S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/22/2018 - 23:24

అమెరికా స్టాక్ మార్కెట్ లావాదేవీల కేంద్రం వాల్ స్ట్రీట్‌కు ఎదురైన సంక్షోభం భారత మార్కెట్‌ను దెబ్బతీసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును 0.50 శాతం పెంచడం వాల్ స్ట్రీట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. స్టాక్ మార్కెట్ పతనం ఈవారం 7 శాతంగా నమోదై, 22,445.37 పాయింట్ల వద్ద ముగిసింది. 2008 నాటి ఆర్థిక సంక్షోభం తర్వాత వాల్ స్ట్రీక్ ఒక వారంలో ఇంత భారీగా నష్టపోవడం ఇదే మొదటిసారి.

12/22/2018 - 23:23

ముంబయ, డిసెంబర్ 22: మదుపరులు వచ్చే నెల మొదటి వారం నుంచి ప్రారంభం కానున్న వివిధ కంపెనీల మూడో త్రైమాసిక ఫలితాలపై దృష్టి కేంద్రీకరి స్తున్నారు. భారీ పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి సరైన తరుణం అదేనని భావిస్తున్నట్టు మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈవారం స్టాక్ మార్కెట్ అనూహ్య పతనానికి అది కూడా ఒక కారణమని అంటున్నారు.

12/21/2018 - 23:26

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: అపోల్ టైర్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నీరజ్ కన్వర్ మళ్లీ నియమించే ప్రతిపాదనకు వాటాదారులు ఆమోదించారని ఆ సంస్థ ప్రకటనలో తెలిపిందతి. దీంతో నీరజ్ కన్వర్ ఎండీ పదవిలో 2019 మే 28వ తేదీ నుంచి 2024 మార్చి 31వ తేదీ వరకు కొనసాగుతారు. మొత్తం ఓట్లు 42.29 కోట్లలో 96.72 శాతం ఓట్లు కన్వర్‌కు అనుకూలంగా వచ్చినట్లు అపోలో టైర్స్ పేర్కొంది. 3.28 శాతం ఓటర్లు వ్యతిరేకించారు.

12/21/2018 - 23:25

ముంబయి, డిసెంబర్ 21: ఈవారం లావాదేవీల చివరి రోజైన శుక్రవారం స్టాక్ మార్కెట్ ‘బేర్’మంది. 689.60 పాయింట్లు (1.89 శాతం) పడిపోయిన సెనె్సక్స్ 35,742.07 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 197.70 పాయింట్లు (1.81 శాతం) పతనమై, 10,754 పాయింట్లుగా నమోదైంది. అంతకు ముందు ఏడు రోజుల వరుస లాభాల తర్వాత గురువారం ట్రేడింగ్‌లో భారీ నష్టాలు తప్పవన్న సంకేతాలు కనిపించాయి.

12/21/2018 - 23:23

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: దేనా బ్యాంక్, విజయా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లాంఛనంగా ఆమోదం తెలిపిందనీ, ప్రత్యామ్నాయ విధానం ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు సానుకూలత వ్యక్తం చేసిందనీ బ్యాంక్ ఆఫ్ బరోడా తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ మూడు బ్యాంకుల విలీనం ప్రతిపాదన ఈ ఏడాది 29న తెరపైకి వచ్చింది.

12/21/2018 - 23:20

ముంబయి, డిసెంబర్ 21: తక్కువ ధరకే విమాన ప్రయాణాన్ని సాకారం చేస్తున్న ఎయిర్‌ఏషియా తన విమానాల సంఖ్యను 20కి పెంచుకుంది. ఎయిర్‌బస్ ఏ320ని చేర్చడం ద్వారా, అంతర్జాతీయ మార్గాల్లోనూ విమానాలను నడిపేందుకు అవసరమైన అర్హతను సంపాదించింది. టాటా సన్స్ కూడా భాగస్వామిగా ఉన్న ఎయిర్‌ఏషియా తన నెట్‌వర్క్ పరిధిలోకి ముంబయిని కూడా చేరుస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది.

12/21/2018 - 23:18

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: సెకనులో 500 బెగాబైట్స్ (ఎంబీపీఎస్) డౌన్‌లోడింగ్ సాధ్యమా అనే ప్రశ్నకు అవునననే సమాధానమిస్తున్నాయి భారతీ ఎయిర్‌టెల్, ఎరిక్‌సన్ సంస్థలు. స్వీడన్‌కు చెందిన ఎరిక్‌సన్‌తో కుదిరిన ఒప్పందం మేరకు 4జీ నెట్‌వర్క్‌కు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకునే అవకాశం ఉంది.

12/21/2018 - 17:39

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాల పాలయ్యాయి. ఒక్కసారిగి 689 పాయింట్లు నష్టపోయి రూ.2.26 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైంది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెనె్సక్స్ 35742.07 పాయింట్ల వద్ద ఉండగా, నిఫ్టీ 10754 పాయింట్లకు చేరుకుంది.

12/21/2018 - 03:53

ముంబయి: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో గురువారం లావాదేవీలు అత్యంత నాటకీయంగా కొనసాగాయి. వరుసగా ఏడు రోజులు లాభాలను ఆర్జించిన స్టాక్ మార్కెట్ ఎవరూ ఊహించని విధంగా, ఒక్కసారిగా కుంటుపడింది. ఉదయం ట్రేడింగ్ మొదలైన క్షణం నుంచి ఒడిదుడుకుల మధ్య ప్రయాణం కొనసాగించింది. ఒకానొక దశలో బుల్ రన్‌కు బ్రేక్ పడుతుందని, మార్కెట్ కుప్పకూలుతుందని అనుమానాలు వ్యక్తమయ్యాయి.

12/21/2018 - 02:27

విశాఖపట్నం, డిసెంబర్ 20: ప్రయాణికుల భోజనం ఇక నుంచి ప్రైవేటుపరం కానుంది. రైల్వేకు, ఐఆర్‌సిటీసీలకు ఎటువంటి సంబంధం లేకుండానే కేవలం ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో దీనిని నిర్వహించాలని నిర్ణయించింది. అదీ ఏ-క్యాటగిరీలకు చెందిన రైల్వే స్టేషన్లను గుర్తించి వాటి ద్వారానే తొలి ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. పసందైన రుచులతో ప్రయాణికులకు జన ఆహార్ పేరుతో భోజనం అందించాలనేది రైల్వే ముఖ్య ఉద్దేశ్యం.

Pages