S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/18/2019 - 04:22

ముంబయి: ఇండో- అమెరికా వాణిజ్య యుద్ధం భయంతో సోమవారంనాడు దేశీయ మార్కెట్లు బెంబేలెత్తిపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజి (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ 491 పాయింట్లు పతనంకాగా, (జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 151 పాయింట్లకు దిగజారింది. దీనికితోడు కీలక రంగ షేర్లు కుదేవలడంతో మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. వాణిజ్య యుద్ధం ఆందోళనలతో సోమవారం ఉదయం దేశీయ మార్కెట్లు మందకొడిగా ప్రారంభమయ్యాయి.

06/17/2019 - 01:59

విజయవాడ(సిటీ): నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటు నుండి మంచి ఊపుమీదున్న రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం కొంత జోరు తగ్గింది. సార్వత్రిక ఎన్నికల ముందు ఫర్వాలేదు అనిపించినా రియల్ ఏస్టేట్ వ్యాపారం ఫలితాల అనంతరం స్థబ్దుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి మంచి ఆదాయ వనరుగా ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రస్తుతం మందగమనంలో ఉండటంతో ప్రభుత్వాదాయానికి గండిపడింది.

06/17/2019 - 01:47

షాద్‌నగర్ రూరల్: ఉల్లిగడ్డ ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. వర్షాకాలం ప్రారంభం కాకముందే ఇంతలా ఉంటే.. మున్ముందు ఏలా ఉంటాయో అని సగటు వినియోగదారుడు ఆశ్చర్యానికి గురవుతున్నాడు. సాధారణంగా ప్రతి ఏడాది వర్షాకాలంలో ఉల్లి ధరలు పెరుగుతాయి. కానీ, ఈ ఏడాది జూన్ నెల ప్రారంభం నుంచే ధరలు పెరుగుతున్నాయంటే.. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా?

06/16/2019 - 23:27

ఇండోర్, జూన్ 16: రాజకీయ పార్టీలకు విరాళాల్లో భాగం గా రుణదాతలు దాదాపు రూ.5,800 కోట్లకు పైగా ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 2018 మార్చి 1 నుంచి ఈ ఏడాది మే 10 తేదీ మధ్య ఇంత విలువైన ఎన్నికల బాండ్లు అమ్మినట్లుగా సమాచార హక్కు చట్టం కింద దాఖలైన పిటీషన్‌కు జవాబుగా ఎస్‌బీఐ వివరించింది.

06/16/2019 - 03:50

భీమదేవరపల్లి (వరంగల్): ముల్కనూరు సహకార బ్యాంక్ అధ్యక్షుడు అల్గీరెడ్డి ప్రవీణ్‌రెడ్డికి ‘రెస్పాన్స్‌బుల్ బిజినెస్’ అవార్డును సూక్ష్మ, చిన్నపరిశ్రమల కేంద్ర మంత్రి ప్రతాప్‌చంద్ర సరంగి చేతుల మీదుగా శనివారం అందుకున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 25 మందికి ‘రెస్పాన్స్‌బుల్ బిజినెస్’ అవార్డు అందించారు.

06/16/2019 - 02:04

అమరావతి: పాడిరైతులను ఆదుకోవాలనే సదుద్దేశంతో పాటు రాష్ట్రంలో నిర్వీర్యమైన సహకార రంగ డెయిరీలకు పూర్వ వైభవం తెచ్చేందుకు తమ ప్రభుత్వం బాట వేసిందని రాష్ట్ర మత్స్యశాఖ, మార్కెటింగ్, పశుసంవర్థకశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు స్పష్టం చేశారు.

06/16/2019 - 01:50

విజయవాడ(సిటీ): ఒక వైపు ఎండలు మండుతుంటే హాట్ హా ట్ సమ్మర్‌లో మాత్రం చల్ల చల్లని బీర్ల సేల్స్ మంచి ఊపుమీదుంది. వేసవి ఎండలతో ఏమోగాని మందుబాబులు మాత్రం ఈ ఏడాది వారు చూపు బీర్లపైనే పడింది. ప్రతీ ఏడాది బీర్ల సేల్స్ వేసవి కాలంలో పెరుగుతూనే ఉంటా యి. కానీ ఈ ఏడాది మరీ ఎక్కువగా ఉన్నట్లు ఘణాంకాలు చెబుతున్నాయి. జనవరి, ఫిబ్రవరి నెలలతో పోల్చి చూస్తే మార్చి, ఏప్రిల్, మేలలో బీర్ సేల్స్ అధికంగా ఉన్నాయి.

06/14/2019 - 21:44

న్యూఢిల్లీ, జూన్ 14: దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతాన్ని ఇవ్వడంతో పాటు ఉపాధి అవకాశాలను ఇనుమడింపజేసే దిశగా ఓ పటిష్టమైన రోడ్ మ్యాప్‌ను కేంద్ర ప్రభుత్వం సన్నద్దమవుతోంది. ఇందులో భాగంగా కేంద్ర బడ్జెట్‌కు ముందే ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఐదు కీలక విభాగాలకు ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. ఈ రోడ్ మ్యాప్‌కు సంబంధించి ఈ నెల 20న వీరితో విస్తృత స్థాయి చర్చలు జరుపుతారని అధికార వర్గాలు తెలిపాయి.

06/14/2019 - 21:43

ముంబయి, జూన్ 14: అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూలతల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజైన శుక్రవారం సైతం నష్టాలను నమోదు చేశాయి. ప్రధానంగా బ్యాంకింగ్ స్టాక్స్ అత్యధికంగా నష్టపోయాయి. తొలుత 400 పాయింట్లు నష్టపోయిన బీఎస్‌ఈ సూచీ సెనె్సక్స్ ఆ తర్వాత సల్పంగా కోలుకొని 289.29 పాయింట్లు కోల్పోయి 0.73 శాతం నష్టాలతో 39,452.29 పాయింట్ల వద్ద దిగువన స్థిరపడింది.

06/14/2019 - 21:42

న్యూఢిల్లీ, జూన్ 14: అమెరికా చర్యకు ప్రతీకార చర్యగా ఆ దేశానికి చెందిన 29 ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను పెంచాలని శుక్రవారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బాదం, ఆక్రూట్‌లతో సహా వివిధ రకాల పప్పు దినుసుల దిగుమతులపై సుంకాల పెంపును ఈనెల 16 నుంచి అమలు చేయాలని విశ్వసనీయ అధికార వర్గాలు వెల్లడించాయి.

Pages