S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/17/2019 - 23:31

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: గత వారం ట్రేడింగ్‌లో పెద్దపెద్ద సంస్థలు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. స్థూలంగా చూస్తే, అత్యంత విలువైన ‘టాప్-10’ కంపెనీల్లో ఐటీసీ మినహా చాలా సంస్థలు ప్రతికూల పవనాలు ఎదుర్కొన్నాయి. 98,862.63 కోట్ల రూపాయల మేరకు మార్కెట్ విలువ తగ్గడం ఈ సంస్థలను ఆందోళనకు గురి చేస్తున్నది.

02/17/2019 - 05:56

ముంబయి: ఈవారం మొత్తం మీద భారత స్టాక్ మార్కెట్‌లో ప్రతికూల ధోరణులు కొనసాగాయి. ఫలితంగా నష్టాలు కొనసాగాయి. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ), జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో ఈవారం ట్రేడింగ్ మొదటి నుంచి చివరి వరకూ నష్టాల్లోనే కొనసాగింది. బీఎస్‌ఈలో సెనె్సక్స్, ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ పతనం స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న అనిశ్చితి, ప్రతికూల సెంటిమెంట్లకు అద్దం పడుతున్నది.

02/16/2019 - 23:36

చెన్నై, ఫిబ్రవరి 16: శానిటరీ వేర్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న జాక్వర్ గ్రూప్ ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయంపై భారీ అంచనాలతో ఉంది. సుమారు 3,900 కోట్ల రూపాయల మేర ఆదాయంపై కనే్నసింది. ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో జాక్వర్ కంపెనీ తన అంచనాలపై ప్రకటన చేయడం గమనార్హం. 2022 నాటికి బిలియన్ డాలర్ల ఆదాయ మైలురాయిని చేరడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్టు జాక్వర్ గ్రూప్ పేర్కొంది.

02/16/2019 - 23:34

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ప్రఖ్యాత ఐటీ కంపెనీ టెక్ మహీంద్ర తన షేర్లను తిరిగి కొనడానికి సన్నాహాలు చేస్తున్నది. ఈనెల 21న జరిగే బోర్డు సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకోనుంది. షేర్స్ బై బ్యాక్ అంశం బోర్డు పరిశీలనలో ఉందని టెక్ మహీంద్ర శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, వివరాలను మాత్రం వెల్లడించలేదు.

02/16/2019 - 23:32

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: జమ్మూకాశ్మీర్ పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడిలో మృతి చెందిన సీఆర్‌పీఎఫ్ అమర జవాన్లకు రిలయన్స్ ఫౌండేషన్ నివాళులర్పించింది. వారి కుటుంబాలకు అండగా మేముంటామంటూ భరోసా ఇచ్చింది. మృతి చెందిన జవాన్ల కుటుంబాల పోషణతోపాటు, వారివారి పిల్లల చదువు బాధ్యతను కూడా తీసుకుంటామని రిలయన్స్ ఫౌండేషన్ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

02/16/2019 - 23:31

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 2,907.00
8 గ్రాములు: రూ.23,256.00
10 గ్రాములు: రూ. 29,070.00
100 గ్రాములు: రూ.2,90,700.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,109.091
8 గ్రాములు: రూ. 24,872.728
10 గ్రాములు: రూ. 31,090.910
100 గ్రాములు: రూ. 3,10,909.10
వెండి
8 గ్రాములు: రూ. 319.20

02/16/2019 - 23:30

హైదరాబాద్, ఫిబ్రవరి 16: సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎస్ చదువుతున్న విద్యార్థులకు ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ పోర్టల్స్ అందుబాటులోకి రావ డం పట్ల కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభు స్వాగతించారు. తాను సీఏ చదువుతున్న రోజుల్లో ఇంత మం చి సదుపాయాలు లేవన్నారు. ఆయన ఒక కార్యక్రమంలో న్యూలర్న్ ఎడ్యుటెక్ ఏర్పాటు చేసిన లెర్న్ క్యాబ్‌ను ప్రారంభించారు.

02/15/2019 - 21:28

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలను అరుణ్ జైట్లీ శుక్రవారం స్వీకరించారు. అనారోగ్యం కారణంగా అమెరికాకు వెళ్లి, అక్కడ ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్న విషయం తెలిసిందే. అనంతరం అక్కడి వైద్యుల అభిప్రాయం తీసుకున్న తర్వాత జైట్లీ మళ్లీ స్వదేశానికి వచ్చారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకూ వేచిచూసిన తర్వాత, శుక్రవారం ఆయన మళ్లీ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

02/15/2019 - 21:27

ముంబయి, ఫిబ్రవరి 15: స్టాక్ మార్కెట్ లావాదేవీలు మరోసారి నష్టాల్లో ముగిశాయి. మొత్తం మీద వరుసగా ఏడో సెషన్‌లోనూ సెనె్సక్స్ పతనం కావడం మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితికి అద్దం పడుతుంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషె మహమ్మద్ పుల్వామాలో జరిపిన మారణకాండ స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపింది. ఇరు దేశాల మధ్య వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారడం ఇనె్వస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.

02/15/2019 - 21:26

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, ఓఎన్‌జీసీ షేర్ల విలువ మాత్రం రెండు శాతం పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం, మూడో త్రైమాసికంలో నికర లాభం 65 శాతం పెరిగినట్టు ఇటీవలే ఓఎన్‌జీసీ ప్రకటించింది. ఈ ఫలితాల ప్రభావం స్టాక్ మార్కెట్‌లో స్పష్టంగా కనిపించింది.

Pages