S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/23/2018 - 23:57

ముంబయి, నవంబర్ 23: బీజేపీ సీనియర్ నేత మంగళ్ ప్రభాత్ లోధా నేతృత్వంలో ముంబయి నగరంలో నిర్వహిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ ‘లోథాగ్రూప్’ దేశంలోకెల్లా అత్యంత సంపన్న రియల్ ఎస్టేట్ సంస్థగా ఆవిర్భవించింది. ఈమేరకు హరుణ్ రిపోర్ట్ అండ్ గ్రోహ్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ నిర్వహించిన ప్రత్యేక సర్వేలో వెల్లడైంది.

11/22/2018 - 23:57

ఆదోని, నవంబర్ 22: ఉల్లి ధర కిలో రూ.2కు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్‌లో వ్యాపారులు గురువారం రైతుల నుంచి కింటాలు ఉల్లిని రూ.200కు కొనుగోలు చేశారు. ధర ఒక్కసారిగా పడిపోవడంతో ఉల్లిరైతులు డీలా పడ్డారు. అప్పు చేసి పంట సాగుచేస్తే చివరకునష్టాలు వచ్చాయని వాపోయారు. ధర అమాంతం పడిపోవడంతో లారీల బాడుగ కూడా రాని పరిస్థితి నెలకొందని భోరుమన్నారు.

11/22/2018 - 23:32

ముంబయి, నవంబర్ 22: తాజాగా విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, ప్రపంచ స్టాక్ మార్కెట్లలో నెలకొన్న బలహీన ధోరణి మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లలో గురువారం లోహ, పీఎస్‌యూ, వాహన, బ్యాంకింగ్ రంగాల షేర్లు తీవ్రమయిన అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దీంతో మార్కెట్ కీలక సూచీలు పడిపోయాయి.

11/22/2018 - 23:31

ముంబయి, నవంబర్ 22: బంగా రం ధర గురువారం స్వల్పంగా పెరిగింది. బులియన్ మార్కెట్ దాదాపుగా స్థిరంగా కొనసాగడంతో, చివరికి 10 గ్రాముల బంగారం ధర 90 రూపాయలకు పెరిగి, 32,040 రూపాయలకు చేరింది. ఈనెల 26న 32,015 రూపాయలుగా ఉన్న ధర ఆతర్వాత 32,100 రూపాయలకు చేరింది. కానీ, 20న 32,000 రూపాయలకు, బుధవారం 31,950 రూపాయలకు పడిపోయింది. కానీ, గురువారం తేరుకొని, స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది.

11/22/2018 - 23:30

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము : రూ. 3,035.00
8 గ్రాములు : రూ.24,280.00
10 గ్రాములు : రూ. 30,350.00
100 గ్రాములు : రూ.3,03,500.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము : రూ. 3,245.989
8 గ్రాములు : రూ. 25,967.912
10 గ్రాములు : రూ. 32,459.89
100 గ్రాములు : రూ. 3,24,598.09
వెండి
8 గ్రాములు : రూ. 330.40

11/22/2018 - 23:29

హైదరాబాద్, నవంబర్ 22: గృహ, వాణిజ్య అవసరాలకు అనుగుణంగా టీవీఎస్ నూతనంగా రూపొందించిన టీవీఎస్ ఎక్స్‌ఎల్ 100 హెవీడ్యూటీ ఐ టచ్ స్టార్ట్ వాహనం మార్కెట్‌లోకి విడుదల చేశారు. మొబైల్ చార్జింగ్ యూనిట్ ఉండటం దీని ప్రత్యేకత. నగరంలో జరిగిన కార్యక్రమంలో టీవీఎస్ ఎక్స్‌ఎల్ 100 ‘ఐ టచ్ స్టార్ట్’ వాహనంను యుటిలిటీ ప్రోడక్ట్స్ సంస్థ ఉపాధ్యక్షుడు వైద్యనాథన్, కంపెనీ ప్రతినిధి బాలాజీలు మార్కెట్‌లోకి విడుదల చేశారు.

11/22/2018 - 23:27

ముంబయి, నవంబర్ 22: బజాజ్ ఆటో సంస్థ నుంచి డిస్కవరీ 100 సీసీ బైక్‌ను విడుదల చేయడం తాము చేసిన అతిపెద్ద తప్పిదమని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ గురువారం నాడిక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపారు. ఈ నిర్ణయం తమ కంపెనీని రెండో స్థానానికి దిగజార్చిందని ఆయన చెప్పారు.

11/22/2018 - 23:27

న్యూఢిల్లీ, నవంబర్ 22: కష్టాల్లో కూరుకుపోయిన ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ గ్రూప్‌లోని రవాణా నెట్‌వర్క్స్ విభాగం గడచిన త్రైమాసిక ఫలితాలను ప్రకటించడంలో ఆలస్యం అవుతోంది. ఎన్‌సీఎల్‌టీ ఇన్‌సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ కారణంగానే త్రైమాసిక ఆర్థిక పరిస్థితులను స్టాక్ ఎక్చేంజీల్లో ఫైల్ చేయడంలో ఆలస్యం జరిగిందని ఆ విభాగం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలో తమ వివరాలను ప్రకటిస్తామని చెలిపింది.

11/22/2018 - 23:26

న్యూఢిల్లీ, నవంబర్ 22: ముంబయి పోర్టు ట్రస్ట్ (ఎంపీటీ)కు 242 కోట్ల రూపాయలు పరిహారంగా చెల్లించాలని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ)ని మేజర్ పోర్ట్స్ టారిఫ్ అథారిటీ (టామ్ప్) ఆదేశించింది. ముడిచమురు (క్రూడ్ ఆయిల్)ను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఓడరేవుకు అనుబంధంగా ఏర్పాటు చేసిన రెండు పైప్‌లైన్ల ద్వారా రవాణా చేసినందుకుగాను ఈ పరిహారం చెల్లించాలని టామ్స్ ఆదేశాల్లో పేర్కొంది.

11/22/2018 - 04:27

అమరావతి: రాష్ట్రంలో రహదార్ల అభివృద్ధి.. విస్తరణ.. అనుసంధానానికి మార్గం సుగమమైంది. జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలు, మండల కేంద్రాల నుంచి సమీప మండలాలకు రెండువరుసల రహదార్లను ఏర్పాటు చేయటం ద్వారా కనెక్టివిటీని పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు జరుపుతోంది.

Pages