S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/19/2019 - 04:23

విశాఖపట్నం: పలు రకాలైన అటవీ ఉత్పత్తులకు దేశీయ మార్కెట్‌లో డిమాండ్‌ను పెంచుతున్న గిరిజన సహకార సంస్థ (జీసీసీ) మరో అడుగు ముందుకేసింది. తొలిసారి అటవీ ఉత్పత్తులతో పౌష్టికాహారం తయారీపై దృష్టిసారిస్తోంది. అధిక సంఖ్యలో ఇప్పటికే పలు రకాలైన అటవీ ఉత్పత్తులతో పౌష్టిక విలువలతో కూడిన ఆహార పదార్ధాలను అందుబాటులోకి తీసుకురావాలని జీసీసీ లక్ష్యంగా పెట్టుకుంటుంది.

04/18/2019 - 23:29

న్యూఢిల్లీ: జెట్ ఎయిర్‌వేస్ బిడ్డింగ్ (వేలం) వ్యవహారం సజావుగా సాగుతుందని తాము భావిస్తున్నామని ఆ సంస్థకు రుణాలిచ్చిన బ్యాంకులు గురువారం విశ్వాసం వ్యక్తం చేశాయి. ఈ ఎయిర్‌లైన్‌కు చెందిన విమానాలన్నింటి నిర్వహణను బుధవారం తాత్కాలికంగా నిలిపివేసిన క్రమంలో దీనిపై బ్యాంకులు స్పందించాయి.

04/18/2019 - 23:27

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,100.00
8 గ్రాములు: రూ.24,800.00
10 గ్రాములు: రూ. 31,300.00
100 గ్రాములు: రూ.3,10,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,315.508
8 గ్రాములు: రూ. 26,524.064
10 గ్రాములు: రూ. 33,155.08
100 గ్రాములు: రూ. 3,31,550.80
వెండి
8 గ్రాములు: రూ. 323.20

04/18/2019 - 23:26

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: బులియన్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర భారీగా పతనమైంది. 10 గ్రాముల బంగారం 405 రూపాయలు నష్టపోయి 32,385 రూపాయల వద్ద ముగిసింది. కిలో వెండి ధర 104 రూపాయలు పడిపోవడంతో 38,246 రూపాయలుగా నమోదైంది. 32,790 రూపాయల వద్ద మొదలైన 10 గ్రాముల బంగారం ట్రేడింగ్ మొదటి నుంచే పతనమవుతూ వచ్చింది. పెట్టుబడిదారుల నుంచేగాక, నగల తయారీదారుల నుంచి కూడా డిమాండ్ లేకపోవడంతో, కొనుగోళ్లు నీరసించాయి.

04/18/2019 - 23:26

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: ఔషధ కంపెనీ జైడుస్ కాడిలా తాను తయారు చేసిన జనరిక్ అసెటజోలమైడ్ ఇంజెక్షన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయడానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ నుంచి తుది ఆమోదం లభించిందని తెలిపింది.

04/18/2019 - 23:25

ముంబయి, ఏప్రిల్ 18: స్టాక్ మార్కెట్‌లో ఎప్పుడు, ఏం జరుగుతుందో ఊహించడం కష్టమని మరోసారి రుజువైంది. గురువారం నాటి మార్కెట్ ట్రెండ్స్ సానుకూల ధోరణుల మధ్య ప్రారంభమై, ఒకానొక దశలో గతంలో ఎన్నడూ లేనంత అత్యధిక పాయింట్లకు చేరుకున్నప్పటికీ, ఆతర్వాత అనూహ్యంగా పతనమై, చివరికి నష్టాల్లో ముగిసింది. రికార్డు స్థాయి సెనె్సక్స్ పాయింట్లు నమోదవుతాయన్న పరిశీలకుల అంచనాలు తారుమారయ్యాయి.

04/18/2019 - 23:25

వాషింగ్టన్, ఏప్రిల్ 18: 737 మాక్స్ బోయింగ్ మోడల్ విమానాన్ని ఆ సంస్థ యాజమాన్యం గురువారం నాడిక్కడ చివరిసారిగా పరీక్షించింది. పూర్తిగా అప్‌డేట్ అయిన యాంటీ స్టాల్ సిస్టం ప్రాధాన్యతతో వైమానిక శాఖ అధికారుల సర్ట్ఫికేషన్‌తో ఈ విమానం రూపుదిద్దుకుందని ఆ సంస్థ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ విమానయాన తయారీ సంస్థ సీఈవో డెన్సిస్ మొయిలిన్‌బెర్గ్ గురువారం ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

04/18/2019 - 00:49

ముంబయి: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్‌వేస్ మూతపడే పరిస్థితి కనిపిస్తున్నది. ఒకప్పుడు వందకు పైగా ఉన్న విమానాల సంఖ్య ఇప్పుడు 12కు చేరుకుంది. పైలట్లు, ఇంజనీర్లు, ఇతర సిబ్బందికి కూడా జీతాలు చెల్లించలేకపోతున్న ఈ సంస్థ ఆర్థిక సాయం కోసం ఎస్‌బీఐని ఆశ్రయించింది. ఉద్యోగులు కూడా యాజమాన్యానికి మద్దతు పలుకుతూ, రూ.1,500 కోట్ల తక్షణ రుణాన్ని మంజూరు చేయాలని ప్రధాన రుణదాత ఎస్‌బీఐకి విజ్ఞప్తి చేశారు.

04/17/2019 - 23:25

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: రిలయన్స్ ఇండస్ట్రీస్ తన అనుబంధ సంస్థ ఈథేన్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్‌ఈహెచ్‌పీఎల్) నిర్వహిస్తున్న ఆరు సంస్థల వాటాలను జపాన్‌కు చెందిన మిత్సు యి ఓఎస్‌కే లైన్స్ (ఎంఓఎల్)కు విక్రయించనుంది.

04/17/2019 - 23:23

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: టీవీ 18 బ్రాడ్‌కాస్టింగ్ లిమిటెడ్ లాభాల బాటలో పయనిస్తున్నది. గత ఆర్థిక సంవత్సరం 29.9 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించినట్టు ప్రకటించింది. ఆదాయాన్ని 1,196.55 కోట్ల రూపాయలుగా తన నివేదికలో పేర్కొంది.

Pages