S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/10/2018 - 23:35

అమరావతి, సెప్టెంబర్ 10: ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచ ప్రమాణాలతో కూడిన బిజిసెన్ స్కూళ్ల ఏర్పాటుకు సీఐఐ ప్రతినిధి బృందం సంసిద్ధత వ్యక్తం చేశారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సీఐఐ మాజీ చైర్మన్ నౌషాద్ ఫోర్బ్స్ తదితరులు కొద్దిసేపు సమావేశమయ్యారు. విశాఖపట్నం, అమరావతిలో రెండు బిజినెస్ స్కూళ్లను ముందుగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం 50 ఎకరాల చొప్పున భూములు కేటాయించాలని కోరారు.

09/10/2018 - 23:33

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: పెట్రోలు, డీజిల్ ధరలు సోమవారం కూడా పెరిగాయి. సోమవారం పెట్రోల్ లీటరు ధర 23 పైసలు, డీజిల్ 22 పైసలు పెరిగాయి. పెట్రో ధరల పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోలు అత్యధికంగా 80.73 రూపాయలు కాగా, డీజిల్ 72.83 రూపాయల వరకు పెరిగింది. అయితే, మిగిలిన అన్ని మెట్రో ప్రాంతాలు, రాష్ట్రాల రాజధానులతో పోల్చుకుంటే ఢిల్లీ పన్నులు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇంధన వనరుల రేటు తక్కువే.

09/10/2018 - 23:33

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)కి వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరి పుర్వి దీపక్ మోదీకి ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలపై ఆమెకు అంతర్జాతీయ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ విషయాన్ని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి.

09/10/2018 - 23:32

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 2,996.00
8 గ్రాములు: రూ.23,968.00
10 గ్రాములు: రూ. 23,960.00
100 గ్రాములు: రూ.2,99,700.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,230.00
8 గ్రాములు: రూ. 25,840.00
10 గ్రాములు: రూ. 32,300.00
100 గ్రాములు: రూ.3,23,000.00
వెండి
8 గ్రాములు: రూ. 316.00

09/10/2018 - 16:27

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ బీఎస్‌ఈ సెనె్సక్స్ 400 పాయింట్లు నష్టపోయి 37,971 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 138 పాయింట్లు నష్టంతో 11,450 దగ్గర ట్రేడ్ అవుతుంది. డాలర్ మారకం విలువ రూ.73గా ఉంది.

09/10/2018 - 12:12

న్యూఢిల్లీ : మరోసారి రూపాయి బలహీనపడింది. సోమవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 45 పైసలు క్షీణించి 72.18 వద్ద ముగిసింది. దీంతో జీవితకాల కనిష్టానికి రూపాయి విలువ పడిపోయింది. ముడి చమురు ధరలు పెరగడంతో భారీస్థాయిలో దేశీయ కరెన్సీపై ప్రభావం పడింది.

09/10/2018 - 04:25

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, ప్రస్తుతం ఒకటిగా కలిసి వొడాఫోన్, ఐడియా తదితర సర్వీస్ ప్రొవైడర్లకు టెలికారం నియంత్రణ సంస్థ (ట్రాయ్) జరిమానా విధించింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వినయోగదారులకు సరైన సేవలను అందించడంలో విఫలమైన కారణంగా ఈ వడ్డింపు చేసింది. 2016లో మొబైల్ రంగంలోకి సంచలనాత్మక ప్లాన్స్‌తో దూసుకొచ్చిన రిలయన్స్ జియోపై 34 లక్షల రూపాయలు జరిమానా విధించినట్టు సమాచారం.

09/10/2018 - 02:15

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: రూపాయలు మారకపు విలువను పెంచడానికి, బ్యాంకులపై నమ్మకాన్ని కల్పించడానికి భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్‌బీఐ) తీసుకుంటున్న చర్యలు చెప్పుకోదగ్గ ఫలితాలను ఇవ్వడం లేదు. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు పెరగాలంటే ఎగుమతుల్లో పెరుగుదల అత్యవసరం. ఈ దిశగానే ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పలు ప్రతిపాదనలు చేశారు. ప్రణాళికలను రూపొందించారు.

09/10/2018 - 02:13

ఈ-కామర్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), ఈ-కామర్స్ విధానాలను వ్యతిరేకిస్తూ అమృత్‌సర్‌లో ఆదివారం భారీ ప్రదర్శన చేస్తున్న పంజాబ్ పంపిణీదారుల సంఘం ప్రతినిధులు. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల దేశంలోని వ్యాపారులు భారీగా నష్టపోతున్నారని వారు ఆరోపించారు.

09/10/2018 - 02:10

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: దుబాయ్‌లో అత్యంత అధునాతనమైన సైబర్ సెక్యూరిటీ రెస్పాన్స్ (సీఎస్‌ఆర్) సెంటర్‌ను ఏర్పాటు చేసినట్టు టాటా కమ్యునికేషన్స్ ప్రకటించింది. ఇరవై నాలుగు గంటలూ ఈ సీఎస్‌ఆర్ వ్యవస్థ పని చేస్తుందని తెలిపింది. మధ్య తూర్పు ప్రాంతంలో ఇటీవల సైబర్ నేరాలు పెరగడంతో, సీఎస్‌ఆర్ సేవలు అక్కడ ప్రాధాన్యతను సంతరించుకున్నట్టు బీఎస్‌ఈ ఫైలింగ్‌లో టాటా కమ్యునికేషన్స్ వివరించింది.

Pages