S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/15/2019 - 23:40

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: పునరుద్పాదక విద్యుత్ తయారీకి సంబంధించి డెన్మార్క్‌తో కుదిరిన ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇప్పటికే ఈ రెండు దేశాల ప్రతినిధుల మధ్య ఒప్పందంపై సంతకాలు కూడా జరిగాయి. సముద్ర తీరాలకు దూరంగా, గాలిమరల ఆధారంతో విద్యుత్‌ను తయారు చేయడంపై భారత్, డెన్మార్క్ పరస్పర సహకారాలను ఇచ్చి పుచ్చుకోవాలని ఆ అగ్రిమెంట్‌లో పేర్కొన్నారు.

04/15/2019 - 23:39

ముంబయి, ఏప్రిల్ 15: మధ్యతరహా ఐటీ సంస్థల్లో పేరున్న మాస్‌టెక్ సంస్థ బ్రిటిష్ మార్కెట్‌పై దృష్టి పెట్టింది. అందుకు అవసరమైన పెట్టుబడుల కోసం మెజెస్కోలో తనకు ఉన్న 12 శాతం వాటాలను అమ్మేయాలని ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ఈ ఏడాది చివరిలోగా అమ్మకాల ప్రక్రియ పూర్తికావాలన్న ధ్యేయంతో శరవేగంగా అడుగులు వేస్తున్నది. ఒకప్పుడు మాస్‌టెక్‌కు అనుబంధ సం స్థగా మెజెస్కో ఉండేది.

04/15/2019 - 05:09

న్యూఢిల్లీ: మార్కెట్‌లో అతివిలువైన తొలి పది భారతీయ కంపెనీల్లో ఆరు కంపెనీలు గతవారం గణనీయంగా తమ మార్కెట్ వి లువను కోల్పోయాయి. ఈ కంపెనీలు మొత్తం రూ.42,827.39 కోట్ల రూపాయల మార్కెట్ విలువను కోల్పోగా ఇందులో ఐటీ దిగ్గజం టీసీఎస్ భా రీగా నష్టపోయిన సంస్థగా మిగిలింది.

04/14/2019 - 23:28

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: రెండు సెలవు దినాలతో కూడుకున్న ఈ వారంలో ఈక్విటీ మారెట్లలో వాణిజ్య స్థితిగతులు ప్రధానంగా స్థూల ఆర్థికాభివృద్ధి గణాంకాలు, కార్పొరేట్ సంస్థల ఆదాయాలను అనుసరించి ఉంటాయని మార్కెట్ విశే్లషకులు అంచనా వేస్తున్నారు. స్టాక్ మార్కెట్లు బుధవారం మహావీర్ జయంతి, శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా మూతపడతాయి.

04/14/2019 - 23:41

వాషింగ్టన్‌లో జరిగిన అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్ అభివృద్ధి కమిటీ సమావేశానికి హాజరైన వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మల్పాస్, ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టీన్ లాగార్డె. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ఈ కమిటీ చర్చిస్తుంది. తదుపరి తీసుకోవాల్సిన చర్యలను ఖరారు చేస్తుంది.

04/14/2019 - 23:24

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: భారత ఈక్విటీ, రుణ మార్కెట్లలోకి ఈనెలలో విదేశీ పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. ప్రత్యేకించి విదేశీ పోర్టుపోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారీగా మొగ్గుచూపుతున్నారు. ఈక్రమంలో ఈనెలలో ఇప్పటికే రూ. 11,096 కోట్ల రూపాయలు భారత కేపిటల్ మార్కెట్లలోకి పెట్టుబడులుగా వచ్చాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు ఇందుకు దోహదం చేశాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

04/14/2019 - 23:23

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: వరుస నిర్వహణ లోపాలతో, అవకతవకలతో తీవ్రంగా నష్టపోయి భారత ఆర్థిక మార్కెట్లను తీవ్రంగా కుదిపేసిన ఇన్‌ప్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్) లిమిటెడ్ వ్యవహారంలో ఆ సంస్థ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్‌బావా ఆదివారం అరెస్టు అయ్యారు. ఈ సంస్థ చైర్మన్ హరిశంకరన్ అరెస్టయిన రెండు వారాల తర్వాత రమేష్‌బావా అరెస్టవడం గమనార్హం.

04/14/2019 - 23:23

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: తరగతి గదుల్లో సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచాలే తప్ప తగ్గించే ప్రయత్నం చేయరాదని మైక్రోసాఫ్ట్ వరల్డ్‌వైడ్ ఎడ్యుకేషన్ వైస్-ప్రెసిడెంట్ ఆంథోని సాల్‌సిటో అన్నారు. అయితే విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించాల్సిన ఉపాధ్యాయులే తగ్గించే ప్రయత్నం చేయడం చాలా తప్పని ఆయన అభిప్రాయపడ్డారు.

04/14/2019 - 05:53

ముంబయి: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ), జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో ఈవారం మార్కెట్ ఒడిదుడుకుల మధ్య కొనసాగింది. ఈ అనిశ్చితి కొనసాగుతుందని విశే్లషకులు అనుమానిస్తున్నారు. వారం మొత్తాన్ని పరిశీలిస్తే, ఒక్కోసారి అద్భుత ఫలితాలతో బుల్ రన్ కొనసాగితే, ఒక్కోసారి సెనె్సక్స్, నిఫ్టీ అకస్మాత్తుగా పతనమై, బేర్ కేకలు వినిపించాయి.

04/13/2019 - 23:40

ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) ఆధ్వర్యంలో శనివారం న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో బాలీవుడ్ నటి సోనమ్ కపూర్‌కు జ్ఞాపికను అందచేస్తున్న ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎల్‌ఓ) అధ్యక్షురాలు పింకీ రెడ్డి.

Pages