S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/08/2018 - 23:38

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో భారీ కుంభకోణానికి పాల్పడిన భారతీయుడిపై న్యూయార్క్‌లో కేసు నమోదైంది. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం సింగపూర్‌లోని ఇనె్వస్ట్‌మెంట్ బ్యాంక్ ఉద్యోగి గన్నమనేని రాజేశ్వర్ ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో భారీగా అవతవకలకు పాల్పడ్డాడని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి సుమారు ఆరు లక్షల డాలర్ల వరకూ అక్రమంగా సంపాదించాడని అభియోగాలు ఉన్నాయి.

12/08/2018 - 23:47

ముంబయి, డిసెంబర్ 8: బులియన్ మార్కెట్‌లో గత వారం చివరి రోజైన శనివారం 10 గ్రాముల బంగారం ధర రూ.250 పెరిగి, రూ. 32,350 చేరుకోవడం కొత్త వారంలోనూ అదే ట్రెండ్ కొనసాగే అవకాశాలున్నాయన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోలియం ధర పెరుగుదలతోపాటు డాలర్‌కు రూపాయి మారకం విలువ తగ్గడంతో స్టాక్ మార్కెట్ నీరసించింది. అదే సమయంలో బులియన్ మార్కెట్ మరింత బలపడింది.

12/08/2018 - 04:40

ముంబయి: ఈవారం మొదటి నుంచి నష్టాల్లో నడిచిన సెనె్సక్స్ శుక్రవారం కోలుకుంది. 361.12 పాయింట్లు (1.02 శాతం) మెరుగుపడడంతో 35,673.25 పాయింట్లకు చేరుకుంది. ఈవారం స్టాక్స్ లావాదేవీలకు చివరి రోజైన శుక్రవారం నిఫ్టీ కూడా 92.55 పాయింట్లు (0.87 శాతం) లాభపడి 10,693.70 పాయింట్లుగా ముగిసింది.

12/08/2018 - 01:47

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో నిర్మించతలపెట్టిన నాలెడ్జ్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని విద్యావేత్తలు, విద్యాసంస్థలను ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఏపీ సీఆర్‌డీఏ, సెంటర్ ఫర్ స్ట్రాటజీ అండ్ లీడర్‌షిప్ (సీఎస్‌ఎల్)

12/08/2018 - 00:02

విశాఖపట్నం, డిసెంబర్ 7: రాష్ట్రానికి విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పర్యటిస్తూ రాష్ట్ర పర్యాటక ప్రత్యేకతలు వివరిస్తూ బృందాలు పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్రంలో బౌద్ధారామాలు, బౌద్ధం వర్ధిల్లిన ప్రాంతాలను సందర్శించాలంటూ బౌద్ధులు ఎక్కువగా ఉండే దేశాలను సందర్శిస్తున్నాయి.

12/07/2018 - 23:28

ముంబయి, డిసెంబర్ 7: నారీమన్ పాయింట్‌లోని 23 అంతస్థుల ఎయిర్ ఇండియా భవనంపై జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ), జనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ) కనే్నశాయి. ఈ భవనాన్ని అమ్మాలన్న ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం వద్ద చాలాకాలంగా ఉంది. కానీ, ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, భవనాన్ని అమ్మకానికి పెడితే, దానిని సొంతం చేసుకోవడానికి ఎల్‌ఐసీ, జీఐసీ ఉబలాటపడుతున్నాయి.

12/07/2018 - 23:27

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,030.00
8 గ్రాములు: రూ.24,240.00
10 గ్రాములు: రూ. 30,300.00
100 గ్రాములు: రూ.3,03,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,220.00
8 గ్రాములు: రూ. 25,760.00
10 గ్రాములు: రూ. 32,200.00
100 గ్రాములు: రూ. 3,22,000.00
వెండి
8 గ్రాములు: రూ. 329.60

12/07/2018 - 23:26

ముంబయి, డిసెంబర్ 7: నష్టాల నుంచి స్టాక్ మార్కెట్ శుక్రవారం బయటపడి లాభాల బాటపడితే, అందుకు భిన్నంగా బులియన్ మార్కెట్ లాభాలకు బ్రేక్ పడింది. పది గ్రాముల బంగారం ధర 20రూపాయలు తగ్గి, 32,100 రూపాయలుగా నమోదైంది. ఈవారం ప్రారంభంలో 31,850 రూపాయలుగా ఉన్న బంగారం ధర బుధవారం నాటికి 31,950 రూపాయలకు చేరింది. గురువారం మరికొంత పెరిగి, 32,120 రూపాయల వద్ద ముగిసింది.

12/07/2018 - 23:26

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: వావ్ ఎయిర్‌లైన్స్ సంస్థ విస్తరణకు నడుం బిగించింది. ఆర్థిక ఇబ్బందులతో అతలాకుతలమవుతున్న ఈ సంస్థ ఇటీవలే ఇండిగో వంటి సంస్థలతో చర్చలు జరిపింది. ఐస్‌లాండ్‌లో జరిగిన ఈ చర్చలు సఫలమయ్యాయని, అందుకే విస్తరణ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నదని నిపుణులు అంటున్నారు.

12/07/2018 - 23:24

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: మ్యూచువల్ ఫండ్స్ ఆధ్వర్యంలోని నిర్వాహణ ఆస్తులు (ఏయూఎం) గత నెల గణనీయంగా తగ్గాయి. వివిధ క్లయింట్స్ తరఫున, ఆయా కంపెనీల నిర్వాహణ బాధ్యతను మ్యూచువల్ ఫండ్స్ చేపడుతుంది. అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్ లేదా ఏయూఎంగా పిలిచే ఈ ఆస్తుల విలువ ఈ ఏడాది జనవరిలో 22,41,275 కోట్ల రూపాయలు ఉంది.

Pages