S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/19/2018 - 23:50

ముంబయి, డిసెంబర్ 19: ఆటోమొబైల్ రంగ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కాంపాక్ట్ ఎస్‌వీయూ విభాగంలో కొత్తగా ఐదు సీట్లతో కూడిన ‘ఎక్స్‌యూవీ 300’ వాహనాన్ని రూపొందించింది. వచ్చే యేడాది ఫిబ్రవరిలో ఈ వాహనాన్ని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనున్నట్టు సంస్థ అధికార వర్గాలు వెల్లడించాయి.

12/19/2018 - 04:39

అమరావతి: ఐటీ, ఐటీఈఎస్, క్రీడలు, వౌలిక సదుపాయాలు, విద్యుత్ తదితర రంగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు, సాంకేతిక సహకారాన్ని అందించేందుకు నెదర్లాండ్స్ సంస్థలు ఆసక్తి కనబరిచాయి. ఈ విషయాలను మంగళవారం ఉండవల్లి ప్రజావేదికలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో జరిగిన సమావేశంలో నెదర్లాండ్స్ రాయబారి మార్టెన్ వాన్ డెన్‌బర్గ్ వివరించారు.

12/19/2018 - 02:27

రాజమహేంద్రవరం, డిసెంబర్ 18: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ)లో అతి త్వరలో నగదు రహిత టిక్కెట్ కార్డులను ప్రవేశ పెట్టనున్నామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్వీ సురేంద్రబాబు చెప్పారు. దీనివల్ల ప్రయాణికులకు చిల్లర సమస్య లేకుండా సరిపడా మొత్తాన్ని కార్డులో వినియోగించుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. అలాగే త్వరలో అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తామన్నారు.

12/19/2018 - 01:13

ముంబయి, డిసెంబర్ 18: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) విధానాన్ని మరింత సరళతరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, 99శాతం వస్తువులను 18శాతం పన్ను పరిధిలోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని ప్రధాని మోదీ తెలిపారు. జీఎస్‌టీ విధానం అమలులోకి వచ్చినప్పుడు రిజిస్టరైన సంస్థలు 65లక్షలు మాత్రమేనని, ఇప్పుడు వీటి సంఖ్య మరో 55లక్షలు పెరిగిందని అన్నారు.

12/19/2018 - 00:59

అమరావతి, డిసెంబర్ 18: ఓ వైపు కడపలో ఉక్కు కర్మాగారానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంటే మరోవైపు రాష్ట్రంలో భారీ ఉక్కు ఫ్యాక్టరీని స్థాపించేందుకు చైనా సంస్థ ముందుకొచ్చింది. సంస్థ ప్రతినిధులు మంగళవారం ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఏడాదికి 7 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం

12/19/2018 - 00:07

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,065.00
8 గ్రాములు: రూ.24,520.00
10 గ్రాములు: రూ. 30,650.00
100 గ్రాములు: రూ.3,06,500.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,278.075
8 గ్రాములు: రూ. 26,224.6
10 గ్రాములు: రూ. 32,780.75
100 గ్రాములు: రూ. 3,27,807.5
వెండి
8 గ్రాములు: రూ. 330.40

12/19/2018 - 00:06

ముంబయి, డిసెంబర్ 18: సూచీలు ఇదివరకు వచ్చిన నష్టాలను సైతం అధిగమించి వరుసగా ఆరో సెషన్‌లోనూ మంగళవారం లాభాల బాటపట్టాయి. సెనె్సక్స్ 77 పాయింట్లు అదనంగా నమోదుచేసి 36,347 వద్ద ముగిసింది. చివరి నిమిషాల్లో పార్మా, లోహ, వౌలిక వస్తువుల నిల్వల్లో పేర్లను మదుపర్లు అమ్మకాలకు పెట్టడంతో కొంత వత్తిడికి గురయ్యాయి.

12/19/2018 - 00:05

లండన్, డిసెంబర్ 18: పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్‌మాల్యాకు న్యాయపరమైన చిక్కులు మరింతగా ముదిరాయి. భారత్‌లో బ్యాంకులను మోసగించి లండన్ పారిపోయిన మాల్యాకు అక్కడి హైకోర్టులోనూ విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

12/19/2018 - 00:03

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: వచ్చే మార్చినాటికి ‘అందరికీ విద్యుత్’ లక్ష్యాన్ని చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఇందులో భాగంగా 2019 నుంచి విద్యుత్ శాఖలో సంస్కరణలను అమలు చేసే అజెండాతో ముందుకెళ్లాలని నిర్ణయించింది.

12/18/2018 - 03:58

భూపాలపల్లి/గణపురం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ సమీపంలో ఉన్న కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ) రెండో దశ 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను నిలిపివేసి వార్షిక మరమ్మతులు చేపట్టనున్నారు. గత వారం రోజులుగా రెండో దశలో టర్బన్ జనరేటర్ స్టేటార్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యతో ప్లాంట్‌ను నిలిపవేసిన విషయం తెలిసిందే.

Pages