S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/14/2019 - 04:58

చిత్రం.. బడ్జెట్ సెషన్‌లో భాగంగా బుధవారం రాజ్యసభ ప్రొసీడింగ్స్ దృశ్యం

02/14/2019 - 04:36

ముంబయి, ఫిబ్రవరి 13: ఈ-టెండరింగ్ విధానం ద్వారా వంద కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిన కుంభకోణానికి సంబంధించి ముంబయిలోని పురపాలక శాఖలోని అసిస్టెంట్ మన్సిపల్ కమిషనర్ సహా 62 మంది అధికారులపై కేసులు నమోదయ్యాయి. బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కి చెందిన ముగ్గురు సీనియర్ ఆఫీసర్లతో కూడిన కమిటీ ఈ కుంభకోణంతో సంబంధమున్న ఉద్యోగులపై పలు చర్యలకు సిఫార్సు చేసింది. అవి..

02/14/2019 - 04:35

లండన్: ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు నూతనంగా కృత్రిమ మేథస్సు(ఏఐ)ను శాస్తవ్రేత్తలు అభివృద్ధి చేశారు. యాప్‌లు, వెబ్‌సైట్‌ల రూపంలో జనం జేబులు ఖాళీ అవుతున్న సంగతి తెలిసిందే. లండన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ వార్‌విక్ పరిశోధకులు ఆన్‌లైన్ స్కామ్‌లను అరికట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.కంప్యూటింగ్ లాగర్‌థమ్స్‌ను అభివృద్ధి చేశారు.

02/13/2019 - 23:04

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: త్వరలో కేంద్ర రైల్వే శాఖ ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మకమైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లేదా ట్రైన్ 18లో ప్రయాణీకులు తప్పనిసరిగా భోజనాన్ని ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. శతాబ్ధి, రాజధాని, దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లలో భోజనం ఆర్డర్ అనేది ఐచ్ఛికంగా ఉంది. వారణాసి నుంచి ఢిల్లీ మధ్య ఈ రైలును ముందుగా ప్రవేశపెడుతున్నారు.

02/13/2019 - 23:03

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: అదానీ ట్రాన్స్‌మిషన్ లాభాల్లో పతనం నమోదైంది. 2018 డిసెంబర్ 31 నాటికి ముగిసిన ఈ ఆర్థిక సంవత్స రం మూడో త్రైమాసికంలో లాభాలు భారీగా తగ్గిట్టు కంపెనీ నివేదిక స్పష్టం చేసింది. 77.52 శాతం కోత పడడంతో, లాభం రూ.189.22 కోట్లుగా నమోదైందని పేర్కొంది. స్థూలలాభం 841.88 కోట్ల రూపాయలుకాగా, నికర లాభంలో భారీగా కోతపడిందని కంపెనీ తన నివేదికలో వివరించింది.

02/13/2019 - 23:01

ముంబయి, ఫిబ్రవరి 13: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా బలహీనపడ్డాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ వరుసగా అయిదో సెషన్ బుధవారం వంద పాయింట్లకు పైగా పడిపోయింది. మదుపరులు బ్యాంకింగ్, వాహన, లోహ, ఫార్మా షేర్లలో సెషన్ చివరి గంటలో లాభాల స్వీకరణకు పూనుకోవడం వల్ల ఆరంభంలో ఆర్జించిన లాభాలను నిలబెట్టుకోలేక పోయింది.

02/13/2019 - 23:00

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,236.00
8 గ్రాములు: రూ.25,888.00
10 గ్రాములు: రూ. 32,360.00
100 గ్రాములు: రూ.3,23,600.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,460.963
8 గ్రాములు: రూ. 27,688.704
10 గ్రాములు: రూ. 34,609.63
100 గ్రాములు: రూ. 3,46,096.3
వెండి
8 గ్రాములు : రూ. 342.40

02/13/2019 - 22:58

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: ఆదిత్య మెడిసేల్స్‌తో కలిసి జరుపుతున్న లావాదేవీల వల్ల తమ కంపెనీ వాటాదారులకు ఎలాంటి నష్టం లేదని, ఈ విషయంలో వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సన్ ఫార్మా స్పష్టం చేసింది. దేశంలో ఔషధాల సరఫరాలో అగ్రగామిగా ఉన్న ఆదిత్య మెడిసేల్స్ ఇటీవలే రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టింది. సురక్షా రియాలిటీ అనే సంస్థతో కలిసి 5,800 కోట్ల రూపాయల విలువైన వ్యాపార లావాదేవీలను జరిపింది.

02/14/2019 - 06:01

ముంబయి: చిల్లర ద్రవ్యోల్బణం మరింత తగ్గి జనవరి నెలలో 19 నెలల కనిష్ఠ స్థాయి 2.05 శాతానికి పడిపోయిన కారణంగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఏప్రిల్‌లో తీసుకునే విధాన నిర్ణయంలో రెపో రేట్‌ను మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించి, ఆరు శాతానికి చేర్చే అవకాశం ఉందని ఒక బ్రోకరేజ్ నివేదిక తెలిపింది.

02/13/2019 - 05:46

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 12: రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టులో విస్తరించిన రన్‌వే సహా అభివృద్ధి పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు ఢిల్లీ నుంచి రిమోట్ ద్వారా మంగళవారం ప్రారంభించారు. దీంతో మరో మూడు నెలల్లో తిరుపతి, షిర్డీలతోపాటు అంతర్జాతీయ సర్వీసులు తిరగడానికి అవకాశం ఏర్పడుతుంది.

Pages