S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/19/2019 - 23:05

వెల్లింగ్‌టన్, జూన్ 18: ఎయిర్ న్యూజిలాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లక్సన్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు.

06/19/2019 - 22:26

ముంబయి, జూన్ 19: జెట్ ఎయిర్‌వేస్ దివాళా ప్రక్రియలో తమను కూడా పార్టీలుగా చేర్చాలని ఆ సంస్థ పైలట్‌లు, ఇంజనీర్ల సంఘంతో పాటు రెండు డచ్ సంస్థలు సైతం నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్‌ను (ఎన్‌సీఎల్‌టీ) బుధవారం ఆశ్రయించాయి. దీనిపై ట్రిబ్యునల్ గురువారం విచారణ ప్రారంభించనుంది.

06/19/2019 - 22:25

హాంగ్-కాంగ్, జూన్ 19: వాణిజ్య ఒప్పందాలకు అమెరికా-చైనా దేశాలు మళ్లీ చేతులు కలపబోతుండడంతో ఆసియా మార్కెట్లలో కొత్త ఉత్సాహం వెల్లివిరిసింది. అమెరికా అధ్యక్షుడు డ్రోనాల్డ్ ట్రంప్ బుధవారం చైనా అధ్యక్షుడు జీజిపింగ్‌కు ఫోన్ చేయడంతో శుభపరిణామంగా ఆసియా మార్కెటర్లు సంతోషిస్తున్నారు. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధానికి తెర పడి, సుహృద్భావమైన వాతావరణంలో పునరుద్ధరణకు అవకాశం ఏర్పడబోతున్నది.

06/19/2019 - 22:23

ముంబయి, జూన్ 19: విదేశీ మదుపరులు ఆసక్తి ప్రదర్శించినప్పటికీ బుధవారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి (బీఎస్‌ఈ)లో సెనె్సక్ స్వల్పంగా పెరిగింది. మెజారిటీ లావాదేవీలు ప్రారంభమైన వెంటనే మార్కెట్ సూచీలు వేగంగా పెరిగాయి. ఒకానొక దశలో సెనె్సక్స్ 400 పాయింట్ల కంటే పైగా నమోదయ్యాయి. అయితే, మధ్యాహ్నం తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టిన సూచీ చివరకు 66.40 పాయింట్ల లాభంతో ముగిసింది.

06/19/2019 - 22:21

న్యూఢిల్లీ, జూన్ 19: సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈసీఐ), నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించడానికి కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్‌ఆర్‌ఈ) ముగ్గురు సభ్యులతో కూడిన డిస్ప్యూట్ రిజల్యూన్ కమిటీ (డీఆర్‌సీ)ని ఏర్పాటు చేసింది.

06/19/2019 - 22:20

హ్యూస్టన్, జూన్ 19: భారత్-అమెరికా దేశాలు సహజసిద్ధమైన మిత్రులని, ఎలాంటి సవాళ్లనైనా సమష్టిగా ఎదుర్కొంటాయని భారత్‌లో అమెరికా రాయబారి కెన్ జస్టర్ వ్యాఖ్యానించారు. బుధవారం ఇక్కడ జరిగిన ఇండో-అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ గ్రేటర్ హ్యూస్టన్ (ఐఏసీసీజీహెచ్) 20వ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య విడదీయలేని సంబంధం ఉందని అన్నారు.

06/19/2019 - 04:36

గాజువాక: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్)కు చెందిన విశాఖ రిఫైనరీ ఆధునీకరణలో భాగంగా దేశంలోనే అతిపెద్ద పుల్ కన్వర్షన్ హైడ్రోక్రాకర్ యూనిట్(రియాక్టర్)ను మంగళవారం అమర్చారు. యూనివర్సల్ ఆయల్ ప్రొడక్ట్స్ ఇంజనీర్ ఇండియా కంపెనీ సంయుక్తంగా విశాఖ రిఫైనరీలో 3.053 ఎంఎంటిపిఎ సామర్థ్యం కలిగిన ప్రతిష్ఠాత్మకమైన రియాక్టర్ యూనిట్‌ను విజయవంతంగా అమర్చడం పూర్తి చేశారు.

06/19/2019 - 04:20

ముంబయి: వరుసగా నాలుగు రోజలపాటు నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం మళ్లీ లాభాల్లోకి వచ్చాయి. అమెరికా ఫెడరల్ రిజర్వుర్వ్ విధాన సమావేశం జరుగనన్న దృష్ట్యా మదుపర్లు ఆచితూచి అడుగేయడంతో ఆద్యం తం తీవ్ర ఒడిదుడుకులకు గురైన సూచీలు స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. సెనె్సక్స్ 85.55 పాయింట్లు, నిఫ్టీ 19.35 పాయింట్లు లాభపడ్డాయి.

06/19/2019 - 03:20

హైదరాబాద్, జూన్ 18: రాష్ట్రంలో భవన నిర్మాణాల కార్యకలాపాలు జోరందుకోవడంతో ఇసుకకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఈ ఏడాది ఒక కోటి మెట్రిక్‌టన్నుల ఇసుకను తవ్వి సరఫరా చేయాలని నిర్ణయించింది. వర్షాకాలంలో ఇసుక తవ్వకాలకు ఇబ్బందులు ఎదురవుతాయి.

06/19/2019 - 03:17

హైదరాబాద్, జూన్ 18: మీ సేవా పోర్టల్ వినియోగదారులకు చెల్లింపుల సేవలు అందించేందుకు వీలుగా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. యూపీఐ కలెక్ట్ రిక్వెస్ట్, రూపే డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపుల సేవలను అందిస్తారు. ఈ వివరాలను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ రాయ్ చెప్పారు.

Pages