S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/14/2019 - 04:49

హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం ఏటా కొలువుల జాతర ఉంటుందని సింగరేణి సీఎండీ శ్రీ్ధర్ అన్నారు. పెద్ద సంఖ్యలో యువకుల చేరికతో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోందన్నారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటికి 10,446 వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. బొగ్గు ఉత్పత్తి, అమ్మకాలు, లాభాలతో సింగరేణి సంస్థ దేశవిదేశాల్లో ప్రత్యేక స్థానం దక్కించుకుందన్నారు.

06/13/2019 - 22:09

ముంబయి, జూన్ 13: దేశీయ స్టాక్ మార్కెట్లలో గురువారం స్తబ్థత నెలకొనగా సూచీలు స్వల్ప నష్టాలను నమోదు చేశాయి. ఎస్ బ్యాంక్ పెద్ద స్థాయిలో నష్టపోయింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల స్థితిగతులే ఇందుకు కారణమని విశే్లషకులు పేర్కొన్నారు. తొలుత దాదాపు 300 పాయింట్లు నష్టపోయిన బీఎస్‌ఈ సూచీ సెనె్సక్స్ చివరికి 15.45 పాయింట్ల స్వల్ప నష్టంతో 39,741.36 పాయింట్ల దిగువన స్థిరపడింది.

06/13/2019 - 22:07

చిత్రం... బడ్జెట్ ముందస్తు కసరత్తులో భాగంగా గురువారం ఆర్థికవేత్తలతో సమావేశమైన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్

06/13/2019 - 22:04

ఐక్యరాజ్య సమితి, జూన్ 13: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) 2018లో 6 శాతం పెరిగాయి. ఆ ఏడాది కాలంలో మొత్తం 42 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు భారత్‌కు సమకూరాయి. ప్రధానంగా తయారీ రంగంతోబాటు, సమాచార, ఆర్థిక రంగాల్లోకి అధిక శాతం పెట్టుబడులు వెల్లువెత్తాయి.

06/13/2019 - 04:07

హైదరాబాద్: సింగరేణి ఏరియా చుట్టు పక్కల ఉన్న గ్రామాల్లో వౌలిక వసతులకు పెద్దపీట వేస్తున్నట్లు సింగరేణి సీఎండీ శ్రీ్ధర్ ప్రభుత్వ ఉన్నతాధికారులకు సూచించారు.

06/13/2019 - 02:12

అమరావతి, జూన్ 12: యువతకు ఉపాధి, ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు పర్యాటక రంగంతోనే సాధ్యమవుతాయని రాష్ట్ర సాంస్కృతిక, యువజన సర్వీస్‌లు, పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. బుధవారం సాయంత్రం సచివాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ పర్యాటక, యువజన, పురావస్తు శాఖల పనితీరును ప్రాథమికంగా సమీక్షించినట్లు చెప్పారు.

06/13/2019 - 02:09

న్యూఢిల్లీ, జూన్ 12: దేశంలో గత 11 ఆర్థిక సంవత్సరాల కాలంలో బ్యాంకులను మోసం చేసిన సంఘటనలు 50,000 వరకు ఉన్నాయి. వీటి మొత్తం నష్టం రూ.2.05 లక్షల కోట్ల పైమాటే. భారత రిజర్వు బ్యాంకు అందించిన వివరాల ప్రకారం.. ఇటీవలకాలంలో బ్యాంకుల మోసాలు విపరీతంగా పెరిగాయి. లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు చోటుచేసుకున్నాయి.

06/13/2019 - 02:09

లండన్, జూన్ 12: భారత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీకి బెయిల్ ఇచ్చేందుకు లండన్ హైకోర్టు బుధవారం నిరాకరించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును సుమారు రెండు బిలియన్ డాలర్ల మేర మోసగించిన కేసుతోబాటు మనీల్యాండరింగ్ కేసులో నిందితుడైన నీరవ్ మోదీ భారత్ నుంచి పారిపోయి వచ్చి బ్రిటన్‌లో తలదాచుకుంటూ అక్కడి పోలీసులకు దొరికి జైలు శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.

06/12/2019 - 22:33

న్యూఢిల్లీ, జూన్ 12: చెప్పుల పరిశ్రమ ప్రగతికి తోడ్పాటును అందించాల్సిందిగా లెదర్ ఎగుమతిదారులు, చెప్పుల తయారీదార్లు ఆర్థిక మంత్రిత్వ శాఖను ముక్తకంఠంతో కోరుతున్నారు.

06/12/2019 - 22:01

న్యూఢిల్లీ, జూన్ 12: తక్కువ ధరకు ఢిల్లీ-చైనాల మధ్య నేరుగా విమానాలు నడిపేందుకు ప్రైవేటు విమానయాన సంస్థ ఇండిగో ముందుకు వచ్చింది. ఢిల్లీ-చెంగ్డుల మధ్య సెప్టెంబర్ 15 నుంచి ప్రతి రోజూ నాన్-స్టాప్ విమానాలను నడపనున్నట్లు ఇండిగో చీఫ్ కమర్షియల్ అధికారి విలియం బౌల్టర్ తెలిపారు. ఇది ఇండిగో చరిత్రలో మరో కీలక ఘట్టం అని ఆయన వ్యాఖ్యానించారు.

Pages