S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/16/2018 - 05:01

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృత ప్రచారంలోకి వచ్చిన బయ్యారం గనుల అంశం మళ్ళీ తెరపైకి వస్తోంది. తెలంగాణ ఆవిర్భవం తర్వాత అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మాణానికి కేంద్రం చొరవ తీసుకోవాలని పలుమార్లు డిమాండ్ చేశారు.

12/16/2018 - 03:20

హైదరాబాద్, డిసెంబర్ 15: రైల్వే ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు ‘రైల్ మదద్ ’ పేరుతో కొత్త మొబైల్‌యాప్‌ను తీసుకొచ్చారు. ప్రయాణంలో బోగీల్లో తమకు ఎదురవుతున్న సమస్యలతో పాటు అపరిశుభ్రంగా ఉన్నా వాటిని తమ మొబైల్ ఫోన్లతో ఫోటోలు తీసి ‘రైల్ మదద్’ యాప్‌కు పంపవచ్చు. ప్రయాణికులు పంపిన సమాచారానికి అధికారుల నుంచి వెంటనే స్పందన ఉంటుంది.

12/16/2018 - 05:00

న్యూఢిల్లీ: తుత్తుకుడిలో వేదాంత లిమిటెడ్ స్టెర్లైట్ కాపర్ ప్లాంట్‌ను తెరిచేందుకు అనుమతిస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ శనివారం ఆదేశాలుజారీ చేసింది. అంతకు ముందు తమిళభాడు ప్రభుత్వం మైనింగ్ కంపెనీనీ మూసివేయాలని ఇచ్చిన ఆదేశాలను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. ఎన్‌జీటీ చైర్‌పర్సన్ ఏకే గోయల్ అధ్యక్షతన ఏర్పాటైన బెంచి శనివారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

12/16/2018 - 03:15

ముంబయి, డిసెంబర్ 15: చాలా కాలం తర్వాత భారత్ మార్కెట్‌లో అడుగుపెట్టిన జావా మోటారుసైకిల్‌కు చెందిన రెండు ఔట్‌లెట్‌లను ప్రారంభించారు. గత నెలే భారత్‌లోకి అడగుపెట్టిన జావా మూడు మోడళ్లను లాంచ్ చేయనుంది. తమ మొదటి రెండు డీలర్‌షిప్‌లను పుణెలో ప్రారంభించామని నిర్వాహకులు తెలిపారు. ఇక్కడ వినియోగదారులు టెస్ట్‌రైడ్, బుకింగ్ చేసుకోవచ్చునని చెప్పారు.

12/16/2018 - 02:59

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,080.00
8 గ్రాములు: రూ.24,640.00
10 గ్రాములు: రూ. 30,800.00
100 గ్రాములు: రూ.3,08,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,294.118
8 గ్రాములు: రూ. 26,352.944
10 గ్రాములు: రూ. 32,941.18
100 గ్రాములు: రూ. 3,29,411.8
వెండి
8 గ్రాములు: రూ. 330.80

12/16/2018 - 02:58

హైదరాబాద్, డిసెంబర్ 15: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువస్తున్న నూతన వ్యాపార విధానాలతో చిన్న, మధ్యతరహా సంస్థలు ఆర్థికంగా బాగుపడుతున్నాయని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా ఉన్న వేణుగోపాలా చారి అన్నారు. శనివారం ఢిల్లీలో జరిగిన బీఎన్‌ఐ క్యాపిటల్ ‘ మెగా బిజినెస్ మీట్’ సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

12/14/2018 - 23:03

ముంబయి, డిసెంబర్ 14: రిజర్వుబ్యాంకు కొత్త గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో తొలిసారిగా శుక్రవారం జరిగిన ఆ బ్యాంకు కీలక సెంట్రల్ బోర్డు సమావేశం పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. సుమారు నాలుగు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా సెంట్రల్ బ్యాంకు పాలనాపరమైన విధివిధానాల (ఫ్రేం వర్క్)పై పునఃసమీక్షించేందుకు అంగీకరించింది.

12/14/2018 - 23:02

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ఉద్దేశపూర్వకంగా రుణాలను చెల్లించని దివాళా కంపెనీలపై ప్రభుత్వ రంగ బ్యాంకులు కఠిన చర్యలు తీసుకుంటున్నాయని లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. గడచిన సెప్టెంబర్ మాసాంతం వరకు ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదార్లపై మొత్తం 2,571 ఎఫ్‌ఐఆర్‌లను సంబంధిత బ్యాంకులు నమోదు చేశాయని, అలాగే 9,363 రికవరీ కేసులు (సూట్‌లు)కూడా న్యాయస్థానాల్లో ఉన్నాయన్నారు.

12/14/2018 - 22:59

వాషింగ్టన్, డిసెంబర్ 14: ప్రతి దేశంలో కేంద్ర బ్యాంకులకు సొంతంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేసే స్వేచ్ఛ ఉండాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ పేర్కొంది. ఈ బ్యాంకులకు స్వేచ్ఛతో పాటు జవాబుదారీతనం కూడా ఉండాలన్నారు. ఆర్‌బీఐ, కేంద్రం మధ్య అగాధం పెరిగిందని వచ్చిన వార్తల నేపథ్యంలో ఐఎంఎఫ్ డైరెక్టర్ గెర్రీ రైస్ చెప్పారు. ఇటీవల ఆర్‌బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసిన విషయం విదితమే.

12/14/2018 - 22:58

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: భారత ఆహార భద్రత, నాణ్యత సాధికార కమిటీ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ) పలు ఈ-కామర్స్ కంపెనీలపై కొరడా ఝళిపించింది. ఈ క్రమంలో స్విగ్గీ, జొమాటో వంటి అనేక ఈ కామర్స్ కంపెనీలు తమ జాబితాల్లో నుంచి సుమారు 10,500 హోటళ్లను తొలగించివేశాయి.

Pages