S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/24/2018 - 23:12

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,047.00
8 గ్రాములు: రూ. 24,376.00
10 గ్రాములు: రూ. 30,470.00
100 గ్రాములు: రూ.3,04,700.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,258.824
8 గ్రాములు: రూ. 26,070.592
10 గ్రాములు: రూ. 32,588.24
100 గ్రాములు: రూ. 3,25,882.4
వెండి
8 గ్రాములు: రూ. 330.40

12/24/2018 - 02:49

న్యూఢిల్లీ: అత్యంత విలువైన ఆస్తులు కలిగిన టాప్‌టెన్ జాబితాలోని ఆరు కంపెనీలు గత వారం నష్టాలను చవిచూశాయి. మార్కెట్ విలువలో ఈ కంపెనీలు మొత్తం 89,531 కోట్ల రూపాయలను కోల్పోయాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఆస్తుల విలువ సైతం 34 వేల కోట్లకు తగ్గిపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్), ఇన్‌ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంకు, మారుతీ సుజుకీ నష్టాలను మూటగట్టుకున్నాయి.

12/24/2018 - 02:02

కొత్తగూడెం, డిసెంబర్ 23: రానున్న ఐదేళ్లలో సింగరేణి సంస్థ 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీ్ధర్ తెలిపారు. బొగ్గు ఉత్పత్తి ద్వారా రూ. 35వేల కోట్లు లాభాలను గడించాలనే ధ్యేయం తో పనిచేస్తున్నట్లు ప్రకటించారు.

12/24/2018 - 01:29

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: భారత ప్రధాన మార్కెట్లలోకి గడచిన మూడు వారాలుగా విదేశీ పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా విదేశీ ఇనె్వస్టర్లు ఈ మూడువారాల్లో మదుపు చేశారు. అమెరికన్ డాలర్‌తో భారత రూపాయి విలువ పెరగడం, ముడిచమురు ధరల్లో తరుగుదల ఈ పరిణామానికి దోహదం చేశాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

12/24/2018 - 01:28

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: స్విడ్జర్లాండ్‌లోని దావోస్‌లో వచ్చే నెలలో జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యుఈఎల్) వార్షిక సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతోబాటు మరో ముగ్గురు కేంద్ర క్యాబినెట్ మంత్రులు హాజరయ్యే అవకాశాలున్నాయి. వారితోబాటు కొత్తగా ఎంపికైన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తోబాటు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మరో వందమంది సీఈవోలు హాజరుకానున్నారు.

12/24/2018 - 01:27

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా బ్యాం క్, దేనా బ్యాంకులను విలీనం చేయాలన్న ప్రతిపాదన ఈనెలాఖరులోగా కార్యరూపం దాల్చనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జనవరి 8 వరకు జరిగే ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఈ బ్యాం కుల విలీన పథకం చర్చకు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఇప్పటికే ఈ మూడు బ్యాంకులకు సంబంధించిన బోర్డులు విలీన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపాయి.

12/24/2018 - 01:26

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: దేశంలో వైద్య రంగాన్ని ఒకే పరిధి కిందకు తెచ్చే ఉద్దేశ్యంతో జాతీయ మెడికల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. వైద్య రంగంలో ప్రవేశపెట్టిన సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విఫలమయ్యాయని పేర్కొన్నారు. వీటి స్థానంలో జాతీయ స్థాయిలో మెడికల్ కమిషన్ ఏర్పాటు చేయాలని విధానపత్రంలో నీతి ఆయోగ్ పేర్కొంది.

12/24/2018 - 01:25

ముంబయి, డిసెంబర్ 23:ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు చెందిన సుమారు మిలియన్ మంది ఉద్యోగులు ఈనెల 26న ఒక రోజు సమ్మె చేయనున్నారు. తొమ్మిది ఉద్యోగ సంఘాలు ఆదివారం సమ్మెకు పిలుపునిచ్చాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి విజయా, దేనా బ్యాంకులను విలీనం చేయాలన్న ప్రతిపాదనకు నిరసనగా ఈ సమ్మెకు పిలుపునిచ్చినట్టు ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు.

12/22/2018 - 23:26

వాషింగ్టన్, డిసెంబర్ 22: ఎంతోకాలంగా కొనసాగుతున్న అమెరికా వృద్ధి రేటుకు ఇటీవల కాలంలో గండిపడుతున్నది. ఒకవైపు చైనా శర వేగంగా ముందుకు దూసుకురావడం, మరోవైపు గల్ఫ్ దేశాల నుంచి ఎదురవుతున్న రాజకీయ పరమైన వ్యతిరేకతలు అమెరికాను దెబ్బతీస్తున్నాయ.

12/22/2018 - 23:24

ముంబయి, డిసెంబర్ 22: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ) ఈవారం మిశ్రమ ఫలితాలను నమోదు చేసింది. వరుసగా ఏడో రోజు లాభాలను ఆర్జించి, బుల్ పరుగు కొనసాగుతుందనే అభిప్రాయాన్ని కల్పించింది. కానీ, చివరి రెండు రోజుల్లో మార్కెట్ దూకుడుకు కళ్లెం పడింది. వారంతంలో సెనె్సక్స్ పతనంతో ముగిసింది. ఈనెల 14వ తేదీన 35,962.93 పాయింట్లుగా ఉన్న సెనె్సక్స్ ఆతర్వాత క్రమంగా పెరుగుతూ వచ్చింది.

Pages