S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/23/2019 - 22:09

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,282.00
8 గ్రాములు: రూ.26,256.00
10 గ్రాములు: రూ. 32,820.00
100 గ్రాములు: రూ.3,28,200.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,510.16
8 గ్రాములు: రూ. 28,081.28
10 గ్రాములు: రూ. 35,101.6
100 గ్రాములు: రూ. 3,51,016
వెండి
8 గ్రాములు: రూ. 348.80

02/22/2019 - 22:10

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: స్పైస్ పార్కుల అవసరం దేశానికి ఎంతో ఉందని, వీటి వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు అన్నారు. దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో, స్పైస్ పార్కులుసహా సుమారు 1,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ఆయన ఇక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి, జాతికి అంకితమిచ్చారు.

02/22/2019 - 22:08

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: బులియన్ మార్కెట్ శుక్రవారం నష్టాలను చవిచూసింది. విదేశీ పెట్టుబడిదారులు అనాసక్తంగా వ్యవహరించడం, దేశీయ మదుపరుల నుంచి సరైన స్పందన లేకపోవడం బులియన్ మార్కెట్‌ను నిలువునా ముంచేసింది. 10 గ్రాముల పసిడి 330 రూపాయలు తగ్గి, 34,500 రూపాయలకు పతనమైంది. బంగారంతోపాటు వెండి ధరకూ పతనం తప్పలేదు. కిలో వెండి 300 రూపాయలు తగ్గడంతో, 41,360 రూపాయల వద్ద ముగిసింది.

02/23/2019 - 10:29

ముంబయి, ఫిబ్రవరి 22: రిజర్వుబ్యాంకు తాజా విధాన నిర్ణయ సమావేశం తాలూకు మినిట్స్‌ను విడుదల చేయడంతో మదుపర్లు శుక్రవారం ఆచితూచి వ్యవహరించారు. ఈక్రమంలో దేశీయ మార్కెట్ సూచీ సెన్సెక్స్ స్వల్ప నష్టాలను చవిచూడగా, నిఫ్టీ స్వల్ప లాభాలతో ముగిసింది. ప్రధానంగా బ్యాంకింగ్ స్టాక్స్‌పై ఈప్రభావం కనిపించింది.

02/22/2019 - 22:03

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: రిజర్వు బ్యాంకుతో సంబంధం లేకుండా స్వతంత్రంగా వ్యవహరించే ఓ రుణ యాజమాన్య కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ సూచించారు. ‘పబ్లిక్ డెబ్ట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ’(పీడీఎమ్‌ఏ) పేరిట ఏర్పాటు చేసే ఈ ఏజెన్సీ విషయాన్ని గతంలో 2015 బడ్జెట్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించారని ఈ సందర్భంగా రాజీవ్‌కుమార్ గుర్తు చేశారు.

02/22/2019 - 22:03

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,282.00
8 గ్రాములు: రూ.26,256.00
10 గ్రాములు: రూ. 32,820.00
100 గ్రాములు: రూ.3,28,200.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,510.160
8 గ్రాములు: రూ. 28,081.280
10 గ్రాములు: రూ. 35,101.600
100 గ్రాములు: రూ. 3,51,016.00
వెండి
8 గ్రాములు: రూ. 348.80

02/22/2019 - 04:33

న్యూఢిల్లీ: రిటైర్డ్ ఉద్యోగుల పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీని 2018-19 సంవత్సరానికి గాను 8.65 శాతంగా నిర్ణయించినట్టు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ తెలిపారు. గత ఏడాది ఇది 8.55 శాతం ఉండగా, ఈ ఏడాది స్వల్పంగా పెంచినట్టు చెప్పారు. ఈపీఎఫ్‌ఓ సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ (సీబీటి)తో జరిగిన సమావేశంలో ఈ మేరకు అంగీకారం కుదిరినట్టు ఆయన చెప్పారు.

02/21/2019 - 23:26

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: కేసోరాం రేయాన్‌కు చెందిన సైగ్నెట్ ఇండస్ట్రీస్ వచ్చే ఆర్థిక సంవత్సరం రూ.400 కోట్ల రెవెన్యూను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచం మొత్తం మీద ఉన్నత శ్రేణి సెల్యూలోజ్ కలిగి ఉన్న పారదర్శకమైన కాగితం తయారీలో కేసోరాం రేయాన్ అగ్రగామిగా ఉంది. ఈ సంస్థ బీకే బిర్లా గ్రూపులో భాగంగా ఉంది.

02/21/2019 - 23:25

సియోల్, ఫిబ్రవరి 21: భారత ఆర్థిక రంగం బలమైనదని, రానున్న రోజుల్లో మార్కెట్ సైజు ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రపంచం మొత్తం మీద మరే ఇతర దేశం కూడా భారత్ లాగా సాలీనా ఏడు శాతం వృద్ధిరేటును సాధించడం లేదన్నారు.

02/21/2019 - 23:23

ముంబయి, ఫిబ్రవరి 21: వరుసగా రెండోరోజూ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. బీఎస్‌ఈ సెనె్సక్స్ గురువారం 142.09 పాయింట్లు లాభపడగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 54.40 పాయింట్లు ఎగబాకింది. విదేశీ, దేశీయ సంస్థాగత మదుపర్లు వాటాల కొనుగోళ్లు కొనసాగించడంతో పార్మా, లోహ, ఆటో, బ్యాంకింగ్ స్టాక్స్ అధికంగా లాభాలను సంతరించుకున్నాయి.

Pages