S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/18/2018 - 00:56

ముంబయి, డిసెంబర్ 17: ఈక్విటీలు వరుసగా ఐదో సెషన్‌లోనూ సోమవారం బెంచ్‌మార్కును అందుకుని లాభాల బాటలో నడిచాయి. 307 పాయింట్లు దక్కించుకుని ప్రధానంగా ఆటో, మెటల్, ఫైనాన్షియల్ స్టాక్స్‌లో ముదుపర్లు ప్రధానంగా పెట్టుబడులు పెట్టారు. అమెరికన్ డాలర్‌తో రూపాయి బలపడటం, సమత్యుల్యమైన వాణిజ్యలోటుతోపాటు విదేశీ నిధుల వెల్లువ ఇందుకు దోహదం చేశాయని పరిశీలకులు భావిస్తున్నారు.

12/18/2018 - 00:54

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,065.00
8 గ్రాములు: రూ.24,520.00
10 గ్రాములు: రూ. 30,650.00
100 గ్రాములు: రూ.3,06,500.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,278.075
8 గ్రాములు: రూ. 26,224.6
10 గ్రాములు: రూ. 32,780.75
100 గ్రాములు: రూ. 3,27,807.5
వెండి
8 గ్రాములు: రూ. 329.60

12/18/2018 - 00:53

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: డీ మానిటరైజేషన్ తర్వాత రూ.2000. రూ 500 కరెన్సీ నోట్లు ఎన్ని ముంద్రించారో వివరించడంలో రిజర్వు బ్యాంకు కరెన్సీ నోట్ల ముద్రణ విభాగం విఫలమైందని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) సోమవారం పేర్కొంది. దేశ ఆర్థిక స్థితిగతులను ప్రభావితం చేసే ఈ అంశంపై దాపరికం అవసరం లేదని తెలిపింది.

12/18/2018 - 00:55

సింగపూర్, డిసెంబర్ 17: రిజర్వుబ్యాంకుపై కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సుస్థిర వత్తిడిని పెంచుతున్న క్రమంలో ప్రచ్ఛన్న యుద్ధం మరింత ముదిరి గత కొనే్నళ్ల నుంచి బ్యాంకింగ్ వ్యవస్థపై, దేశ దీర్ఘకాలిక ఆర్థిక స్థితిగతులపై విపరీత ప్రభావం చూపుతోందని అంతర్జాతీయ రేటింగ్స్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ సోమవారం హెచ్చరించింది.

12/18/2018 - 00:51

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించే క్రమంలో మిథనాల్‌ను గృహోపయోగ వంట ఇంధనంగా వాడాలని నీతి ఆయోగ్ సూచిస్తోంది. ఈ క్రమంలో ఉత్తర్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో 20వేల నుంచి 50వేల మిథనాల్ గ్యాస్ స్టౌలు పంపిణీ చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సరస్వత్ సోమవారం నాడిక్కడ తెలిపారు.

12/17/2018 - 05:06

విశాఖపట్నం: ప్రఖ్యాత కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం కియో మోటార్స్ భారతదేశంలో తన తొలి ఉత్పత్తిని నవ్యాంధ్ర నుంచి మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. భారతదేశంలో తన తొలి ఉత్పత్తి కర్మాగారాన్ని నవ్యాంధ్రలోని అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలోగల యరమంచిలో ఏర్పాటు చేసిన సంగతి విధితమే. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా కియో సంస్థను రాష్ట్రానికి తీసుకువచ్చింది.

12/16/2018 - 23:43

ముంబయి, డిసెంబర్ 16: నరేష్ గోయెల్ నేతృత్వంలోని జెట్ ఎయిర్ వేస్ సంస్ధకు సలహాదారు హోదాలో మూడోసారి తిరిగొచ్చిన మాజీ సీఈవో నికోస్ కర్దాస్సిస్ మరోమారు సంస్థకు గుడ్‌బై చెప్పారా..అవుంనంటున్నాయి ఆ సంస్థ విశ్వసనీయ వర్గాలు.

12/16/2018 - 23:41

వడోదరా, డిసెంబర్ 16: విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ఏ ప్లాంటుకూ బొగ్గు కొరత లేదని, వాస్తవానికి బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు గత అక్టోబర్ మాసంలో 8 నుంచి 9 శాతం అధికోత్పత్తి చేశాయని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం నాడిక్కడ స్పష్టం చేశారు. బొగ్గు కొరత కారణంగా విద్యుత్ ఉత్పాదన నిలిచిపోయిందంటూ ఏ థర్మల్ పవర్ ప్రాజెక్టు నుంచీ ఫిర్యాదులు రాలేదన్నారు.

12/16/2018 - 23:39

వరంగల్, డిసెంబర్ 16: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో వాణిజ్య వాహన విభాగంలో అశోక్ లేలాండ్ ముందంజలో ఉందని ఆటోమోటివ్ మానిఫక్చర్స్ ప్రైవేటు లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ సంఘ్వీ అన్నారు. ఆదివారం వరంగల్‌లో అశోక్ లేలాండ్ 16టైర్ల 4123 మోడల్ వాహనాన్ని ప్రదర్శించారు. పరిశ్రమల్లో 47.50 టన్నుల జీవీడబ్ల్యు (గ్రాస్ వెహికిల్ వెయిట్)తో 16టైర్ల మోడల్‌ను అందించడం ఇదే మొదటి సారి.

12/16/2018 - 23:37

ముంబయి, డిసెంబర్ 16: హోటల్ వ్యాపార రంగం (హాస్పిటాలిటీ ఇండస్ట్రీ)కి ఉజ్వల భవిష్యత్తు ఉందని నిపుణులు విశే్లషిస్తున్నారు. ఈ రంగం రానున్న నాలుగైదేళ్లలో 9 నుంచి 10 శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశాలున్నాయంటున్నారు. గృహావసరాలకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా సరఫరా జరగడం లేదని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా నివేదిక వెల్లడించింది.

Pages