S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/27/2019 - 23:20

ముంబయి, జూన్ 27: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప నష్టాలను నమోదు చేశాయి. జూన్ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగిసిపోయిన తరుణంలో మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. సూచీలు రోజంతా తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. తొలుత 300 పాయింట్ల వరకు ఎగబాకిన 30 షేర్ల బీఎస్‌ఈ సూచీ సెనె్సక్స్ చివరిగా 5.67 పాయింట్ల స్వల్పనష్టంతో 39,586.41 పాయింట్ల దిగువన స్థిరపడింది.

06/27/2019 - 23:13

న్యూఢిల్లీ, జూన్ 27: బిరాక్, ఎంఫసిస్‌లతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుని 10 అంకుర సంస్థల నిర్వహణను చేపట్టనున్నట్టు ‘సోషియల్ అల్ఫా’ గురువారం నాడిక్కడ తెలిపింది. వివిధ రకాల నైపుణ్యం కలిగిన వ్యక్తులతో సాంకేతిక పరమైన సమస్యలపై పరస్పర సహకారం కొనసాగించడంతోబాటు వారికి ఒక్కొక్కరికి రూ. 20 లక్షల వంతున ఆర్థిక సహకారాన్ని అందజేయనున్నట్టు తెలిపింది.

06/27/2019 - 04:17

హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం తెచ్చిపెట్టే నూతన మార్గం అందుబాటులోకి వచ్చింది. ఓబులవారిపల్లి- వెంకటాచలం- కృష్ణపట్నం ఓడరేవుమధ్య రైల్వే మార్గంలో ఇక నుంచి గూడ్స్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ప్రత్యేకంగా సరుకు రవాణా కోసం ఏర్పాటు చేసిన ఈ మార్గంలో గూడ్స్ సర్వీసులకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

06/27/2019 - 03:44

న్యూఢిల్లీ, జూన్ 26: భారీ మొత్తంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగవేస్తున్న వారి వివరాలు ప్రజల ముందు పెట్టాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడిటి) ఆదాయ పన్ను శాఖను ఆదేశించింది. రుణ ఎగవేతదారుల ఆస్తులను, అకౌంట్లనూ వెల్లడించాలని సూచించింది. ఇలా చేయడం ద్వారా వారిపై వత్తిడి పెరిగి, ప్రజాధనాన్ని వసూలు చేసేందుకు వీలవుతుందని అభిప్రాయపడింది. దీంతో ఐటీ శాఖ కదిలింది.

06/27/2019 - 01:33

విజయవాడ (సిటీ), జూన్ 26: దేశంలో అతిపెద్ద ప్రజాపంపిణీ వ్యవస్థ కలిగిన మన రాష్ట్రంలో ఇకముందు రేషన్ షాపు ఉంటుందా, రద్దవుతుందా? అనే ప్రశ్న ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. వలంటీర్ల వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల చెంతకు నేరుగా రేషన్ సరుకులు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. దశాబ్దాల చరిత్ర ఉన్న రేషన్ షాపులపై ఇప్పటికే అనేక ఆరోపణలు, అనుమానాలు, సందేహాలు ఉన్నాయి.

06/26/2019 - 22:55

చిత్రం... పార్లమెంట్ బడ్జెట్ సమావేశానికి హాజరైన ఎంపీలు సుప్రియా సులే (ఎన్‌సీపీ), అరుణ ప్రియ పటేల్ (అప్నాదళ్-ఎస్)

06/26/2019 - 22:50

ముంబయి, జూన్ 26: జూవెలరీ(నగలు), జెమ్స్(రత్నాలు) దిగుమతి సుంకాన్ని 4 శాతం తగ్గించాలని రంగం కోరుతోంది. స్మగ్లింగ్‌కు చెక్‌పెట్టేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవల్సిందిగా అఖిల భారత జెమ్స్, జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) విజ్ఞప్తి చేసింది. బంగారంపై పది శాతం దిగుమతి సుంకం విధించాలని జీజేసీ కోరింది.

06/26/2019 - 22:42

ముంబయి, జూన్ 26: వరుసగా రెండోరోజు కూడా భారత స్టాక్ మార్కెట్లు లాభాల్లో నడిచాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ 157.14 పాయింట్లు (0.40 శాతం) పెరిగి, 39,592.08 పాయింట్ల వద్ద ముగిసింది. అదే విధంగా, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 51.10 పాయింట్లు (0.43శాతం) లాభపడి 11,847.57 పాయింట్లకు చేరింది.

06/26/2019 - 22:39

న్యూఢిల్లీ, జూన్ 26: అక్రమ ఎగుమతిదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్(ఎఫ్‌ఐఈవో) కేంద్రాన్ని డిమాండ్ చేసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని అమాయకులెవరూ నష్టపోకుండా చూడాలని సంస్థ అధ్యక్షుడు గణేష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు.

06/26/2019 - 22:36

ముంబయి, జూన్ 26: దేశాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 95,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను ఇన్‌ఫ్రా బాండ్ల ద్వారా సేకరించేందుకు ప్రయత్నిస్తోందని ఒక నివేదిక ద్వారా తెలుస్తోంది. ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్లను స్పెషల్ పర్సస్ వెహికిల్ (ఎస్‌పీవీ) ద్వారా సమీకరించనుందని, ఇది 0.5 శాతం జీడీపీతో సమానమని ఆ నివేదిక స్పష్టం చేస్తోంది.

Pages