S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/17/2019 - 23:21

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: దేశం నుంచి సోయామీల్ ఎగుమతులు ఏడాది కాలంలో దాదాపుగా రెట్టింపయ్యాయి. గత ఏడాది జనవరిలో 486.16 కోట్ల రూపాయల విలువైన సోయామీల్ ఎగుమతికాగా, ఈ ఏడాది జనవరిలో అది 933.75 కోట్ల రూపాయలకు చేరింది. సోయాబీన్ ఉత్పత్తులను ఆర్థిక సంవత్సరాల గణాంకాలతో పోలిస్తే, గత ఆర్థిక సంవత్సరంలో కొంత మెరుగ్గానే నమోదైంది. అయితే, 2012-13 ఆర్థిక సంవత్సరంతో పోల్చిచూస్తే మాత్రం చాలా తక్కువ.

04/17/2019 - 23:20

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: దేశ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తూ, అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులపై విచారణ జరపడం ఆలస్యమవుతున్నది. దీనితో ఏం చేయాలో తెలియక కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) మల్లగుల్లాలు పడుతున్నది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఐడీబీఐలోనూ కొంత మంది ఉద్యోగులు అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి.

04/17/2019 - 23:19

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,100.00
8 గ్రాములు: రూ.24,800.00
10 గ్రాములు: రూ. 31,000.00
100 గ్రాములు: రూ.3,10,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,315.508
8 గ్రాములు: రూ. 26,524.064
10 గ్రాములు: రూ. 33,155.08
100 గ్రాములు: రూ. 3,31,550.80
వెండి
8 గ్రాములు: రూ. 324.00

04/17/2019 - 23:18

ముంబయి, ఏప్రిల్ 17: క్రమం తప్పకుండా డాలర్లను కొంటున్న క్లయింట్‌గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ముద్ర పడుతున్నది. తాజా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో ఆర్బీఐ 825 మిలియన్ డాలర్లను స్పాట్ మార్కెట్‌లో కొన్నది. అంతకు ముందు డిసెంబర్, జనవరి మాసాల్లోనూ ఆర్బీఐ డాలర్లను కొన్నది. మొత్తం మీద ఏడాది కాలంలో ఆర్బీఐ ఏకంగా 2.086 బిలియన్ డాలర్లను స్పాట్ మార్కెట్‌లో కొనింది.

04/17/2019 - 23:17

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: మార్కెట్ సెంటిమెంట్ సానుకూలంగా ఉన్న తరుణంలో దేశీయ క్యాపిటల్ మార్కెట్‌లో పార్టిసిపేటరి నోట్స్ ద్వారా పెట్టుబడులు 2019 మార్చి చివరి నాటికి రూ. 78,110 కోట్లకు పెరిగాయి.

04/17/2019 - 23:16

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొన్ని రకాల కాయధాన్యాల దిగుమతి కోసం ఒక విధానాన్ని రూపొందించింది. మిల్లర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ కాయధాన్యాల మిల్లర్లు, రిఫైనర్లు దిగుమతుల కోసం లైసెన్సులు తీసుకోవలసిన అవసరం ఉందని వాణిజ్య మంత్రిత్వ శాఖలోని విదేశీ వాణిజ్య విభాగం డీజీఎఫ్‌టీ తెలిపింది.

04/16/2019 - 23:33

వరదయ్యపాళెం: ఆంధ్రా తమినాడు సరిహద్దులో ఉన్న శ్రీసిటీ పారిశ్రామిక వాడను రష్యన్ ఫెడరేషన్ వాణిజ్య రాయబారి ఓలెగ్‌యన్ అవధీన్ మంగళవారం సందర్శించారు. శ్రీసిటీ ఎండీ రవీంద్రసన్నారెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. శ్రీసిటీ పారిశ్రామిక నగర విశిష్టతను, ప్రగతిని వివరించారు. శ్రీసిటీ యాజమాన్యంతో జరిగిన సమావేశంలో ఓలెగ్‌యన్‌అవధీన్ పలు ప్రశ్నలు అడిగి శ్రీసిటీ విశిష్టతను మరింతగా తెలుసుకున్నారు.

04/16/2019 - 23:26

విశాఖపట్నం, ఏప్రిల్ 16: పేరుకే విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక్కడ నుంచి నడుస్తున్న అంతర్జాతీయ సర్వీసులు కేవలం మూడు మాత్రమే. కొత్తగా దుబాయ్‌కి మరో సర్వీసును ప్రారంభించనున్నారు. తాజాగా అంతర్జాతీయ విమాన సర్వీసుల అనుసంధానం నిమిత్తం ముంబైకి రాత్రి వేళలో సర్వీసును ఎయిర్ ఇండియా సంస్థ అందుబాటులోకి తెచ్చింది.

04/16/2019 - 22:00

కోల్‌కతా, ఏప్రిల్ 16: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఆన్‌లైన్ ప్రచారానికి సంబంధించిన ఖర్చు గత ఎన్నికలతో పోలిస్తే ద్విగుణీకృతం కానుంది. ఎన్నికలు పూర్తయ్యే నాటికి సుమారు రూ. 400 నుంచి 500 కోట్లకు ఈప్రచార ఖర్చులు చేరుకోవచ్చని అంచనా.

04/16/2019 - 21:57

ముంబయి, ఏప్రిల్ 16: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీ సెనె్సక్స్ మంగళవారం లాభాల పరుగుతీసింది, దాదాపు 370 పాయింట్లు ఎగబాకి రికార్డు స్థాయిలో 39,275.64 మార్కును తాకింది. ఈ ఏడాది రుతుపనాల ప్రభావం సానుకూలంగా ఉం టుందని, సాధారణ వర్షాలు కరుస్తాయని విశే్లషణలు వెలువడడం, కార్పొరేట్ కంపెనీల ఆదాయ గణాంకాలు సైతం సానుకూలంగా ఉండటం మా ర్కెట్లకు ఊతమిచ్చిందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

Pages