S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/11/2019 - 22:53

న్యూఢిల్లీ: భారత బులియన్ మార్కెట్ గురువారం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు ఆదుకున్నప్పటికీ, స్వల్పంగా నష్టపోయింది. 10 గ్రాముల బంగారం ధర 50 రూపాయలు పతనం కావడంతో, 33,020 రూపాయలకు చేరింది. అదే విధంగా కిలో వెండి ధర ధర 175 రూపాయలు తగ్గడంతో, 38,550 రూపాయలకు పతనమైంది. విదేశీ పెట్టుబడిదారులు ఆసక్తి చూపకపోవడంతోపాటు, నగల వ్యాపారులు కూడా లావాదేవీల దృష్టి సారించలేదు.

04/11/2019 - 22:51

ముంబయి, ఏప్రిల్ 11: సార్వత్రిక ఎన్నికల తొలివిడత పోలింగ్ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప ఆధిక్యతనే నమోదు చేశాయి. రోజంతా అస్థిరత నడుమ ఊగిసలాడిన అనంతరం బీఎస్‌ఈలో 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 21.66 పాయింట్ల ఆధిక్యతతో 0.06 శాతం లాభాలతో 38,607.01 వద్ద స్థిరపడగా, ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ సైతం 12.40 పాయింట్లు ఎగబాకి 0.11 శాతం లాభాలతో 11,596.70 మార్కు వద్ద ముగిసింది.

04/11/2019 - 22:50

కోల్‌కతాలో గురువారం బ్లాక్ బెరీస్ కాజువల్స్ సరికొత్త కలెక్షన్స్ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరై, తాను సంతకం చేసిన బ్యాట్‌ను ప్రదర్శిస్తున్న భారత వికెట్‌కీపర్, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ దినేష్ కార్తీక్.

04/11/2019 - 22:48

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: మానసిక వత్తిడిని తగ్గించే జనరిక్ ఔషధం ‘ ఫ్లుయోగ్జెటిన్’ మాత్రలను తమ కంపెనీ అమెరికన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టిందని ఔషధ తయారీ సంస్థ ‘లుపిన్’ బుధవారం నాడిక్కడ తెలిపింది.

04/11/2019 - 22:46

మాస్కో కోర్టులో విచారణకు హాజరైన బారింగ్ వస్కోట్ ఇనె్వస్ట్‌మెంట్ ఫండ్ వ్యవస్థాపకుడు మైఖేల్ కల్వరీ. భారీ కుంభకోణాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అతనిని తదుపరి విచారణ నిమిత్తం గృహ నిర్బంధంలో ఉంచాలని కోర్టు ఆదేశించింది.

04/11/2019 - 22:44

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,125.00
8 గ్రాములు: రూ.25,000.00
10 గ్రాములు: రూ. 31,250.00
100 గ్రాములు: రూ.3,12,500.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,342.246
8 గ్రాములు: రూ. 26,737.968
10 గ్రాములు: రూ. 33,422.46
100 గ్రాములు: రూ. 3,34,224.6
వెండి
8 గ్రాములు: రూ. 326.90

04/11/2019 - 22:43

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: గడచిన మార్చి నెలలో ప్యాసింజర్ వాహనాల రీటెయిల్ విక్రయాల్లో గణనీయమైన తగ్గుదల నెలకొంది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఎఫ్‌ఏడీఏ) బుధవారం నాడిక్కడ ఈ మేరకు ప్రకటించింది. గత ఏడాది ఇదే నెలలో జరిగిన విక్రయాలతో పోలిస్తే సుమారు 10 శాతం విక్రయాలు తగ్గి కేవలం 2.42.708 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయని తెలిపింది.

04/11/2019 - 22:42

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: భారత్‌లో తమ సంస్థ వాణిజ్య కార్యకలాపాలను విస్తరించనున్నట్టు అంతర్జాతీయ ఐకేర్ (నేత్ర సంరక్షణ) దిగ్గజం ‘ఆల్కన్’ బుధవారం నాడిక్కడ పేర్కొంది. తమ వాణిజ్య విస్తరణకు, మార్కెటింగ్‌కు భారత్ కీలక క్షేత్రంగా మారుతుందని ఆ సంస్థకు చెందిన అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

04/10/2019 - 23:12

ముంబయి: జెట్ ఎయిర్‌వేస్ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ సంస్థకు మరో సమస్య తలెత్తింది. బకాయిలు చెల్లించని కారణంగా జెట్ విమానాన్ని ఐరోపాకు చెందిన కార్గో సేవల సంస్థ జప్తు చేసింది. ఆమ్‌స్టర్‌డామ్ విమానాశ్రయంలో ఆ విమానాన్ని సదరు కార్గో సంస్థ జప్తు చేసినట్టు ఇక్కడికి సమాచారం అందించింది.

04/10/2019 - 23:10

ముంబయి, ఏప్రిల్ 10: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ), జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) బుధవారం భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. బీఎస్‌ఈలో సెనె్సక్స్ 353.87 పాయింట్లు నష్టపోయి 38,585.35 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ 87.65 పాయింట్లు నష్టపోయి, 11,584.30 పాయింట్లకు పడిపోయింది.

Pages