S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/24/2019 - 23:54

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: రిజర్వుబ్యాంక్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బ్యాంకుల జాబితా నుంచి మరో మూడు నుంచి నాలుగు బ్యాంకులు బయటపడనున్నాయి. వచ్చే ఆరు నుంచి ఎనిమిది నెలల కాలంలో ఇది జరగవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన నిల్వల బలోపేతం కోసం 48,239 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు కేంద్రం ప్రామ్ట్ కరెక్టివ్ యాక్షన్ (పీఏసీ) ఫ్రేమ్‌వర్క్‌ను చేపట్టిన సంగతి తెలిసిందే.

02/24/2019 - 23:51

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: దేశీయ రుణ మార్కెట్ల నుంచి విదేశీ పోర్టుపోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు) 1,900 కోట్ల రూపాయల విలువైన వాటాలను ప్రస్తుత నెలలో ఇప్పటి వరకు విక్రయించారు. పుల్వామా ఘటనతో సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకున్న క్రమంలో ఈ పరిణామం చోటుచేసుకుందని విశే్లషకులు భావిస్తున్నారు. తాజా గణాంకాల మేరకు విదేశీ పెట్టుబడిదార్లు రూ.2,039 కోట్ల రూపాయలు మన దేశ ఈక్విటీల్లో ఈనెల 22వ తేదీ వరకు మదుపు చేశారు.

02/24/2019 - 23:50

ముంబయి, ఫిబ్రవరి 24: వరుసగా తొమ్మిది రోజుల పాటు కొనసాగిన పతనం నుంచి బయటపడిన స్టాక్ మార్కెట్ గత వారం లాభాలను ఆర్జించింది. స్టాక్ మార్కెట్‌లో లావాదేవీలు జరిగే ఐదు రోజుల్లో, వరుసగా రెండు రోజులు నష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, ఆతర్వాత కోలుకొని, వరుసగా రెండు రోజులు లాభాలను ఆర్జించడం విశేషం. చివరి రోజున స్వల్పంగా పతనమైనప్పటికీ, స్థూలంగా చూస్తే కొత్త వారంలో పరిస్థితి ఆశాజనకంగానే కనిపిస్తున్నది.

02/24/2019 - 23:50

మస్కట్, ఫిబ్రవరి 24: పర్యాటక రంగం మరింతగా పెరుగుతుందని, ఈ ఆర్థిక సంవత్సరాంతానికి రెండంకెల వృద్ధిరేటు సాధ్యమవుతుందని ఒమన్ ఆశిస్తున్నది. భారత్ నుంచి పెరుగుతున్న టూరిస్టులే ఒమాన్ పర్యాటక రంగానికి వెన్నుముకగా ఉన్నారు. జాతీయ ఆదాయంలో అత్యధిక శాతం ఏడు దేశాల సభ్యత్వం ఉన్న గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) నుంచే వస్తున్నది. ఒమన్‌ను సందర్శించే వారిలో భారతీయులే అత్యధికం.

02/24/2019 - 23:45

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: గృహ కొనుగోలుదారులకు ఇదో శుభవార్త. దేశంలో స్థిరాస్తి రంగం పుంజుకోవడానికి ఇది దోహదపడుతుంది. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి.. నిర్మాణంలో ఉన్న గృహాలు వంటి ఆస్తులపై జీఎస్‌టీ రేటును ప్రస్తుతం ఉన్న 12 శాతం నుంచి అయిదు శాతానికి తగ్గించింది. అయితే, దీనికి ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) వర్తించదు.

02/23/2019 - 22:12

ముంబయి, ఫిబ్రవరి 23: స్టాక్ మార్కెట్ ఈవారం కోలుకుంది. గత వారం ఎదుర్కొన్న వరుస నష్టాల ఊబి నుంచి బయటపడి, లాభాల బాట పట్టింది. వారం మొత్తం మీద సెనె్సక్స్ 62.53 పాయింట్లు పెరిగింది. మొదటి రెండు రోజులు స్టాక్స్ నష్టాల్లో ట్రేడైనప్పటికీ, ఆతర్వాత పుంజుకుంది. మొత్తం మీద బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో లావాదేవీలు ఆశాజనకంగానే కనిపించాయి.

02/23/2019 - 22:10

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ఎగుమతులను మరింతగా పెంచాలంటే, వివిధ వస్తుసేవలపై పన్ను, సర్‌చార్జీల మినహాయింపు తప్పనిసరి అన్న వాదన బలంగా వినిపిస్తున్నది. భారత ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్‌ఐఈఓ) కూడా జీఎస్‌టీని పూ ర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నది. అదే విధంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన ఎగుమతులపై సబ్సిడీని ప్రకటించాలని కోరుతున్నది.

02/23/2019 - 22:10

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ప్రైవేటు రంగంలో ఆర్థిక సేవలు అందిస్తున్న కోటక్ మహీంద్ర బ్యాంక్ నుంచి ఐఎన్‌జీ గ్రూప్ వైదొలగిం ది. ఈ విషయాన్ని కోటక్ మహీంద్ర శుక్రవారం విడుదల చేసిన ఒ క ప్రకటనలో పేర్కొంది. ఐఎన్‌జీకి కోటక్ మహీంద్రలో 1.20 శాతం వాటాలు ఉన్నాయి. వాటి విలువ సుమారు రూ.2,800 కోట్లు. నెదర్లాండ్స్‌కు చెందిన ఐఎన్‌జీ గ్రూప్ పూర్తి వాటాలను ఉపసంహరించుకుంది.

02/23/2019 - 22:09

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ఎగుమతుల ప్రక్రియను సులభతరం చేయడంతోపాటు పన్నుల ఎగవేతను నిలువరించడానికి ఉద్దేశించి సలహాలు, సూచనలు ఇవ్వడానికి మూడు వర్కింగ్ గ్రూప్‌లను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సె స్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) నియమించింది.

02/23/2019 - 22:09

ముంబయి, ఫిబ్రవరి 23: దేశంలో 12 జాతీయ బ్యాంకులను (పీఎస్‌బీ) ఆర్థికంగా పటిష్టం చేసేందుకు తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలు ఇవ్వనున్నాయి. కాని ఈ బ్యాంకులకు పెద్దమొత్తంలో మొండి బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. దీని వల్ల సానుకూల ఫలితాలు రావడం లో ఆలస్యమయ్యే అవకాశం ఉంది. 12 ప్రభుత్వ రంగ బ్యాంకులకు దాదాపు రూ.48,239 కోట్ల నిధులను కేటాయించారు. ఈ నిధులతో బ్యాంకులను ఆర్థికంగా బలోపే తం చేయనున్నారు.

Pages