S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/24/2019 - 22:59

సియోల్, ఏప్రిల్ 24: దక్షిణకొరియాలో అతిపెద్ద వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మొదటి త్రైమాసికంలో మంచి ఫలితాలను చూపింది. కంపెనీ ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త స్పోర్టు యుటిలిటీ వాహనాలకు మార్కెట్లో మంచి డిమాండ్ రావడంతో గత నష్టాల నుంచి బయటపడి లాభాల బాట పట్టింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు నికరలాభంలో 30 శాతం వృద్ధిని నమోదు చేసి 954 బిలియన్ల ఓన్‌లను ఆర్జించింది.

04/24/2019 - 03:20

జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని మహీంద్రా అండ్ మహీంద్రా (ఆటోమోటివ్ డివిజన్) వాహనాల కంపెనీ 10 లక్షల (1 మిలియన్) వాహనాలను ఉత్పత్తిచేసి అరుదైన రికార్డును నెలకొల్పింది. ఈ నెల గత 23వ తేదీ నాడు 10 లక్షల వాహనాల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ సందర్భంగా మంగళవారం కర్మాగారంలో కార్మికులు మిలియనోత్సవ సంబరాలు జరుపుకొన్నారు.

04/23/2019 - 22:37

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లో అంతకంతకూ పెరుగుతున్న ముడిచమురు ధరల ప్రభావం భారతీయ స్టాక్ మార్కెట్లపై పడుతోంది. దీంతో వరుసగా మూడోరోజైన మంగళవారం సైతం సూచీలు ప్రతికూలతలను ఎదుర్కొన్నాయి. ప్రధానంగా ఫైనాన్షియల్, వాహన స్టాక్స్ పెద్దఎత్తున అమ్మకాల వత్తిడికి గురయ్యాయి.

04/23/2019 - 22:34

ముంబయి, ఏప్రిల్ 23: పర్యావరణ పరంగా ఆహ్లాదభరితమైన, పచ్చదనంతో కూడుకున్న ప్రదేశాలకు వెళ్లి ఎక్కువ కాలం స్థిర నివాసం ఉండాలని, విభిన్న సంస్కృతుల ప్రజలతో మమేకం కావాలన్న కోరికను మన దేశానికి చెందిన అధిక శాతం పర్యాటకులు వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరానికి ఓ మారైనా అలాంటి అనుభవాన్ని అస్వాదించాలన్న జిజ్ఞాస దాదాపు 98 శాతం భారతీయ పర్యాటకుల్లో ఉంది.

04/23/2019 - 22:33

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: మనదేశ ఔషధ రంగం (పార్మాస్యూటికల్) ఎగుమతులు గడచిన ఆర్థిక సంవత్సరంలో 11 శాతం మేర పెరిగాయి. అంటే అదనంగా 19.2 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు తెలిపాయి. ప్రధానంగా ఉత్తర అమెరికా, ఐరోపా దేశాల్లో మన ఉత్పత్తులకు పెరిగిన డిమాండ్‌తో ఈ అదనపు ఎగుమతులకు ఆస్కారం ఏర్పడిందని మంత్రిత్వ శాఖ అంచనా వేసింది.

04/23/2019 - 22:32

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,110.00
8 గ్రాములు: రూ.24,880.00
10 గ్రాములు: రూ. 31,100.00
100 గ్రాములు: రూ.3,11,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,326.203
8 గ్రాములు: రూ. 26,609.624
10 గ్రాములు: రూ. 33,262.03
100 గ్రాములు: రూ. 3,32,620.3
వెండి
8 గ్రాములు: రూ. 320.00

04/23/2019 - 22:31

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ప్రఖ్యాత బాస్మతి బియ్యం ఎగుమతి సంస్ధ ‘జీఎమ్మార్ ఓవర్‌సీస్ లిమిటెడ్’ దేశీయ మార్కెట్లో తమ వ్యాపారాన్ని ఆరంభించాలని నిర్ణయించింది. రాబోయే రెండేళ్ల కాలంలో మనదేశంలో వ్యాపార విస్తరణకు రూ.50 కోట్ల పెట్టుబడులు కేటాయించాలని తీర్మానించింది.

04/22/2019 - 22:59

ముంబయి: రిజర్వు బ్యాంకుకు అదనంగా రూ. 3లక్షల కోట్ల మూలధన నిల్వలున్నాయని బిమల్ జలాన్ కమిటీ తేల్చిచెప్పే అవకాశాలున్నాయి. ఆర్బీఐ వాస్తవిక మూలధన నిల్వలను నిగ్గుదేల్చేందుకు బిమల్ జలాన్ కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే.

04/22/2019 - 22:57

ముంబయి, ఏప్రిల్ 22: ప్రస్తుతం మూసివేతకు గురైన జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన దాదాపు 22వేల మంది ఉద్యోగులను ఆదుకునేందుకు బ్యాంకుల కన్సార్టియం ముందుకు రావాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు సోమవారం నాడిక్కడ సూచించాయి. జీతాలు రాక తీవ్ర ఇక్కట్ల పాలవుతున్న ఆ ఉద్యోగులకు ప్రత్యేక రుణ సదుపాయాన్ని బ్యాంకులు కల్పించాలని ఆ సంఘాలు డిమాండ్ చేశాయి.

04/22/2019 - 22:55

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,110.00
8 గ్రాములు: రూ. 24,880.00
10 గ్రాములు: రూ. 31,100.00
100 గ్రాములు: రూ. 3,11,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,326.203
8 గ్రాములు: రూ. 26,609.624
10 గ్రాములు: రూ. 33,262.03
100 గ్రాములు: రూ. 3,32,620.3
వెండి
8 గ్రాములు: రూ. 322.40

Pages