S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/21/2018 - 03:48

హైదరాబాద్, డిసెంబర్ 20: సింగరేణి బొగ్గుగనుల్లో పని చేస్తున్న కార్మికుల సర్వీసుల క్రమబద్ధీకరణతోపాటు పదోన్నతలకు సింగరేణి యాజమాన్యం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య గురువారం ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ప్రధానంగా మూడు అంశాలపై ఒప్పందం కుదిరింది. పారిశ్రామిక వివాదాల చట్టం, త్రైమాసిక ఒప్పందాలు, సెక్షన్ 12(3)పై రాజీఫార్ములా కుదిరింది.

12/20/2018 - 23:59

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: స్టార్టప్(అంకురాలు) ఏర్పాటుకు అత్యంత అనువైన రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. చిన్న వ్యాపార సంస్థలు ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహం, వౌలిక సదుపాయాలు, పర్యావరణ అనుకూలతలో గుజరాత్ ముందుండి ఉత్తమ రాష్ట్రంగా ఎంపికైంది. ఇండస్ట్రియల్ పాలసీ, ప్రమోషన్ శాఖ (డీఐపీపీ) విడుదల చేసిన ర్యాంకింగ్‌లో గుజరాత్ అగ్రస్థానంలోనిలిచింది.

12/20/2018 - 23:27

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) 25.29 కోట్ల షేర్లను బైబ్యాక్ కార్యక్రమం ద్వారా వెనక్కు తీసుకోనుంది. ఈ షేర్ల మొత్తం విలువ 4,022 కోట్లు కాగా ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు గురువారం ఇక్కడ జరిగిన ఆ సంస్థ బోర్డు సమావేశం ఆమోదముద్ర వేసింది.

12/20/2018 - 23:26

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ప్రభుత్వ రంగంలో పని చేస్తున్న బ్యాంకులు (పీఎస్‌బీ)లకు ఊతమివ్వాలని నిర్ణయించామని, త్వరలోనే సుమారు 83,000 కోట్ల రూపాయలను ఈ రంగంలోకి విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్‌తో జైట్లీ పలు అంశాలను చర్చించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ పీఎస్‌యూ బ్యాంకులకు రాబోయే రెండుమూడు నెలల్లో భారీ మొత్తాలను అందుబాటులో ఉంచుతామన్నారు.

12/20/2018 - 23:26

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్ పథకాల్లో పెట్టుబడులు గడచిన త్రైమాసికంలో తగ్గుముఖం పట్టాయి. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో ఈ పరిస్థితి నెలకొందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. నవంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్ పథకాల్లో మొత్తం 8,414 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి.

12/20/2018 - 23:25

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,065.00
8 గ్రాములు: రూ.24,520.00
10 గ్రాములు: రూ. 30,650.00
100 గ్రాములు: రూ.3,06,500.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,278.075
8 గ్రాములు: రూ. 26,224.6
10 గ్రాములు: రూ. 32,780.75
100 గ్రాములు: రూ. 3,27,807.5
వెండి
8 గ్రాములు: రూ. 328.80

12/20/2018 - 04:33

టోక్యో: ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ (ఐపీఓ) పథకం ద్వారా ప్రజల నుంచి పెద్దమొత్తంలో షేర్లు వసూలు చేసిన బ్యాంకుగా జపాన్‌కు చెందిన కార్పొరేట్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంకు రికార్డు సృష్టించింది. ప్రపంచంలో ఐపీఓ ద్వారా అతిపెద్ద మొత్తంలో నిధులు సమీకరించిన రెండో సంస్ధగా సాఫ్‌బ్యాంకు గణుతికెక్కింది.

12/19/2018 - 23:54

ముంబయి, డిసెంబర్ 19: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో బుల్ రన్ కొనసాగుతున్నది. వరుసగా ఏడో రోజు కూడా లాభాలను ఆర్జించింది. 137.25 పాయింట్లు పెరిగిన సెనె్సక్స్ 36,484.33 పాయింట్ల వద్ద ముగిసింది. సెనె్సక్స్ పెరుగుదల కారణంగా లాభపడిన కంపెనీల్లో ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ ఉన్నాయి.

12/19/2018 - 23:52

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: భారత దేశంలో తయారైన నగలకు విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ, చైనా వంటి దేశాల నుంచి వస్తున్న పోటీ కారణంగా ఎగుమతుల్లో అనిశ్చితి ఏర్పడింది.

12/19/2018 - 23:51

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,065.00
8 గ్రాములు: రూ.24,520.00
10 గ్రాములు: రూ. 30,650.00
100 గ్రాములు: రూ.3,06,500.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,278.075
8 గ్రాములు: రూ. 26,224.6
10 గ్రాములు: రూ. 32,780.75
100 గ్రాములు: రూ. 3,27,807.5
వెండి
8 గ్రాములు: రూ. 330.40

Pages