S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/10/2018 - 05:06

న్యూఢిల్లీ: పాసింజర్ వాహనాల తయారీలో స్థిరమైన అభివృద్ధిని సాధిస్తున్న మూడు అగ్రస్థాయి కంపెనీల్లో ఒకటిగా ఎస్‌యూవీ హారియర్‌ను నిలపాలని టాటా మోటార్స్ భావిస్తోంది. పునరాభివృద్ధి చర్యల్లో తలమునకలై ఉన్న ఈ సంస్థ ఇప్పుడిప్పుడే అభివృద్థి చెందుతున్న హారియర్‌పై ప్రత్యేక దృష్టి నిలిపింది.

12/10/2018 - 02:28

ముంబయి, డిసెంబర్ 9: స్టాక్ మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగుతున్నది. గత వారం లావాదేవీలను బట్టి చూస్తే, సోమవారం నుంచి ప్రారంభం కానున్న కొత్త వారంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది ఆసక్తిని రేపుతున్నది. ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇదే వారం వెలువడనున్న నేపథ్యంలో, స్టాక్ మార్కెట్‌పై వాటి ప్రభావం తప్పకుండా కనిపిస్తుందనేది వాస్తవం.

12/10/2018 - 02:25

భీమవరం, డిసెంబర్ 9: ఆక్వా రంగం మీద ప్రత్యేక దృష్టి సారించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే ఆక్వా జోన్లను ప్రకటించనుంది. ఇప్పటికే 9 జిల్లాల్లో సర్వే పనులను పూర్తిచేసి, జిల్లాల వారీగా లెక్క తేల్చింది. దీంతో ఇక నుంచి ఎక్కడ పడితే అక్కడ చెరువులు తవ్వితే చట్టపరంగా కఠినమైన చర్యలు అమల్లోకి రానున్నాయి.

12/10/2018 - 02:23

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: దేశంలో ఆదాయం పన్ను చెల్లింపుదార్లు, పన్ను పరిపాలనపై ఒక సమగ్ర విధానాన్ని టాటా కనె్సల్టెన్సీ సర్వీసస్ 70వ దశకంలోనే రూపొందించింది. దురదృష్టవశాత్తు ఈ ప్రతిపాదనను అప్పటి ఆర్థిక మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. ఈ వివరాలను మేనేజిమెంట్ వ్యూహకర్త శశాంక్ షా ది టాటా గ్రూప్ టార్స్ బేరర్స్ టు ట్రైల్ బ్లేజర్స్ అనే పుస్తకంలో వెల్లడించారు. టాటా గ్రూపును స్థాపించి 150 ఏళ్లు గడిచింది.

12/10/2018 - 02:23

ముంబయి, డిసెంబర్ 9: ఇబ్బందుల్లో బ్యాంకులకు ఆర్థిక పరిపుష్టి కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనను కోటక్ మహేంద్ర బ్యాంకు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ స్వాగతించారు. ఆదివారం నాడిక్కడ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద సుబ్రమణియన్ రచించిన పుస్తకావిష్కరణ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

12/09/2018 - 04:56

న్యూఢిల్లీ: నాణ్యతాపరమైన లోపాలను గుర్తించామని, ఈ కారణంగా జూబిలెంట్ లైఫ్ సంస్థ రూర్కీ శాఖపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను అమెరికా ఆహార, ఔషధ పలనా విభాగం (యూఎస్‌ఎఫ్‌డీఏ) ఆదేశించింది. రూర్కలోని జూబిలెంట్ లైఫ్ శాఖలో ఇటీవల ఎఫ్‌డీఏ అధికారులు తనిఖీలను నిర్వహించారు. ఔషధాలను తయారు చేసే ప్లాంట్, ఇతర విభాగాల్లో కొన్ని లోపాలను గుర్తించారు.

12/08/2018 - 23:42

ముంబయి, డిసెంబర్ 8: ఈవారం మొత్తం మీద స్టాక్ మార్కెట్ పరిస్థితులను, లావాదేవీలు తీరుతెన్నులను పరిశీలిస్తే, నిరుత్సాహంగా కొనసాగిందనే విషయం స్పష్టమవుతుంది. వరుసగా మూడు రోజుల నష్టాల నుంచి లావాదేవల చివరి రోజైన శుక్రవారం కొంత వరకూ కోలుకొని, 361.12 పాయింట్ల మేరకు లాభపడినప్పటికీ, వారం మొత్తాన్ని సమీక్షిస్తే మాత్రం నిరాజనకంగానే కనిపించింది.

12/08/2018 - 23:41

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: ఈనెల ఐదో తేదీతో ముగిసిన కాంట్రాక్టు ప్రకారం మొత్తం 590 టన్నుల స్టీల్ సరఫరా జరిగిందని భారత వస్తు మారక సంస్థ ఐసీఈఎక్స్ ప్రకటించింది. రాబోయే కాలంలో మరింత భారీగా స్టీల్ ఉత్పత్తి, సరఫరా జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది.

12/08/2018 - 23:39

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,055.00
8 గ్రాములు: రూ.24,440.00
10 గ్రాములు: రూ. 30,550.00
100 గ్రాములు: రూ.3,05,500.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,267.038
8 గ్రాములు: రూ. 26,139.04
10 గ్రాములు: రూ. 32,673.8
100 గ్రాములు: రూ. 3,26,738
వెండి
8 గ్రాములు: రూ. 330.00

12/08/2018 - 23:38

భువనేశ్వర్, డిసెంబర్ 8: ఒడిశాలోని బొగ్గు ఆధారిత పరిశ్రమలు గడ్డుకాలం ఎదుర్కొంటున్నాయ. దీంతో రాష్ట్రంలోని పవర్ ప్లాంట్లపై ప్రభావం పడుతుందని పరిశ్రమల వర్గాలు పేర్కొంటున్నాయ. ఈ విషయమై ఉత్కల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (యూసీసీఐ) స్పందిస్తూ దీనిపై ఆలోచనలు చేస్తున్నట్లు పేర్కొంది.

Pages