S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/21/2019 - 20:46

ముంబయి, జూన్ 21: గత మూడు రోజులుగా పరుగులు తీసిన స్టాక్ మార్కెట్ శుక్రవారంనాడు ఒక్కసారిగా వెనుకంజ వేసింది. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో దాని ప్రభావం భారతీయ స్టాక్ మార్కెట్‌గా మిశ్రమ ఫలితాలను చవిచూసింది. బీఎస్‌ఈ సెనె్సక్ శుక్రవారం 407 పాయింట్లు దిగజారింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ 407.14 పాయింట్లు దిగజారి 39,194.49 పాయింట్ల వద్ద నిలిచింది.

06/21/2019 - 20:44

న్యూఢిల్లీ, జూన్ 21: ప్రపంచంలో వివిధ దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధాల ప్రతికూల ప్రభావం భారత్‌పై కూడా పడిందని, అయితే భారత్ పటిష్టమయిన తన ఆర్థిక వ్యవస్థ కారణంగా దీనిని తట్టుకొని నిలబడుతుందని కేంద్ర వాణిజ్య, పారిశ్రామిక శాఖల మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. వివిధ దేశాలు వాణిజ్య యుద్ధాలకు తలపడుతున్న నేటి పరిస్థితుల్లో దాని ప్రతికూల ప్రభావం భారత్‌పై కూడా పడుతుంది.

06/21/2019 - 04:31

ముంబయ: భారత స్టాక్ మార్కెట్లు గురువారం కోలుకున్నాయి. బుధవారం నాటి ట్రేడింగ్‌లో అత్యంత స్వల్పంగా లాభపడిన సూచీలు గురువారం మరింత పుంజుకున్నాయి. బ్యాంకింగ్, హెల్త్‌కేర్, ఆటోస్ట్ఫా రంగాలు లాభాల్లో నడవగా, అంతర్జాతీయ మార్కెట్లు కూడా సహకరించాయి. వడ్డీరేటు తగ్గించనున్నట్లు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సూచన ప్రాయంగా తెలియజేయడంతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు లాభాల పట్టాయి.

06/21/2019 - 04:12

గుంటూరు, జూన్ 20: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో లావాదేవీలన్నీ ఈ-నామ్ విధానం ద్వారానే జరగాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న ఆదేశించారు. ప్రస్తుతం 22 మార్కెట్ యార్డుల్లో ఈ-నామ్ అమలులో ఉందని, రానున్న కాలంలో అన్ని మార్కెట్ యార్డుల్లోనూ ఈ విధానాన్ని తప్పనిసరి చేస్తున్నట్లు చెప్పారు.

06/21/2019 - 04:32

విజయవాడ, జూన్ 20: రాష్ట్రంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసేందుకు దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీ ఆసక్తి కనబరుస్తోంది. ఈ మేరకు తాడేపల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఆ కంపెనీ సీఈవో బాంగ్ గిల్ హో గురువారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసేందుకు సిద్ధమని తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.

06/20/2019 - 23:24

సిద్దిపేట, జూన్ 20 : సిద్దిపేట జిల్లా కేంద్రానికి కాలానికి అనుగుణంగా ఎస్‌బీఐ, ఆంధ్రబ్యాంక్ రీజనల్ కార్యాలయాలు వస్తున్నాయని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేట బైపాస్ రోడ్డులో నూతనంగా నిర్మించే ఎస్‌బీఐ ప్రాంతీయ కార్యాలయం భవన నిర్మాణానికి మాజీ మంత్రి హరీష్‌రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధితో ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

06/20/2019 - 22:49

చిత్రం...గుర్‌గామ్‌లో గురువారం మార్కెట్లోకి విడుదల చేసిన ఎస్‌యూవీ కియా సెల్టాస్ వాహనం.

06/20/2019 - 04:29

గుంటూరు, జూన్ 19: దళారీల బారిన పడి రైతులు నష్టపోకుండా చూడాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి 3 వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, మార్కెటింగ్ శాఖల మంత్రి మోపిదేవి వెంకట రమణారావు పేర్కొన్నారు.

06/20/2019 - 04:29

హైదరాబాద్, జూన్ 19: దేశ అవసరాల కోసం సింగరేణిలో బొగ్గు ఉత్పత్తులను భారీగా పెంచాలని సింగరేణి అధికారులు పరుగుతీస్తున్నారు. రానున్న వర్షాకాలంలో బొగ్గు తవ్వకాలకు ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెట్టారు. బొగ్గు నిల్వలు పెంచడానికి సింగరేణి అధికారులు యద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నారు.

06/20/2019 - 00:32

అమరావతి, జూన్ 19: రాష్ట్రంలో పారిశ్రామిక పురోభివృద్ధికై పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి వెల్లడించారు. బుధవారం సచివాలయం నాలుగోబ్లాక్‌లోని కార్యాలయంలోకి ఆయన ప్రవేశించి, బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు కీలక బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Pages