S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/16/2019 - 21:56

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: ఐటీ సేవల దిగ్గజం విప్రో మంగళవారం రూ. 10,500 కోట్ల విలువైన వాటాల బైబ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. గడచిన 15 నెలల కాలంలో ఈ సంస్ధ ఇలా బైబ్యాక్ ఆఫర్‌కు వెళ్లడం ఇది రెండోసారి. 32.3 కోట్ల వాటాలను ఒక్కోవాటా ధర 325 వంతున వాటాదారుల నుంచి కొనుగోలు చేయనుంది. 2016 నుంచి విప్రో సంస్థకు ఇది మూడో బైబ్యాక్ కార్యక్రమం కావడం గమనార్హం. ఆ ఏడాది రూ.

04/16/2019 - 21:54

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,100.00
8 గ్రాములు: రూ.24,800.00
10 గ్రాములు: రూ. 31,000.00
100 గ్రాములు: రూ.3,10,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,315.508
8 గ్రాములు: రూ. 26,524.064
10 గ్రాములు: రూ. 33,155.08
100 గ్రాములు: రూ. 3,31,550.8
వెండి
8 గ్రాములు: రూ. 326.90

04/16/2019 - 21:54

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: భారతీయ టెలికమ్యూనికేషన్ మార్కెట్ ప్రధానంగా మూడు ప్రైవేటు కంపెనీల ఆదర్శప్రాయమైన నిర్వహణతో, ఆరోగ్యకరమైన పోటీతో ముందుకు సాగుతోందని వొడాఫోన్ ఐడియా సంయుక్త సంస్థ మంగళవారం నాడిక్కడ పేర్కొంది. దాదాపు రూ.25వేల కోట్ల మెగా నిధుల సమీకరణ యత్నాల్లో ఉన్న ఈ సంస్థ మార్కెట్‌లో ‘ఏకచత్రాధిపత్యం’, ధరల మాయ వంటివి జరుగుతున్నాయన్న విషయాన్ని తోసిపుచ్చింది.

04/16/2019 - 21:53

ముంబయి, ఏప్రిల్ 16: జెట్ ఎయిర్‌వేస్ త్వర లో తన విమాన సర్వీసుల నిర్వహణలన్నింటినీ తాత్కాలికంగా ఆపివేసే అవకాశాలున్నాయన్న కథనాలు ఆ కంపెనీ వాటాలపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపాయి. ఈ విమానయాన సంస్థ వాటాలు మం గళవారం దాదాపు 8 శాతం మేర నష్టపోయాయి. బీఎస్‌ఈలో మొత్తం 7.62 శాతం నష్టపోయిన ఈ వాటాలు ఒక్కొక్కటి రూ. 241.85 వద్ద ట్రేడయ్యా యి.

04/16/2019 - 06:27

రాజమహేంద్రవరం: గోదావరి జిల్లాల్లో ఈ ఏడాది వర్జీనియా సాగు విస్తీర్ణం పెరిగింది. పొగాకు కొనుగోలుకు వేలం ప్రక్రియ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ తొర్రేడులోని కేంద్ర పొగాకు వేలం కేంద్రంలో సోమవారం వేలం ప్రక్రియ మొదలైంది. ఈ ఏడాది మొత్తం 1373 మంది రైతులు 1464 బ్యారన్లలో 1757 హెక్టార్లలో 3.8 మిలియన్ కిలో ఉత్పత్తికి కేంద్ర పొగాకు బోర్డు నుంచి అనుమతి తీసుకున్నారు.

04/16/2019 - 06:16

సూర్యాపేట, ఏప్రిల్ 15: తెలంగాణలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్‌గా పేరుగాంచిన సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌యార్డును సోమవారం ధాన్యం ముంచెత్తింది. ప్రస్తుత రబీ సీజన్‌లోనే అత్యధికంగా 66,698 బస్తాల ధాన్యం తరలిరావడంతో మార్కెట్ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. వరుసగా రెండురోజుల సెలవుల తర్వాత సోమవారం క్రయవిక్రయాలు జరపగా రైతుల ఒక్కసారిగా ధాన్యం తీసుకువచ్చారు.

04/15/2019 - 23:44

ముంబయి, ఏప్రిల్ 15: నిధులిచ్చి ఆదుకోవాలంటూ ఎస్‌బీఐని, ప్రధాని నరేంద్ర మోదీనీ జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగులు కోరారు. సోమవారం పలువురు పైలెట్లు, ఇంజనీర్లు, ఇతర ఉద్యోగులు జెట్ ప్రధాన కార్యాలయం వద్ద సమావేశమై, మేనేజ్‌మెంట్‌కు మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం కేవలం ఆరేడు విమానాలతో నడుస్తున్న జెట్ ఎయిర్‌వేస్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని అల్లాడుతున్న విషయం తెలిసిందే.

04/15/2019 - 23:42

ముంబయి, ఏప్రిల్ 15: భారత స్టాక్ మార్కెట్ ఈవారం లావాదేవీలకు మొదటి రోజైన సోమవారం లాభాలతో బోణీ చేసింది. అటు బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో, ఇటు జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో ట్రేడింగ్ లాభాలతో ముగిసింది. బీఎస్‌ఈ సూచీ సెనె్సక్స్ 138.73 పా యింట్లు పెరిగి, 38,905.84 పాయింట్లకు చేరింది. అదే విధంగా ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ 46.90 పాయింట్లు పెరగడంతో, 11,690.35 పాయింట్లుగా నమోదైంది.

04/15/2019 - 23:42

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,110.00
8 గ్రాములు: రూ.24,880.00
10 గ్రాములు: రూ. 31,100.00
100 గ్రాములు: రూ.3,11,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,326.203
8 గ్రాములు: రూ. 26,609.624
10 గ్రాములు: రూ. 33,262.03
100 గ్రాములు: రూ. 3,32,620.3
వెండి
8 గ్రాములు: రూ. 326.90

04/15/2019 - 23:41

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: ఈవారం మొదటి రోజునే బులియన్ మార్కెట్ నష్టాలను చవిచూసింది. 10 గ్రాముల బంగారం రూ.200 పతనమై రూ.32,620 చేరుకోగా, కిలో వెండి రూ.80 తగ్గడంతో రూ. 38,100 పడిపోయింది. బంగారం ధర తగ్గడం వరుసగా ఇది నాలుగో రోజు. దేశీయ డిమాండ్ తగ్గడంతోపాటు, అంతర్జాతీయ సూచీలు కూడా సానుకూలంగా లేకపోవడంతో బులియన్ మార్కెట్ దెబ్బతింటున్నది.

Pages