S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/22/2019 - 22:54

ముంబయి, ఏప్రిల్ 22: అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులతోబాటు ఇరాన్ నుంచి ముడిచమురు దిగుమతులు చేసుకోవడంపై అమెరికా ఆంక్షలు కఠినతరం చేయడంతో భాతర స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. అలాగే కార్పొరేట్ సంస్థల త్రైమాసిక నివేదికలు సైతం మిశ్రమ ఫలితాలనే నమోదు చేయడం మార్కెట్ సెంటిమెంటును ప్రభావితం చేసింది.

04/22/2019 - 22:54

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: సైబర్ నేరాల కారణంగా జరిగే నష్టాల నుంచి భద్రత కల్పించేలా సైబర్ డిఫెన్స్ ఇన్సూరెన్స్’ను ప్రారంభించినట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ విభాగం సోమవారం నాడిక్కడ ప్రకటించింది.

04/21/2019 - 23:53

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్న వివిధ భారీ కంపెనీలకు సంబంధించిన గత ఆర్థిక సంవత్సరం చివరి, నాలుగో త్రైమాసిక ఫలితాలే ఈవారం స్టాక్ మార్కెట్‌కు మార్గనిర్దేశకాలు కానున్నాయి. మార్చి 31వ తేదీతో ముగిసిన చివరి త్రైమాసిక ఫలితాలను పలు కంపెనీలు ప్రకటిస్తున్నాయి. దీనితో గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఆయా కంపెనీల తీరుతెన్నులు, లాభనష్టాల వివరాలు కూడా అందుతాయి.

04/21/2019 - 23:51

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: దేశంలోని 10 అతిపెద్ద కంపెనీల్లో ఆరు కంపెనీల మార్కెట్ విలువ కలిసి లక్ష కోట్ల రూపాయల మైలురాయికి చేరువవుతున్నది. స్టాక్ మార్కెట్‌లో అత్యధికంగా లాభపడిన ఈ ఆరు కంపెనీల జాబితాలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మొదటి స్థానాన్ని ఆక్రమిస్తున్నది.

04/21/2019 - 23:50

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: అమెరికా ప్రధాన కేంద్రంగా ఔషధ తయారీ వ్యాపారంలో ఉన్న టోరెంట్ ఫార్మాస్యూటికల్స్ నాణ్యతా ప్రమాణాలను పూర్తిగా పాటించని రక్తపోటు మందులను మార్కెట్‌లోకి విడుదల చేసింది. అయితే, వీటి నాణ్యతపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్‌ఎఫ్‌డీఏ) అనుమానం వ్యక్తం చేస్తూ, వాటిని వినియోగదారులకు చేరకుండా జాగ్రత్త పడాలని సూచించింది.

04/21/2019 - 23:48

కోల్‌కతా, ఏప్రిల్ 21: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ) అమలు చేస్తున్న అంకుర పరిశ్రమల విధానాలపై కజకస్థాన్ ఆసక్తిని ప్రదర్శిస్తున్నది. ఈ విషయాన్ని బీఎస్‌ఈ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆశిష్ కుమార్ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

04/21/2019 - 23:46

ముంబయి, ఏప్రిల్ 21: ప్రస్తుతం మూతపడిన జెట్ ఎయిర్ వేస్‌కు చెందిన కొన్ని బోయింగ్ 737 విమానాలను లీజుకు తీసుకుని నడిపేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నట్టు భారత అంతర్జాతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు చెందిన ‘ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్’ ఆదివారం నాడిక్కడ తెలిపింది.

04/20/2019 - 23:47

ముంబయి: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, మూతపడిన జెట్ ఎయిర్‌వేస్‌లో పని చేస్తున్న ఉద్యోగులకు స్పైస్ జెట్ రూపంలో కొంత వరకూ ఊరట లభించనుంది. జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన వందకుపైగా పైలట్లు, కేబిన్ ఉద్యోగులు, ఇతరత్రా సిబ్బందిని తమ సంస్థలోకి తీసుకోనున్నట్టు స్పైస్ జెట్ చేసిన ప్రకటన ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది.

04/20/2019 - 23:45

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,090.00
8 గ్రాములు: రూ.24,720.00
10 గ్రాములు: రూ. 30,900.00
100 గ్రాములు: రూ.3,09,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,304.813
8 గ్రాములు: రూ. 26,438.504
10 గ్రాములు: రూ. 33,048.13
100 గ్రాములు: రూ. 3,30,481.3
వెండి
8 గ్రాములు: రూ. 323.20

04/20/2019 - 23:45

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: వెనెజులాపై అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ, వాటిని బేఖాతరు చేస్తూ అక్కడి నుంచి చమురును దిగుమతి చేసుకున్నట్టు వచ్చిన ఆరోపణలను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) ఖండించింది. ఈ వ్యవహారమంతా సక్రమంగానే జరిగిందని, నిబంధనలను అనుసరించే లావాదేవీలు జరిగాయని స్పష్టం చేసింది. ఈ కొనుగోళ్లపై అమెరికాకు ముందుగానే సమచారం ఇచ్చినట్టు తెలిపింది.

Pages