ స్టాక్ మార్కెట్లకు ఊతమివ్వనున్నాయి. ఈక్రమంలో ఈవారం సూచీలు లాభాలను నమోదు చేసే అవకాశాలున్నాయని విశే్లషకులు అంచనా వేస్తున్నారు.

08/26/2019 - 01:46

తిరుపతి, ఆగస్టు 25: ముంబైకి చెందిన రిలయన్స్ సంస్థ సీఈవో పిఎంఎస్ ప్రసాద్ ఆదివారం ఉదయం ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు ఒక కోటి 11 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ఈ మేరకు విరాళం డీడీని తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో తిరుమల ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు.

08/26/2019 - 01:07

ఖైరతాబాద్, ఆగస్టు 25: నగర ప్రజలకు ప్రయాణాన్ని మరింత సుఖవంతం చేసేందుకు టోరా సంస్థ నేటి నుంచి క్యాబ్ సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు ప్రకటించింది. ఆదివారం బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎండీ శాంతి మండే, శ్రీనివాస్ కృష్ణతో కలిసి యాప్‌ను ఆవిష్కరించారు.

08/25/2019 - 04:00

న్యూఢిల్లీ : దేశ ఆర్థికమంత్రిగా, రక్షణ మంత్రిగా ఎన్నో కీలక సంస్కరణలకు జైట్లీ నాంది పలికారు. ఇటు ఆర్థికరంగంలోను, అటు సామాజిక రంగంలోనూ ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎంతో ప్రభావశీలతను కనబరిచాయి. ముఖ్యంగా 2014లో మోదీ ప్రభుత్వం తొలిసారిగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అనేక కీలక నిర్ణయాల్లో జైట్లీ కీలక పాత్ర ఉంది.

Pages