S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/20/2019 - 23:24

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: రిలయన్స్ గ్రూప్ కంపెనీల వాటాలు బుధవారం 10.3 శాతం నష్టపోయాయి. ఈ కంపెనీల చైర్మన్ అనిల్ అంబానీ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతోనే ఈ పరిస్థితి నెలకొందని పరిశీలకులు భావిస్తున్నారు.

02/20/2019 - 23:24

ముంబయి, ఫిబ్రవరి 20: భారత రూపాయి మారకం విలువ బుధవారం స్వల్పంగా పెరిగింది. అమెరికన్ డాలర్‌తో మూడు పైసలు పెరిగి 71.31 రూపాయలకు చేరింది. నిలకడైన చమురు ధరల నేపథ్యంలో విదేశీ పెట్టుబడులు వెనక్కు మళ్లడం బుధవారం కూడా కొనసాగింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్చేంజ్ ( ఫారెక్స్) మార్కెట్‌లో స్థానిక యూనిట్లు 71.29 వద్ద బలంగా ఆరంభమై చివరకు స్వల్ప లాభాలతో 71.31 వద్ద ముగిశాయి.

02/20/2019 - 04:47

ముంబయి: వరుసగా తొమ్మిదో రోజూ దేశీయ మార్కెట్ సూచీలు నష్టాల బాట పట్టాయి. విదేశీ పెట్టుబడులు వరుసగా తరలిపోతుండటంతోబాటు ఐటీ స్టాక్స్‌లో పెద్దయెత్తున వాటాల విక్రయం జరగడం, అంతర్జాతీయంగానూ ప్రతికూల వాతావరణం ఎదవడంతో ఇనె్వస్టర్లు రిస్క్ తీసుకునేందుకు వెనుకడుగు వేశారు.

02/19/2019 - 23:34

ముంబయి, ఫిబ్రవరి 19: భారత, అర్జెంటీనాల మధ్య వాణిజ్య పరమైన బంధాలను బలోపేతం చేసుకోదలిచామని మన దేశంలో పర్యటిస్తున్న అర్జెంటీనా అధ్యక్షుడు వౌరిసియో మక్రి పేర్కొన్నారు. తమ దేశానికి భారత్ మంచి ‘్భవిష్యత్ భాగస్వామి’గా ఉండాలన్నది తమ ఆకాంక్ష అని ఆయన చెప్పారు. న్యూఢిల్లీలో మన దేశానికి చెందిన కొంతమంది నేతలను కలుసుకున్న అనంతరం మంగళవారం నాడిక్కడ జరిగిన వాణిజ్య శిఖరాగ్ర సమావేశంలో పాల్గొని మాట్లాడారు.

02/19/2019 - 23:31

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,252.00
8 గ్రాములు: రూ.26,016.00
10 గ్రాములు: రూ. 32,520.00
100 గ్రాములు: రూ.3,25,200.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,478.075
8 గ్రాములు: రూ. 27,824.6
10 గ్రాములు: రూ. 34,780.75
100 గ్రాములు: రూ. 3,47,807.5
వెండి
8 గ్రాములు: రూ. 348.00

02/19/2019 - 23:31

టోక్యో, ఫిబ్రవరి 19: పడమటి ఇంగ్లాండ్‌లో ఉన్న తమ కంపెనీ కార్ల ఫ్యాక్టరీని 2021లో మూసివేయనున్నట్టు హోండా మోటార్ కో లిమిటెడ్ యాజమాన్య మంగళవారం నాడిక్కడ తెలిపింది. మార్చి 29 నుంచి యూరోపియన్ యూనియన్ మార్కెట్ల నుంచి వైదొలుగుతున్న నేపథ్యంలో ఇంగ్లండ్ ఆర్థిక వ్యవస్థపై అది ప్రతికూల ప్రభావం చూపుతుందని హోండా మోటార్ కో లిమిటెడ్ కంపెనీ భావిస్తోంది.

02/19/2019 - 23:30

భోపాల్, ఫిబ్రవరి 19: పరిశ్రమల స్థాపనకు తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో సమకూరుస్తున్న రాయితీల్లాంటివి తమకు కూడా కల్పించాలని మధ్యప్రదేశ్‌కు చెందిన పారిశ్రామికవేత్తలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు విన్నవించారు. ఈ మేరకు వారు మంగళవారం ముఖ్యమంత్రిని కలిసి చర్చలు జరిపారు.

02/19/2019 - 06:36

న్యూఢిల్లీ: దేశంలో తక్కువ సంఖ్యలో, పెద్ద బ్యాంక్‌లు ఉండడాలన్నదే తన అభిప్రాయమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఆర్థిక రంగం పరిపుష్టం కావడానికి, వేగంగా అభివృద్ధి చెందడానికి ఇది తప్పనిసరి ఆర్‌బీఐ బోర్డు లాంఛన ప్రాయమైన బడ్జెట్ సమావేశం అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. ఐదు అనుబంధ బ్యాంక్‌లు, భారతీయ మహిళా బ్యాంక్ కూడా 2017లో ఎస్‌బీఐలో విలీనమయ్యాయి.

02/18/2019 - 23:50

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: ఇటీవల తగ్గించిన వడ్డీ రేట్లపై ఈనెల 21న బ్యాంకర్లతో సమావేశమై చర్చిస్తామని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఆర్‌బీఐ ఇటీవలే రెపో రేట్లను సవరించిన విషయం తెలిసిందే. వడ్డీ రేటును 0.25 శాతం తగ్గించింది. దీనితో రుణగ్రహీతలకు వడ్డీ భారం 6.5 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గుతుంది.

02/18/2019 - 23:48

ముంబయి, ఫిబ్రవరి 18: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో ఈవారం లావాదేవీలకు మొదటి రోజైన సోమవారం పాత కథే పునరావృతమైంది. వరుసగా ఎనిమిదో సెషన్ కూడా ట్రేడింగ్ నష్టాలను చవిచూసింది. అమ్మకాల ఒత్తిడి పెరగడంతో స్టాక్ మార్కెట్‌కు సమస్యలు తప్పలేదు. విదేశీ నిధుల రాక స్థిరంగా కొనసాగినప్పటికీ, భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందోనన్న ఆందోళన మదుపరులను తమ వద్ద ఉన్న స్టాక్స్ అమ్మకాలకు ప్రేరేపించింది.

Pages